లోక్ సభఎన్నికలు: భారత దేశంలో ఎన్నికల చరిత్ర -2

షేర్ చెయ్యండి


ప్రజాస్వామ్య  భారత దేశంలో ఎన్నికల చరిత్ర తెలుసుకోవడం వలన ప్రజాస్వామ్యం లో ఎన్నికల ముఖ్య ఉద్దేశ్యం అర్ధం అవుతుంది. లోక్ సభ కు జరిగిన ఎన్నికలు ఆనాటి రాజకీయ వాతావరణం, మరియు ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అవగతం అవుతుంది.

ఎనిమిదో లోక్ సభ – 1984-85

భారత దేశ ఎన్నికల చరిత్రలో ఒక పార్టి అత్యధిక లోక్ స్థానాలు గెలవడం ఏమిదొవ లోక్ సభ ఎన్నికల్లో జరిగింది. ప్రధాని ఇందిరా గాంధీ ని అంగరక్షకులు అక్టోబర్ 31, 1984 లో హత్య చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సానుభూతి ఓట్లు పడటం తో 403 స్థానాల్లో కాంగ్రెస్ పార్టి  అఖండ విజయం సాధించింది. 


 ఇందిరా గాంధీ మరణించడంతో ఆపద్ధర్మ ప్రధానిగా రాజీవ్ గాంధీ ప్రమాణస్వీకారం చేసాడు.రాజీవ్ గాంధీ తన ప్రచారంలో ఎక్కువశాతం తన కుటుంబం ఈ దేశానికి చేసిన సేవ గురించి ప్రచారం చేసాడు. ఈ ఎన్నికల్లో 50 శాతం కి పైగా ఓట్లు మద్దత్తు కాంగ్రెస్ పార్టికి సాధించుకుంది.   


తొమ్మిదొవ లోక్ సభ -1989


తొమ్మిదొవ లోక్ సభ కు జరిగిన ఎన్నికలు దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది.  మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా కూటమి గా ఏర్పడి విజయం సాధించారు. ఆనాటి సోషలిస్టు నాయకుల రాజకీయ వారసులు సంకీర్ణ ప్రభుత్వాలకు పురుడుపోసారు. 


రాజీవ్ గాంధీ ప్రభుత్వం బోఫర్స్ కుంభకోణం, పంజాబ్ లో ఉగ్రవాదం మరియు శ్రీలంక లో LTTE మరియు ప్రభుత్వం మధ్య పరోక్ష యుద్ధం నేపథ్యంలో భారత సైనికులను శ్రీలంక పంపడం లాంటి కీలక అంశాలలో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టి ప్రజల విశ్వాసం కోల్పోయింది. 


రాజీవ్ గాంధీ ప్రభుత్వం లో రక్షణ శాఖ మంత్రి గా ఉన్న విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ( వి పి సింగ్ ) రాజీవ్ గాంధీ మీద చేసిన ఆరోపణల వలన పదవి నుండి దిగిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో విపి సింగ్ తన మద్దతుదారులు అయిన ఆరిఫ్ మహ్మద్ ఖాన్, అరుణ్ నెహ్రు లతో కలిసి ‘జన మోర్చా ‘ అనే పార్టి ని స్థాపించి లోక్ సభ కు జరిగిన ఎన్నికల్లో అలహాబాద్ నుండి ఎన్నిక అయ్యారు. 

Also read  ఎన్నికలు: భారత దేశ ఎన్నికల చరిత్ర-1


వి పి సింగ్ నేతృత్వంలో అక్టోబర్ 11, 1988 లో జనతాదళ్ పార్టి ఆవిర్భవించింది. కాంగ్రెస్ (ఎస్), లోక్ దళ్ , జనతా పార్టి, జన మోర్చా లాంటి పార్టిలు జనతా దళ్ లో విలీనం అయ్యాయి. 


లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో 143 స్థానాలు విపి సింగ్ నేతృత్వంలో జనతా దళ్ కైవసం చేసుకుని, బిజెపి మరియు సిపిఐ, సిపియం మద్దత్తు మరియు ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి నేషనల్ ఫ్రంట్ గా ఏర్పడి విపి సింగ్ ని ప్రధాని గా ఎన్నుకున్నారు. 


ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి 197  లోక్ సభ స్థానాలు గెలుచుకుని అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టి గా గుర్తింపు ఉన్నా ప్రభుత్వం ఏర్పడటానికి ఏ పార్టి మద్దత్తు ఇవ్వకపోయేసరికి ప్రతి పక్షం లో కూర్చోవాల్సి వచ్చింది. ఆనాటి జన సంఘ్ పార్టి భారతీయ జనతా పార్టి గా రూపు మార్చుకుని అదే అటల్ బిహారీ వాజపాయ్, ఎల్కే అద్వానీ లు విపి సింగ్ కు మద్దత్తు పలికారు.

అయితే ఎల్కే అద్వానీ రధ యాత్రను బీహార్ లో ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ అడ్డుకోవడం తో 85 మంది లోక్ సభ సభ్యులు ఉన్న బిజెపి విపి సింగ్ ప్రభుత్వానికి మద్దత్తు ఉపసంహరించుకుంది. 


