మైనింగ్ మాఫియా దెబ్బకి అదృశ్యమవుతున్న వంతాడ నాగులకొండ!

షేర్ చెయ్యండి
  • 16
    Shares
 
వంతాడ మైనింగ్ అనగానే 2012 లో క్రిష్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమా గుర్తుకు వస్తుంది. మైనింగ్ మాఫియా కధాంశంతో తీసిన ఈ సినిమాలో  యల్ బి శ్రీరాం చెప్పే ఒక డైలాగ్ గుర్తుకు రాక మానదు. ఏమి చేస్తున్నావు తాత అంటే “భూమిని దాచిపెడుతున్నాను” అంటాడు ఈ మైనింగ్ మాఫియా వలన భవిషత్ లో మైనింగ్ మాఫియా బారిన పడకుండా దాచిపెట్టుకోవాలేమో!
 
వంతాడ, అక్కడ నివసించేది ఏ పెత్తందారీ కులాలు కాదు, వంతాడ మహా నగరం కాదు. అక్కడ ఏ సెలబ్రిటీ నివసించడం లేదు, ఎవరి ఫామ్ హౌస్ లేదు. కానీ  వంతాడ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. వంతాడ లో అమూల్యమైన సంపద ఉంది. కొండల్లో , గుట్టల్లో, భూగర్భం లో అమూల్యమైన సంపద దాచుకుని ఉంది. 
 
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల దట్టమైన అడువులలో కొండపైన ఉన్న కుగ్రామం వంతాడ. అక్కడ అత్యంత పురాతన తెగకు చెందిన ఆదివాసీ కొండ రెడ్లు (Particularly Vulnerable Tribal Group) కొన్ని సంవత్సరాల నుండి  నివసిస్తున్నారు. 
 

పచ్చని ప్రకృతిలో, అటవీ సంపద సేకరించుకుంటూ నివసిస్తున్న వంతాడ కొండ రెడ్ల ఇళ్లు ఇప్పుడు దుమ్ము, ధూళి తో నిండిపోతుంది. వంతాడ వెళ్లే రోడ్లు మట్టి కొట్టుకుపోయి ఉంటాయి. పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. 
 
పచ్చమ గోదావరి జిల్లా , పత్తిపాడు మండలంలో ఉన్న ఈ గ్రామం లో బాక్సైట్, లాటరైట్   ఖనిజాల నిక్షేపాలు అపారంగా  దాగివున్నాయి. వీటి మీద పాలక వర్గాల క్రూరమైన కన్నుపడింది. అది అటవీ ప్రాంతం, ఆ ప్రాంతం అక్కడ నివసించే స్థానిక ఆదివాసీ ప్రజలకు చెందినది, అది వారి హక్కు అన్న సంగతి మరచి అర్ధరాత్రి జి ఓ లు పుట్టించుకున్నారు. 
 
అమూల్యమైన ఖనిజ సంపద కోసం పర్యావరణాన్ని లెక్క చెయ్యకుండా ప్రభుత్వాల అండతో, పాలక పార్టీ అనుచరగణం దోపిడీ చేస్తున్నారు. బాక్సైట్, లాటరైట్ ఉన్న పర్వత శ్రేణులు తూర్పు గోదావరి జిల్లా లోని ప్రత్తిపాడు నుండి విశాఖపట్నం జిల్లా లోని నర్సీపట్నం వరకూ విస్తరించి ఉన్నాయి. స్థానిక ఆదివాసీలు ఈ పర్వత శ్రేణిని “నాగుల పర్వతం” అంటారు. 
 
ఇటీవల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రలో బాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి వంతాడ లో జరుగుతున్న దోపిడీ గురించి మీడియాతో మాట్లాడారు. 

నిర్లక్షానికి మారు పేరు వంతాడ!

వంతాడ గ్రామాన్ని మొదట చూడగానే మన మనసులో అనుకునే మాట ఇంకొన్ని రోజుల్లో ఈ భూమి మీద నుండి త్వరగా కనుమరుగైయ్యే గ్రామం గా అనుకుంటాం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో  2,10,509 మంది కొండ రెడ్ల జనాభా ఉన్నప్పటికీ వీరు అంతరించిపోయే అవకాశం ఉంది. 
  
వంతాడలో ఎవరినైనా అడగండి, ముక్యంగా యువకులను, ఎలా ఉన్నారు, అన్నీ సౌకర్యాలు ఉన్నాయా అని, వారి స్పందనలో భయం కనిపిస్తుంది. అంతా బాగుంటే మా గుడిసెలు అంతరించి పోయెదశలో ఎందుకు ఉంటాయి అని చెబుతారు. 
 
బాక్సైట్, లాటరైట్  మైనింగ్ లీజుకు తీసుకున్న కంపెనీలు  వంతాడ ఆదివాసిలకు మీ గ్రామం అభివృద్ధి చేస్తామని, గ్రామ రూపురేఖలు మారుస్తామని వాగ్దానాలు చేస్తూ వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అసలు వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అభివృద్ధి అనేది మచ్చుక కూడా కనిపించదు. అడవిలో దొరికే ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే వారికి నేడు అంతరించిపోతున్న  చెట్లు  వారి జీవనోపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. 
 
మైనింగ్ చెయ్యడం వలన అలాగే రోజుకు వందలకొలది లారీలు తిరగడం వలన వస్తున్న దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నారు ఆదివాసీలు. ఊపిరిత్తుల, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. 
 
స్థానికుల అభిప్రాయం ప్రకారం మా కొండలను, గుట్టలను తొవ్వి మమ్మల్ని అనారోగ్యం పాలుచేసి ఆదివాసీయేతరులు బాగుపడుతున్నారు. మా గుడిసెలు లాక్కుంటూ మాకు అడపా దడపా ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు వచ్చి ఇచ్చే మందులతోనే సరిపెడుతున్నారు. 
 
