శబరిమల అయ్యప్ప బిజెపి కి దక్షణాదిన ఓట్లు తెచ్చిపెట్టే బృహత్తర పధకం గా ఆ పార్టీ భావిస్తుందా?

షేర్ చెయ్యండి
 • 51
  Shares
 • శబరిమల అయ్యప్ప దక్షిణాదిన బారతీయ జనతా పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టే బృహత్తర పధకం అని బిజెపి బావిస్తుందా? 
 • 2006 లో RSS మహిళలకూ హక్కులు ఉంటాయని, శబరిమల అయ్యప్ప ని దర్శించుకునే అవకాశం మహిళ లకు ఇవ్వాలని సుప్రీం కోర్టు వెళ్లడం చరిత్ర. 
 • సంఘ పరివార్ శబరిమల అయ్యప్ప గుడిలోకి మహిళలను అనుమతించాలని కోర్టు మెట్లెక్కిన 12 సంవత్సరాలకు తీర్పు RSS కి అనుకూలంగా వచ్చింది. 
 
భగవద్గీతను, భగవంతుణ్ణీ ఆయుధాలు చేసుకుని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని బాలగంగాధర్ తిలక్ లాంటివారు ప్రయత్నించేరు. తిలక్ ప్రజలను పరాయి పాలనకు వ్యతిరేకంగా కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా ప్రయత్నించేరు. 
 
భగవద్గీతను, భగవంతుణ్ణీ అడ్డంపెట్టుకుని, ఆయుధాలుగా చేసుకుని RSS నేతృత్వంలో BJP పార్టీ సమాజాన్ని రెండు ముక్కలుగా చీల్చే ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ మతాతీత, రాజ్యాంగ వ్యవస్థ స్థానంలో మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ రాజ్య వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు. 
 
ప్రజల మధ్య ద్వేషాలను రగిలిస్తున్న మతోన్మాదం!
హిందూమతం అధిక సంఖ్యాక ఆధిపత్య భావాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చడంలో RSS – BJP సఫలీకృతం అయ్యింది. గుజరాత్ ఫార్ములా ద్వారా ప్రజల మధ్య ద్వేషాన్ని నూరిపోసి, దాడులకు దిగుతూ సక్సెస్ అయ్యేరు. 
 
రాజ్యాధికారం RSS – BJP ల కల (Dream) కాదు. బారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసి మనువాద రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యడమే వీరి లక్ష్యం. ఈ లక్ష్యానికి ద్రావిడ ఉద్యమానికి ప్రధాన వేదిక అయిన దక్షణాది రాష్ట్రాలు మోకాలడ్డం RSS -BJP కి అస్సహనం కలిగిస్తుంది. 
 
నిజానికి బిజెపి దాని మాతృ సంస్థ RSS మొదట ఆంధ్ర ప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని ఆయుధంగా చేసుకుని దక్షణాది లో మత రాజకీయాలు చేయాలనుకున్నారు. 
 
తిరుమల విషయంలో బీజేపీ కు అనుకున్నంత స్పందన ప్రజల నుండి రాకపోయేసరికి కేరళా మీద దృష్టి పెట్టేరు. కేరళ లోని కమ్యూనిస్టు ప్రబుత్వానికి వ్యతిరేకంగా పావులు కదిపేరు. 
 
ఇప్పటికే కేరళ ని కుదిపేస్తున్న RSS శక్తులు శబరిమల అయ్యప్ప గుడిలోకి మహిళ లును అనుమతి ఇస్తూ   సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించిన తర్వాత RSS ఆ తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడం వారి రెండు నాల్కుల ధోరణికి నిదర్శనం. 
 
మార్చి  2016 లో RSS జాతీయ కౌన్సిల్లో సంస్థ జెనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి మాట్లాడుతూ మహిళలను చాలా గుడుల్లోకి అనుమతించడం లేదు ఇది వారిపట్ల చూపిస్తున్న వివివక్ష. ఆ వివక్ష తొలగాలి అంటే మహిళ లను గడి లోకి అనుమతించాలని ఆయన చెప్పుకొచ్చేరు. 
 
మహిళల పట్ల పాటిస్తున్న అంగారక సాంప్రదాయాలను కూల్చివేయాలని భయ్యాజి జోషి పిలుపునిచ్చేరు. ఇలాంటి అడ్డుగోడలను చర్చలు ద్వారా తొలగించుకోవాలని అయన అభిప్రాయపడ్డారు. 
 