లోక్ సభ లో మెజారిటి సాధించడం లో విఫలం అయ్యేసరికి ప్రధాని విపి సింగ్ రాజీనామా చేశారు. అనూహ్య పరిణామాల మధ్య జనతాదళ్ చీలిపోయి చంద్ర శేఖర్ నాయకత్వంలో ఏర్పడిన  సమాజ్ వాదిజనతా పార్టికి  కాంగ్రెస్ మద్దతు పలికింది.

కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ మీద గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ ఏడాది తర్వాత చంద్ర శేఖర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.   

Also read  ఓటు హక్కు: దళితులకు ఓటు హక్కు కల్పించిన డా. అంబేడ్కర్!

పదో లోక్ సభ – 1991

తొమ్మిదో లోక్ సభ అర్ధాంతంగా ముగియడంతో 10 వ సారి దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కులం, మతం అనేవి ఎన్నికల్లో తెరపైకి వచ్చాయి.

విపిసింగ్ నేతృత్వంలో జనతాదళ్ మండల్ కమీషన్ అమలు పునాదిగా ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తే, బిజెపి రామ మందిర్ విషయం ఎన్నికల ప్రధాన నినాదం గా ప్రచారం చేసింది. 


కాంగ్రెస్ పార్టి రాజీవ్ గాంధీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాల విఫలం మీద ప్రచారం చేసాడు. ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశ పూర్తి అయిన తర్వాత తమిళనాడు లో జరిగిన ఎన్నికల ప్రచార సభ లో LTTE తీవ్ర వాదుల చేతిలో హతం అయ్యేడు. 


కొన్ని వారలు వాయిదా తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎన్నికల మీద పెద్దగా ఆశక్తి కనపరచలేదు. 50 శాతం ఓటర్లు మాత్రమే ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్ శాతం గా రికార్డ్ కు ఎక్కింది.


కాంగ్రెస్ పార్టి 232 స్థానాలు గెలుచుకోగా బిజెపి 120, జనతాదళ్ 59 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టి పివి నరసింహారావు నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 


పదకొండవ లోక్ సభ – 1996


పివి నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టి ఆర్ధిక సంస్కరణలకు నాంది పలికింది. కానీ పదకొండవ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి తమ ఆధిక్యాన్ని కోల్పోయింది. మత విద్వేషాలు పెరిగిపోయాయి.

హిందుత్వ శక్తులు బాబ్రీ మసీద్ కూల్చి వేసిన సంఘటన కాంగ్రెస్ పార్టి మీద
లోక్ సభ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపెట్టింది.


1995 మే నెలలో కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు అర్జున్ సింగ్, ఎన్ డి తివారీలు కాంగ్రెస్ పార్టి ని వీడి సొంత పార్టి పెట్టుకున్నారు. జైన్ హవాలా , హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభ కోణం, రాజకీయాల్లో క్రిమినల్స్ ప్రభావం కాంగ్రెస్ పార్టి మీద ప్రభావం
లోక్ సభ ఎన్నికల్లో చూపెట్టింది.

Also read  నరేంద్ర మోడి: ఛాయ్ వాలా నుండి చౌకీదార్ గా మారిన మోడి!


బిజెపి నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ , లెఫ్ట్ – జనతా దళ్ కూటమి లు కాంగ్రెస్ కి
లోక్ సభ ఎన్నికల్లో వ్యతిరేకంగా పోటీ చేసాయి.


ఈ ఎన్నికల్లో ఏ కూటమికి పూర్తి మెజార్టీ ప్రజలు ఇవ్వలేదు. కాంగ్రెస్ కి 140, బిజెపి 161 లోక్ సభ స్థానాలలో గెలుపొందారు. రాష్ట్రపతి అత్యధిక స్థానాలు గెలిచిన బిజెపి ని ప్రభుత్వం ఏర్పాటు చేయవల్సిందిగా పిలిచారు. 


అటల్ బిహారీ వాజపాయ్ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం మొదటిసారి కేంద్రంలో అధికారాన్ని దక్కించుకుంది. అయితే 13 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం కూలిపోయింది. లోక్ సభ లో సభ్యుల మద్దత్తు కూడగట్టడంలో వాజపాయ్ విఫలం అవ్వడం చేతే పదవినుండి వైదొలిగాడు.


జనతా దళ్ నాయకుడు దేవ గౌడ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య మద్దతు తో ప్రధాని గా బాధ్యతలు అందుకున్నారు. అయితే కేవలం 18 నెలలు మాత్రమే దేవగౌడ ప్రధాని గా బాధ్యతలు నిర్వహించారు. 


ఆ తర్వాత కాంగ్రెస్ మద్దత్తు తో ఐకే గుజ్రాల్ ప్రధానిగా ఏప్రిల్ 1997లో  బాధ్యతలు చేపట్టారు. అయితే ఇది అంతా కేవలం స్టాప్ గ్యాప్ ప్రధానిగా ఎన్నుకున్నారు. దేశం మరలా 1998 లో లోక్ సభ ఎన్నికలకు వెళ్ళింది. 

(Visited 40 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!