ఆదివాసీల భూమి చట్టం ఉల్లంఘన!
 
ఆదివాసీల భూమి పై, ఆదివాసీలకు హక్కుల లేకుండా చేసేరు. బలవంతాన ఇళ్ల పట్టాలు లాక్కుంటున్నారు. దాదాపుగా 40 కుటుంబాల ఇండ్ల పట్టాలను మైనింగ్ కంపెనీలు బలవంతాన లాక్కున్నారని స్థానికులు చెబుతున్నారు.   
 
2010 లో తూర్ప గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ITDA  రంపచోడవరం ప్రాజెక్టు ఆఫీసర్ కమిటీ వంతాడ ను సందర్శించి ఇచ్చిన నివేధిక లో మైనింగ్ కంపెనీలు అక్రమంగా గిరిజనుల పట్టాలు లాక్కున్నారని నివేదికలో పొందుపరిచేరు. ఆంధ్ర ప్రదేశ్ అస్సైన్డ్ ల్యాండ్ ( ప్రొహిబిషన్ & ట్రాన్స్ఫర్ ) చట్టం 1997 ప్రకారం మైనింగ్ కంపెనీలు ఆదివాసీల పట్టాలు తీసుకొనడం నేరం. 
 
ప్రభుత్వం అనుమతి లేకుండా అసైన్డ్ భూమి కోనడం కానీ లేదా అమ్మకం కానీ చెల్లవు. కానీ వంతాడ లో ఆచట్టాలు ఏమీ పట్టించుకోరు. అసలు గిరిజన భూములను గిరిజనేతరులకు హక్కులు కల్పించడం రాజ్యాంగం ప్రకారం నేరం. అలాగే స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా ఆదివాసీల భూమిని ధారాదత్తం చెయ్యడం రాజకీయాన్ని అడ్డంపెట్టుకుని చేసినవే.

ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మైనింగ్ కంపెనీలు!

సహజంగా  బాక్సైట్, లాటరైట్ ఖనిజ నిక్షేపాలు బల్లపరుపుగా ఉండే కొండల్లో ఉంటుంది. కొండ రెడ్లు నివసించే ప్రాంతం మీద మైనింగ్ మాఫియా కన్ను పడింది. ఆదివాసీలను ఇండ్లు కాలీచేసి వెళ్లమంటున్నారు లేదంటే ఇండ్లుకి నిప్పు పెడతాం అంటూ బెదిరిస్తున్నారు. 
 
 స్థానిక మైనింగ్ అధికారులు కలిసి చట్టాలు ఉల్లంగింజి మైనింగ్ లీజుకు ఇచ్చినట్లు 2010 లో జాయింట్ కలెక్టర్ కమిటీ నివేదికలో పొందుపరిచేరు. ఈ నివేదిక ఆధారంగా దాదాపుగా 10 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
 
అసలకు వంతాడ ఏజన్సీ ప్రాంతం పర్యావరణ పరిరక్షణ కు సంబంధించి అత్యంత సున్నితమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎలాంటి తొవ్వకాలు జరగ కూడదు. కానీ ఈ మైనింగ్ మాఫియా ఏ చట్టాన్ని గౌరవించడం లేదు. ప్రభుత్వాల మద్దత్తు యథేచ్ఛగా అటవీ హక్కుల చట్టాలను ఉల్లంగిస్తున్నారు. 
 
లాటరైట్ కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ ను తొవ్వుకుంటున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రెండు పెత్తందారీ కులాలు ఇక్కడ మైనింగ్ జరుపుతున్నారు. వారికీ స్థానిక పంచాయితీ సర్పంచ్ నుండి అసెంబ్లీ వరకూ పలుకుబడి ఉందని స్థానికులు చెబుతున్నారు. 

పవన్ కళ్యాణ్ సందర్శన!

జనసేన పార్టీ అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రలో బాగంగా వంతాడ గ్రామాన్ని సందర్శించేరు. ఈ ప్రాంతంలో సంవత్సరానికి రూ మూడువేల కోట్ల రూపాయిల మైనింగ్ తవ్వకాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పేరు. 
 
Pawan Kalyan
Image: Pawan Kalyan at Vantada Mining. credits: Indian Express
 
ముఖ్యమంత్రి సహా, మంత్రులు అక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరగడం లేదని యధేచ్చగా నమ్మించే ప్రయత్నంలో ఉన్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తేరు. అసలు ముఖ్యమంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? డబ్బులు ఎవరెవరి జేబుల్లోకి వెళ్తున్నాయి, ముఖ్యమంత్రి కా లేక లోకేష్ జేబులోకాని ప్రశ్నించేరు. 
 
వై యెస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వంతాడను సందర్శిచిన చంద్రబాబు రోజూ 100 లారీల మైనింగ్ తరలిస్తున్నారని తెలుగు దేశం ప్రభుత్వం ఖచ్చితంగా దీనిని నివారిస్తాం అని చెప్పి నేడు 200 లారీలు  తిరుగుతున్నాయని జనసేన నేత ఎత్తిచూపించేరు. 
 
ఉదారవాద ఆర్ధిక సంస్కరణలో బాగంగా పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు కలిసి జాతి సహజ సంపదను దోచుకుంటున్నారు. అభివృద్ధి పేరుతొ కల్లబొల్లి మాటలు చెబుతూ భూమిని బొందల గడ్డ గా మార్చేస్తున్నారు. 
 
 
 
 
 
 
 
 
 
 
(Visited 43 times, 1 visits today)
Also read  వై యెస్ జగన్ పై హత్యాయత్నం-ఇటువంటి చర్యలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు-జగన్ ట్వీట్!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!