ఇప్పుడు RSS కేరళ లో పట్టు సాధించడానికి యూటర్న్ తీసుకుంది. 2016 లో ఇచ్చిన ప్రకటనకు ప్రస్తుతం కేరళ లో చేస్తున్న అరాచకానికి పూర్తి భిన్నంగా సంఘ్ పరివార్ వ్యవహరిస్తుంది. 
 
బారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు కట్టుబడి దేశంలో ఏ ప్రభుత్వాలు, సంస్థలు అయినా వ్యవహరించాలి. కానీ శబరిమల అయ్యప్ప ఆలయం ప్రవేశం విషయంలో మీడియా కానీ, ధార్మిక సంస్థలు, బీజేపీ కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద నిందలు వేయడం విడ్డురం. 
 
కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును తుంగలోకి తొక్కి శబరిమల అయ్యప్ప గుడి లోకి మహిళలను ప్రవేశించకుండా అడ్డుకుంటే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. ఈ చర్య దేశ వినాశనానికి మూల కారణం అవుతుంది. 
 
సుప్రీం కోర్టులో కేసు వేసిన సంఘ్ పరివార్ నేడు సుప్రీం తీర్పును పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. 
 
పెట్టుబడిదారుడికి మతం సరికొత్త వ్యాపారం!
ప్రపంచవ్యాప్తంగా మత పిచ్చి ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా మతం నేడు అత్యంత లాభసాటి వ్యారంగా మారింది. మత పరంగా ప్రజలను కట్టడి చెయ్యడంలో అన్ని మతాలు విజయం సాధిస్తున్నాయి. 
 
లౌకిక మతాలు విఫలం చెందేయి, అభివృద్ధి నిరోధక, మానవాతీత బావాలతో నమ్మకాలతో, కార్యాచరణ లో మునిగితేలుతున్న మతోద్యమాలు గణనీయంగా విజయం సాధించాయి అని పీటర్ బెర్గర్ అంటాడు.
 
నేడు బారత దేశంలో జరుగుతుంది పీటర్ బెర్గర్ అభిప్రాయానికి భిన్నంగా ఏమీ జరగడంలేదు. సాంప్రదాయం, సంస్కృతి మాటున శబరిమల అయ్యప్ప ని మహిళలు దర్శించుకోవడానికి వీలు లేదంటూ కోర్టు తీర్పులను సైతం లెక్క చెయ్యకుండా మహిళ లే రోడ్ల మీదకు రావడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 
 
బారతీయుల అతిభౌతికవాద తత్వజ్ఞానం విశిష్టమైనదైనప్పటికీ, సంపదను ఆకర్షించడానికి, అధికారాన్ని కైవశం చేసుకోవడానికి అవసరమైన దైవ కృప కోసం ఆధ్యాత్మిక చింతన ఒక సాధనం మాత్రమే అంటారు పావన్ వర్మ
 
కానీ బిజెపి మరియు సంఘ్ పరివార్ ఆధ్యాత్మిక చింతన అధికారం కైవశం చేసుకుని మత రాజ్యాంగం ద్వారా దేశాన్ని పాలించాలనే ఎత్తుగడలో వున్నారు. 
 
హిందువులలో 90 % మందికి పైగా మత బావంతో వున్నారు, వారిలో ఉన్న ఆ మత బావాన్ని, ధార్మికతను ఓటు బ్యాంకు గా మార్చుకోవచ్చని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా 
 
నయా ఉదారవాద రాజ్య వ్యవస్థ ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం అయిన తర్వాత రాజ్యాంగ యంత్రానికీ, కార్పొరేట్ రంగానికి, హిందూ మత ధార్మిక వ్యవస్థకీ మధ్య “విచిత్రమైన” త్రిభుజాకార (cosy traingular relationship) సంభంధం ఏర్పడిందని జేఎన్యూ ప్రొఫెసర్ మీరానందా అంటారు. 
 
