వై యెస్ జగన్ పై హత్యాయత్నం-ఇటువంటి చర్యలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు-జగన్ ట్వీట్!

షేర్ చెయ్యండి
 
ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వై యెస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మీద ఈ రోజు మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. 
 
విశాఖ విమానాశ్రయంలో విఐపి లాంజ్ లో కూర్చున్న వై ఎస్ జగన్ వద్దకు విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ఫీ కోసం వచ్చి వై ఎస్  జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయాత్నం చేసినట్లు ప్రాధమిక వివరాలు తెలుస్తున్నాయి. 
 
ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి కోడి పందెం కోసం ఉపయోగించే కత్తి వచ్చిన వ్యక్తి  జగన్ ను అతి సమీపంలో పొడిచే ప్రయత్నం చేయగా వై యెస్ జగన్ తప్పించుకునే క్రమంలో అతని బుజానికి గాయం అయ్యింది. 
ys jagan
 
ఈ సంఘటన జరిగిన వెంటనే విమానాశ్రయం భద్రతా సిబ్బంది దాడి చేసిన శ్రేనివాస్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రజాసంకల్ప యాత్ర బాగంగా 294 వ రోజు పాదయాత్ర ముంగించుకుని హైదరాబాద్ బయలుదేరటానికి విశాఖ విమానాశ్రయం కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వద్దకు సెల్ఫీ కోసం వచ్చిన వ్యక్తి  కోడి పందెం కోసం ఉపయోగించే కత్తి తో పొడవబోయేసరికి జగన్ సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. 
 
వై యెస్ జగన్ కి తగిలిన గాయానికి ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించేరు. హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ నందు జగన్ భుజానికి శస్త్ర చికిత్స చేస్తున్నారు. 
 
వై సి పి అధ్యక్షుడు జగన్ తనపై జరిగిన దాడి వలన ఎవరూ ఆందోళన పడవద్దని ట్వీట్ చేసేరు. నాపైన దాడి నా ఆత్మవిశ్వాసాన్ని, పోరాటాలను దెబ్బతీయవని ట్వీట్ చెయ్యడం జరిగింది. 
 
జగన్ ఎప్పటిలాగే భగవంతుడి దయ, ప్రజల దీవెనలు నన్ను కాపాడేయి అని పేర్కొన్నారు. ఇది పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించేరు. 
 
ఇది ఇలా ఉండగా వై ఎస్ జగన్ మీద జరిగిన దాడి అనంతరం ఆంధ్ర పోలీసు డిజిపి జగన్ మీద దాడి చేసిన వ్యక్తి జగన్ ఫ్యాన్స్ అని ప్రకటించడం కొసమెరుపు. 
 
డిజిపి చేసిన ఈ వ్యాఖ్యలను  వైఎస్సార్ సి పి నేత బొత్సా సత్యనారాయణ తీవ్రంగా ఖండిచేరు. ఫ్యాన్స్ లు హత్యలు చెయ్యరని, కాళ్లకు దండం పెడతారని డిజిపి ముందుగానే ఇలా ప్రకటించడం రాజకీయ కోణంలో చూడాలని ఆయన సాక్షి లైవ్ లో మాట్లాడుతూ చెప్పేరు. 
 
బిజెపి నాయకులు  ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ జివిల్  నర్సింహారావు హింసా రాజకీయాలు మంచివి కావని విశాఖ విమానాశ్రయం లో జరిగిన సంఘటన మీద దర్యాప్తు చేపట్టాలని, దీని వెనక ఉన్న కుట్రను ఆంధ్ర పోలీసులు బహిరంగపరచాలని కోరేరు. 
 
jagan fans
Image: YS Jagan with Srinivas
 
సోషల్ మీడియాలో వై ఎస్ జగన్ జరిగిన దాడి మీద కొత్త నాటకానికి తెరదీసింది. దాడిచేసిన వ్యక్తి శ్రీనివాస్ వై ఎస్ జగన్ ఫోటో తో చేసిన ఫ్లెక్సీ హల్ – చల్ చేస్తుంది. 
 
