విలువలు లేని బారతీయ మీడియా!

షేర్ చెయ్యండి
  • 23
    Shares
  • ప్రైవేట్ వ్యక్తులకు సామాజిక బాధ్యత ఉండదు. ప్రైవేట్ వ్యక్తి అంటే పెట్టుబడిదారుడు. లాభంకోసం పెట్టుబడి పెడతాడు, అందుకోసం గిరిగీసుకుని కూర్చోడు, నీతి, నియమాలు ఉండవు లాభేపేక్ష తప్పా. 
 
భారత దేశంలో ప్రైవేట్ వ్యాపారంకి తలుపులు బార్లా తీసిన తర్వాత మీడియా రంగంలో కూడా విపరీతమైన పెట్టుబడులు వచ్చేయి. ఎంత కాదనుకున్నా భారత దేశం కులం అనే దడి కట్టుకున్న సమాజం, వారి కుల ప్రయోజనాల కోసం ఏ పని అయినా చెయ్యగల దురాభిమానం గల దేశంలో మీడియా కొందరి ప్రయోజనాలకోసమే అని అతి తక్కువకాలం లో ప్రజలకి తెలిసిపోయింది. 
 
ఫోర్త్ ఎస్టేట్ లో  ఒక భాగం అయిన మీడియా ప్రజల బెడ్ రూముల్లోకి దూరే స్వేచ్ఛ ని కలిగి ఉంది. వార్త సేకరణ విచ్చల విడిగా తయారైంది. వాస్తవంలో నుండి సత్యాలను సేకరించకుండా వార్తలను వండి వారిస్తున్నారు. ఎవరికి కావాల్సిన వార్త వారికోసం తయారు చేస్తున్నారు. 
 
ఒకప్పుడు జర్నలిజం అభిరుచి. నేడు జర్నలిజం అంటే ఎంత బాగా అక్షరాలను అమ్ముకోగలమో, అంత బాగా అమ్ముకోవచ్చు. దీనినే పెయిడ్ న్యూస్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. తమకి గిట్టని వారి మీద కావాల్సినంత బురద చల్లవచ్చు. అసత్యాల కధలు తయారు చేసి ప్రత్యేక కధానాలుగా జనం మీద రుద్దవచ్చు. 
 
ఈ మధ్య ప్రొఫెస్సర్ కంచ ఐలయ్య సామజిక స్మగ్లర్లు గురించి విన్నాం. అసలు మీడియా స్మగ్లింగ్ గురించి ఎపుడైనా విన్నామా? భారత దేశంలో జరిగే మీడియా స్మగ్లింగ్ గురించి “కోబ్రా పోస్ట్” నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఎన్నో ఆశక్తికరమైన కధనాలు వెల్లడించారు. మీడియా (జర్నలిజం ) కార్పొరేట్ చేతుల్లో బందీ అయ్యింది. ఫోర్ట్ ఎస్టేట్ లో భాగం అయిన మీడియా ఇలా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంటే ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లుతుంది. పెట్టుబడిదారుడు తన లాబాన్ని చూసుకుంటాడు, ప్రజల ప్రయోజనాలు అసలు పట్టవు. 
 
తమిళనాడు లోని తూత్తుకూడి లో ఇటీవల పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోయేరు. వేదంతా సంస్థ యొక్క స్టెరిలైట్ కాపర్ సమస్య ఇప్పడి ది కాదు.అక్కడి సమస్య మీద ఏ మీడియా కధనాలు రాయలేదు. పోలీసు కాల్పుల్లో ప్రజలు చనిపోతే కానీ మీడియాలో సామాన్య ప్రజల గోడు వినపడదు. వేదాంత లాంటి కార్పొరేట్ శక్తి ముందు ప్రధాన మంత్రి నే సాగిల పడుతుంటే మీడియా ఆ కార్పొరేట్ కి వ్యతిరేకంగా కధనాలు రాస్తుంది అనుకోవడం పొరపాటు.  
 
ఇటీవల కోబ్రాపోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఎన్నో ఆశక్తికర విషయాలు వెల్లడించేరు. ఒక ప్రముఖ మీడియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ నోట్ల రద్దుకు అనుకూలంగా ఎన్నో కధనాలు వెల్లడించినట్లు బాహాటంగా చెప్పుకొచ్చేరు.దమ్మున్న ఛానెల్ అని చెప్పుకునే ఒక మీడియా ని కోబ్రా పోస్ట్ ప్రతినిధులు సంప్రదించంగా ఆసంస్థ మార్కెటింగ్ హెడ్ వెల్లడించిన విషయాలు ఆశక్తికరంగా ఉన్నా తెలుగు ప్రజలకు సుపరిచితమే. ఒక స్టింగర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆ సంస్థ చైర్మన్ నేడు ప్రభుత్వం తో అనుకూలంగా ఉండి ఎదిగిన కథ , ప్రత్యర్థుల పార్టీ ని టార్గెట్ చేసే విధానం చెప్పుకొచ్చేరు. 
 
  • నేటి పెయిడ్ మీడియా ఉద్యమకారులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుంది. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తుంది. ఎవరు అయితే పే చేస్తారో వారికి నమ్మిన బంటులా ఉంటుంది. 
మీడియా వ్యాపారం బాగుంది. ప్రభుత్వం దగ్గర ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉంటే వారికి అంత లాభం. ప్రత్యర్థుల మీద ఎవరు ఎక్కువగా ప్రచారం చెయ్యగలిగితే వారికి అంత లాభం. ఎవరు ఎక్కువ రేట్ కి అమ్ముడుబోతే వారికి లాభం. 
 
ఇది ఎన్నికల సమయం, ఇప్పటి నుండే బేరసారాలు మొదలెట్టేరు. హిందుత్వ అజెండాకి అమ్ముడుపోయిన మీడియా. సాఫ్ట్ హిందుత్వ దగ్గర నుండి ప్రత్యర్థి పార్టీ నాయకులను అభాసుపాలు చేసే డీల్ కి ఇప్పుడు గిరాకీ పెరిగింది. 
 
కనీస విలువలు లేని మీడియా సమాజానికి ఏ విలువలు నేర్పుతుంది.? కోబ్రాపోస్ట్ వెల్లడించిన కధనాల తర్వాత వివిధ మీడియా సంస్థలు బారత జర్నలిజం గురించి చేసిన వ్యాఖ్యలు సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. 
 
The suspicion that Indian media outlets can be bought is not new. So for many, the Cobrapost sting simply confirmed what they had long suspected and did so at an already problematic time for Indian journalism. In the four years of the Narendra Modi government, polarisation across the media has grown more extreme; the voices more shrill.  
Al Jazeera
There is no question that the Cobrapost allegations need to be treated with healthy skepticism. But there is also no question that they raise potentially troubling doubts over the independence of the media in India, particularly when it is a year away from a general election.
BBC
 
 
(Visited 62 times, 1 visits today)
Also read  Kerala floods 2018 - PM announces 500 crore relief help for Kerala floods

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!