అంతర్జాతీయంగా వస్తున్న ఆర్ధిక, రాజకీయ, సామాజికపరమైన మార్పుల కనుగుణంగా హిందూ మతం తనకు తానుగా మార్పు చెందటానికి ఆవశ్యకమైన వ్యవస్తీకృత సంస్థలను, బావజాలాన్ని పెంపొందించుకోవడానికి రాజ్యవ్యవస్థ, మతం , పెట్టుబడి అనే త్రిభుజాకార బంధం నూతన  అవకాశాలను సృష్టిస్తుంది. 
 
హిందూ మతం తనకు తానూ పునర్జీవం పొందే క్రమంలో కర్మకాండలను, ఆచార వ్యవహారాలను రాజకీయపరమైన జాత్యాహాంకార ధోరణులతో వాటిని పునరుత్దానం చేస్తుంది: ప్రొఫెసర్ మీరానంద 
 
ఈ విధమైన రాజకీయ వ్యవస్థను మన కళ్ళముందే మనం చూస్తున్నాం. ఇన్నాళ్లు చాపక్రింద నీరులా ప్రవహించిన ఈ జాత్యహంకార ధోరణులు నేడు నడిరోడ్డు మీద ప్రత్యక్షంగా చూస్తున్నాం. 
 
రాజకీయ వ్యవస్థ, ప్రైవేట్ పెట్టుబడిదారుడు ఇద్దరు కలిసి మత వ్యవస్థను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. విద్యను ప్రైవేటుపరం చెయ్యడం వలన శాస్త్రీయమైన దృక్పధం కంటే మత సంభందమైన దృక్పధంతో విద్యార్థులను బయటకు పంపుతున్నారు. 
 
శబరిమల సంఘటన బిజెపి కి లాభం చేకురుస్తుందా!
దేశం ఆర్ధికంగా, రాజకీయంగా, పరిపాలనా పరంగా ఐక్యమవుతున్న ఆధునిక క్రమంలోనే మతవాదం పుట్టుకొచ్చింది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఒకవైపు జాతీయవాదం పెరుగుతూ వస్తుంటే ఇంకొకవైపు మత వాదం జాతీయవాదానికి సమానంగా పెరగడం ఆనాటి జాతీయ నాయకులు గమనించి గమనించకుండా ఉన్నారు. 
 
మత వాదం బారత దేశాన్ని రెండు ముక్కలు చేసింది. దీనికి కారణం జాతీయవాది అయిన గాంధీనే!  అంటే ఒకవైపు జాతీయబావాన్ని ప్రోత్సహిస్తూనే ఇంకొకవైపు మతాన్ని మన రాజకీయ నాయకులు ప్రోస్తహించడం గమనార్హం. 
 
శబరిమల అయ్యప్ప అంశం రాజకీయంగా బిజెపి కి అనుకూలమా లేదా ప్రతికూలమా అని చర్చకంటే ప్రశాంతంగా ఉన్న పచ్చమ కనుమల్లో బిజెపి దాని మాతృ సంస్థ అయిన RSS చేస్తున్న అరాచకాలు దక్షణాది ప్రజలు గమనిస్తున్నారు. 
 
అయ్యప్ప  గుడిలోకి ఏ వయస్సు ఆడవారైనా దర్శించుకోవచ్చు అని సుప్రీం కోర్టు ఉత్తర్వులు రాగానే ఇద్దరు మహిళ జర్నలిస్టులు అదికూడా హిందూ యేతరులు శబరిమల కి బయలు దేరడం, మోజో టి వి జర్నలిస్ట్ ని పోలీసు యూనిఫారం లో తీసుకెళ్లడం అంతా ఒక ఎపిసోడ్ ని తలపించింది. 
 
ఎన్నికలు సమీపించే కొద్దీ బిజెపి మతాన్ని ఎగదోస్తూనే ఉంటుంది. అయోధ్య రాముడు, రామాలయం గుర్తుకు వస్తుంది. అయితే ఇదే అంశం మీద ప్రజలు ఓట్లు వేసేటట్లుగా అయితే ఎప్పుడో దేశం మత దేశంగా మారిపోయేది. 
 
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ప్రజల జి డి పి ని పెంచే చర్యలు ఏమీ తీసుకోకపోగా గుజరాత్ సియం గానే వ్యవహరిస్తున్నట్టు గా ఉంది. గుజరాత్ వ్యాపారస్తులకు ఇచ్చినన్ని రాయితీలు దేశంలో ఏ ఇతర రాష్ట్రాల వ్యాపారులు పొందలేదు. 
 