2018 నూతన సంవత్సరం మరియు సంక్రాతి శుభాకాంక్షలు చెబుతూ జగన్ – శ్రీనివాస్ లు ఉన్న ఫోటో సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతోంది. 
 
సాక్షి మీడియా కధనం ప్రకారం ముఖ్యమంత్రి పి యెస్ కార్యాలయం నుండే ఎల్లో మీడియా కి ఈ ఫోటో అందినట్లు బ్రేకింగ్ న్యూస్ గా ప్రకటించింది. 
 
జగన్ ఫ్లెక్సీ ని స్కాన్ చేసి శ్రీనివాస్ ఫొటో ని పేస్ట్ చేసినట్లుగా సాక్షి మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
ప్రతిపక్ష నాయకుడు పై అత్యంత కట్టుదిట్టమైన విశాఖ విమానాశ్రయం లో దాడి జరగటం రాష్ట్రంలో బద్రతా వ్యవహారాల డొల్లతనం బయటపడింది. 
 
అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ లు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం మొదలైంది. అధికార తెలుగు దేశం పార్టీ ఒక నాయకుడు ఈ హత్య జనసేన పార్టీ కార్యకర్త చేసినట్లు ప్రచారం చెయ్యాలన్నట్లు బహిరంగంగా చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
హత్యాయత్నం జరిగి ఇప్పటికి నాలుగు గంటలు అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకూ సంఘటన మీద కనీసం స్పందన లేకపోవడం విమర్శలకు గురిచేస్తుంది. 
 
అలిపిరి లో చంద్రబాబు మీద జరిగిన బాంబు దాడి అనంతరం ఆనాటి ప్రతిపక్ష నేత వై యెస్ రాజశేఖర్ రెడ్డి హుటా హుటిన తిరుపతి వెళ్లి చంద్ర బాబుని పరామర్శ చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 
 
కేంద్ర బద్రతా దళాలు కట్టుదిట్ట మైన భద్రతా ఉన్న విమానాశ్రయం లో జగన్ మీద జరిగిన దాడి కల్పితం గా రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియా తో మాట్లాడుతూ పేర్కొన్నారు. 
ys jagan-hospital
Image: YS Jagan after treatment in Hospital. Curtsy: Sakshi tv
 
ఆంధ్రప్రదేశ్ మీద కుట్రలు జరుగుతున్నాయి అని దీని వెనకాల ఉన్న రాజకీయ కుట్ర కోణాలు దర్యాప్తు ద్వారా బయట పెడతామని చెప్పేరు. 
 
తెలంగాణ లో తెరాస , బీజేపీ  వైఎస్సార్  పార్టీ ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ గా చేసుకుని ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు అని కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ చెప్పేరు. 
 
విశాఖ ఎయిర్ పోర్ట్ లో  వై యెస్ జగన్ మీద జరిగిన దాడికి కేంద్ర ప్రభుత్వ బద్రతా సిబ్బంది కారణం అని ,ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదని కేంద్రమే బాధ్యత తీసుకోవాలని అయన చెప్పేరు. 
 
ఆంధ్ర లో శాంతి భద్రతల కు విఘాతం కలిగించే కుట్రగా అయన పేర్కొన్నారు.  ఈ సంఘటన మీద విశాఖ నార్త్  ఎసిపి  నాగేశ్వర రావు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వై యెస్ జగన్ మీద దాడి చేసిన వ్యక్తి ఎయిర్ పోర్ట్ లో వున్నా ఫ్యూజన్ ఫుడ్స్ లో  పనిచేస్తున్న శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వ్యక్తి. ఈ ఫుడ్ కోర్ట్ తెలుగు దేశం నాయకులది గా తెలుస్తుంది. 
 
 
 
 
(Visited 17 times, 1 visits today)
Also read  ప్రమాదంలో కుల పార్టీల రాజకీయ భవిషత్తు?

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!