సంఘ దౌర్జన్యం!

షేర్ చెయ్యండి

తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే సంఘం తన బావజాలానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి మీద దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చింది.ప్రో. కంచ ఐలయ్య గారు రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ అనే పుస్తకం వివాదాస్పదం అయి ఈ దౌర్జన్యానికి మూల కారణం అయ్యింది. అంతకు ముందు బెంగుళూరు లో గౌరీ లంకేశ్ అనే మహిళా పాత్రికేయురాలను ఆమే ఇంటి ఆవరణలోనే చంపటం జరిగింది. ఇక 2014 నుండి దేశంలో చాలా సంఘటనలు జరిగేయి.

1920 ఆ ప్రాంతంలో మన తెలుగు ప్రాంతంలో కులంకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులను ‘మాల బ్రాహ్మణులు’ అని పేరు పెట్టి ఆనాటి కుల సమాజం వారికి వ్యతిరేకంగా పనిచేసేవారు. పేపర్లలో వ్యాసాలు రాసేవారు. అప్పుడు గూడూరు రామచంద్ర రావు 1920, ఫిబ్రవరి 7 న కృష్ణ పత్రికలో ‘సంఘ దౌర్జన్యం’ అనే వ్యాసం రాసేరు. కాబట్టి ఇప్పుడు మనం అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చేస్తున్న ఈ దౌర్జన్యాలు ఆనాటి వారి వారసుల కొనసాగింపే. దేశంలో కులం, మతం విషయంలో ఏ మార్పు రాలేదు. రూపాలు మార్చుకుని మన మధ్యే వుంది. ఇప్పుడు ఎస్సిలకు లేదా బహుజన వర్గాలకు చరిత్ర క్లియర్ గా తెలిసిపోయింది. ప్రస్తుతం కాలంలో ఏమి జరుగుతుందో తెలుసు. ఇక భవిషత్ గురించి ఏదైనా ప్రణాళికలు రూపొందించుకుంటారా? లేక కాల ప్రవాహంలో కొట్టుకుపోతారో నిర్ణయించుకోవాలి.

Also read  ఫైల్యూర్ ఆఫ్ ఇండియన్ మెరిట్!

చరిత్రలో జరిగిన ఒక పరిణామం ఎస్సి / బి సి లు అధ్యాయనం చెయ్యవచ్చు. తెలుగు రాష్ట్రంలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించి బ్రాహ్మణేతరులు ( కమ్మ – రెడ్డి ) బ్రాహ్మణుల అధికారం సంపాదించుకున్నారు. అందుకు వారు “జస్టిస్ పార్టీ ” అంటూ ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆనాటి ధనిక వర్గాలు , ఫ్యూడల్ వర్గాల ప్రయోజనాలు కాపాడుతూ రాజ్యాంధికారం సంపాదించుకున్నారు. అధికారం కోసం బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వర్గాలు ఎస్సి లు రాజ్యాధికారం కోసం ఉద్యమాలు, సమీకరణలు చేస్తుంటే కుట్రలతో విచ్ఛిన్నం చేస్తున్నారు. దీనినుండి ఎస్సిలు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుత సమాజంలో ‘కులం’ అనేది అధికార కేంద్ర బిందువు.

బ్రాహ్మణుల నుండి అధికారం చేజిక్కించుకున్న కమ్మ -రెడ్డి బిసి లను , బి సి లు ఎస్సి లను పైకి ఎదగనీయ కుండా అడ్డంపడుతున్నారు. అందుకే ఈ దేశంలో ఎస్సి ల మీద బి సి సామాజిక వర్గాల దాడి ఎక్కువగా జరుగుతుంది. అటు ఫ్యూడల్ , భూస్వామ్య కులానికి , ఇటు బి సి లకు రాజకీయ, సామాజిక ఉమ్మడి అడ్డంకి ఎస్సిలు.

Also read  ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయం సిలబస్ నుండి  ఎందుకు తొలగించాలనుకుంటున్నారు?

ఈ పరిణామాలను ఎస్సి మేధావి వర్గం, రాజకీయ, సామాజిక వర్గాలు గమనించి చెయ్యవలసిన కర్తవ్యం ఏంటి? బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ గారు అణగారిన వర్గాలకు మూడు ప్రధాన ఆయుధాలు ఇచ్చి వెళ్ళేరు.

1. బోధించు
2. పోరాడు,
3. ఆర్గనైజ్

ఈ మూడు సూత్రాలు లేదా ఆయుధాలు విధిగా ఎస్సి సమాజం అనుసరించాలి. భవిషత్ ప్రణాళికల కోసం ఏ కొత్త ఎత్తుగడల కోసం తల బద్దలు కొట్టుకో అవసరం లేదు. ప్రతి సమస్య కి బాబాసాహెబ్ ఒక మార్గం చూపించి వెళ్ళేరు.బాబాసాహెబ్ ఒక్కరే పరిస్థితులనుబట్టి పత్రికలు ను, రాజకీయ పార్టీ , సాంఘిక సంఘం లాంటి సంస్థలను ప్రారంభించి వాటి నుండి ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పేవారు. కరపత్రాలు వేసేవారు. చిన్న చిన్న మీటింగ్ లకు వెళ్లేవారు.

ఇప్పుడు ఎస్సిలు అలా చేస్తున్నారా?

ఇప్పుడు ఎస్సి లలో ఒక విచిత్ర లక్షణం కనిపిస్తుంది. అది ‘సోషల్ అతివాదులు – పొలిటికల్ మితవాదులు’. పొలిటికల్ మితవాదులు సోషల్ అతివాదులుగా మొదట కనిపించి ఆ తర్వాత రాజకీయ ప్రవేశం ద్వారా పూర్తిగా ఎస్సి ల అభివృద్ధి నిరోధికులు అయ్యేరు. ఉదాహణకు మాల మహానాడులు – మాదిగ దండోరా లు. ఇక్కడ ఎస్సిలు ఒక విషయం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది, వేలయేండ్ల కుల వివక్షతకు ఏ వర్గాలైతే కారణమో ఆ వర్గాలు ‘జాతీయత’ పేరిట సాంఘిక అభ్యుదయ నిరోధానికి, కుల చీలికలు , అంధ విశ్వాసాలు, వర్ణాశ్రమ ధర్మం పెత్తనానికి మళ్ళీ ఈ భారతీయ సమాజాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే మొదట బలి ఎస్సి లే…నిద్ర నటించకండి. మేల్కొనండి!!

Also read  ప్రమాదంలో కుల పార్టీల రాజకీయ భవిషత్తు?
(Visited 18 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!