నోట్ల రద్దు, జి ఎస్టీ , అవినీతి ఈ మూడు బిజెపి ప్రభుత్వానికి దానిని నడిపిస్తున్న మోడీ కి భవిషత్ లో నిద్రలేని రాత్రులు మిగులుస్తుంది. జీఎస్టీ వలన ప్రజలకు ఎలాంటి మేలు జరుగకపోగా ప్రజల ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. 
 
ఈ పరిణామక్రమంలో బిజెపి కి శబరిమల సంఘటన ఓట్లు రాలుస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. 
 
కేరళ లోకానీ లేదా ఇతర రాష్ట్రాల్లో రాజకీయ అధికార మార్పిడిలో బాగంగా  బిజెపి అధికారంలోకి వస్తుందే తప్పా మతం ద్వారా కాదనే నగ్న సత్యం మనకి ముందు, ముందు తెలుస్తుంది. 
 
మహిళలు శబరిమల అయ్యప్ప దర్శనం అంటుకాదు!
బ్రాహ్మణుల చేతిలో ప్రతిదీ తన లక్షణాన్ని కోల్పోతుంది. ఎక్కడ ఆదాయం ఉంటుందో అక్కడ బ్రాహ్మణ పూజారి వ్యవస్థ ఉంటుంది. గుడిని తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటుంది. 1950 కి పూర్వం శబరిమల అయ్యప్ప దేవస్థానం లోకి మహిళలు కూడా ప్రవేశించేవారు. 
 
1940 లో ట్రావెన్ కొర్ మహారాజు, మహారాణి మరియు దివాన్ అయ్యప్పను దర్శించునట్లు చరిత్ర చెబుతుంది. అంటే పూర్వం శబరిమల అయ్యప్ప దర్శనం లింగభేదం, వయస్సు బేధం లేకుండా అందరూ దర్శించుకోవచ్చు. కేరళ హైకోర్టు తన తీర్పులో ఈ విషయం ప్రస్తావించింది. 
 
కరుములార్ నారాయణ పిళ్ళై  తన పుస్తకం ‘శ్రీభూతనాధ సర్వస్వం ‘ 1940 లో  అన్నివయస్సు వారు అయ్యప్పను దర్శించుకునేవారు అని రాసేరు. 
 
1950 జూన్ నెలలో అయ్యప్ప గుడి లో జరిగిన అగ్ని ప్రమాదంతో శబరిమల అయ్యప్ప పూర్తిగా హిందువైపోయేడు. అప్పటి నుండే శబరిమ అయ్యప్పను దర్శించుకునే అవకాశం మహిళ లేకుండా చేసేరు. 
 
కేరళలో హిందువులు 1983లో నిలక్కల్ మూమెంట్ పేరుతొ  హిందు మతాన్ని వ్యాప్తిచేసే కార్యక్రమం మొదలు పెట్టేరు. శబరిమల కి అనుబందంగా జరిగిన ఈ కార్యక్రంలో  క్రిస్టియన్స్ మతానికి వ్యతిరేకంగా జరిగింది. 
 
శబరిమల కి 21 కిలోమీటర్ల దూరం (నిలక్కల్ ప్రాంతం ) లో గ్రానైట్ తో చెయ్యబడిన సిలువ ఒకటి దొరికింది అని ఆ ప్రాంతంలో ఒక ప్రభుత్వ సంస్థలో  పనిచేసే కూలీలు కనుగొనట్లు దీపిక అనే (క్రిస్టియన్ బేస్డ్ ) డైలీ మార్చి 25, 1983 లో ఒక వార్త ప్రచురించింది. 
 
సెయింట్ థామస్ కాలం నాటి సిలువుగా గుర్తించి క్రైస్తవులు పూజించడం మొదలు పెట్టేరు. చర్చి కట్టే ప్రతిపాదనతో ఒక షెడ్ కూడా నిర్మించేరు. అయితే నిలక్కల్ ఉద్యమం ప్రభావంతో ఏప్రిల్ 28 1983 న కేరళ ప్రభుత్వం ఆ ప్రాంతంలో సిలువను తొలగించింది. 
 
క్రైస్తవులకు కేరళ ప్రభుత్వం నిలక్కల్ ప్రాంతంలోనే చర్చి కోసం స్థలం కేటాయించింది, ఆది కూడా హిందు సంస్థలు వ్యతిరేకించేరు. కానీ మే 28 న క్రైస్తవులు నిలక్కల్ దేవాలయం కి 325 కి. మీ దూరంలోనే సిలువను ప్రతిష్టించేరు. 
 
జూన్ 4 వ తేదీన హిందువులు చర్చ ప్రాంతానికి ర్యాలీ గా బయలుదేరడంతో పోలీసులకు , ప్రదర్శనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇది పెద్ద సమస్యగా మారడంతో క్రైస్తవులు సమస్యను పెద్దది కాకుండా నిలక్కల్ ప్రాంతంలో ఎలాంటి చర్చి నిర్మించే ఉద్దేశ్యం లేదని ప్రకటించేరు. 
 
ఈ సంఘటన తర్వాతనే శబరిమల అయ్యప్ప పూర్తిగా బ్రాహ్మణుల చేతిలోకి వెళ్ళిపోయేడు. ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది. 
 
కేరళ మరియు కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలకు తప్పా ఏ ఇతర రాష్ట్రాల లేని అయ్యప్ప లేదా ఏ పురాణాల్లో కనిపించని అయ్యప్ప నేడు హిందు దేవుడు గా పూజలందుకుంటున్నాడు. 
 
కొందరు చరిత్ర పరిశోధకులు అయ్యప్ప విగ్రహం ధ్యానంలో ఉన్న బుద్దుడి విగ్రహంగా చెబుతున్నారు. 1950 లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత జూన్ 25, 1950 న కొత్త విగ్రహం స్థాపించేరు 
 
ఏది ఏమైనా కేరళ లో నేటివరకూ ఇరు మతాల మధ్య ఎలాంటి ఉద్రిక్తలు లేకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో నేడు సంఘ్ పరివార్ శక్తుల వలన ప్రజల మధ్య ఉన్న ప్రశాంత వాతావరణం కలుషితం అయ్యింది. 
 
భారతీయుల భవిషత్ నేడు మతవాదుల చేతిలో ఉంది. ప్రజలు ఎలా ఈ మతోన్మాదుల కబంధహస్తాల నుండి బయటపడతారో కాలమే చెప్పబోతోంది.
 
 
 
 
 
 
(Visited 191 times, 1 visits today)
Also read  గాడ్సే:గాంధిని చంపడానికి కారణాలు ఏమిటి!

2 thoughts on “శబరిమల అయ్యప్ప బిజెపి కి దక్షణాదిన ఓట్లు తెచ్చిపెట్టే బృహత్తర పధకం గా ఆ పార్టీ భావిస్తుందా?

 • 24/10/2018 at 1:22 AM
  Permalink

  మీ పోస్ట్లుపూర్తి హిందూ వ్యతిరేక భావాలు కలిగివున్నాయి .భారతదేశం – హిందూ దేశం .. మీరు కావచ్చు , మరొకరు కావచ్చు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా సనాతన ధర్మానికి పుట్టినిల్లు ఈ దేశం . కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఈ దేశానికి వుంది . కాబట్టి సనాతన ధర్మాన్ని ఆచరించేవారి సంఖ్య సహజంగానే ఎక్కువని 2018 సంవత్సరాల చరిత్రగల మీ అన్యమతస్తులు గుర్తించి మీకు నచ్చినా నచ్చకపోయినా మెజారిటీ మతస్తుల మనోభావాలను గౌరవించడం , దేశంలో అశాంతి రేకెత్తించే కార్యక్రమాలు , మత మార్పిడులు , లవ్ జిహాద్ లు కట్టిబెట్టి , ఈర్ష్య ద్వేషాలు వొదిలి రెచ్చగొట్టే పద్ధతులు మానుకుని శాంతియుతంగా జీవిస్తారని హిందూ సమాజం ఆశిస్తోంది ?

  Reply
  • 24/10/2018 at 10:41 AM
   Permalink

   ప్రసాద్ గారు ధన్యవాదాలు. విశ్లేషణ విమర్శ ఎన్నటికీ కాదు. అసలు హిందు మతాన్ని ఈ వ్యాసంలో ఎక్కడా విమర్శ చెయ్యలేదు. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను హిందూ మతం కూడా గౌరవించాలి

   Reply

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!