సంత్ రవిదాస్ మందిరం కూల్చివేత: బెదిరింపు ధోరణిలో సుప్రీం కోర్టు తీర్పు!

షేర్ చెయ్యండి
 
ఢిల్లీ లో  గురు రవిదాస్ మందిరం కూల్చివేత కు నిరసనగా నిరసన వ్యక్తం చేస్తున్న భక్తులను ఉద్దేశించి గౌరవ సుప్రీం కోర్టు చేసిన వాక్య వివాదస్పదంగా ఉంది. సంత్ రవిదాస్ భక్తులు , అనుచరులు ఎక్కువ శాతం దళిత వర్గాలు కావడంతో సుప్రీం కోర్టు బెంచ్ చులకనగా వాఖ్యానించిందా అనే అనుమానం కల్గుతుంది.  
 
ఢిల్లీ అభివృద్ధి అధారిటీ తుగ్లక్ బాద్ లో నిర్మించిన సంత్ రవిదాస్ విగ్రహాన్ని, మందిరాన్ని కూల్చివేయడంతో దేశ వ్యాప్తంగా ముక్యంగా ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లోని  రవిదాసీయులు మరియు వాల్మీకి కులస్తులు, దళితులు రోడ్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. 
 
సుప్రీం కోర్టు చేసిన వాక్యాలు యధావిధిగా ఇలా ఉన్నాయి. “Don’t speak a word and don’t aggravate the issue. You are in for contempt. We will haul up your entire management. We will see what has to be done,”  
 
ఇద్దరు సభ్యులు గల బెంచ్ జస్టిస్ M R Shah మరియు Ajay Rastogi ఈ వ్యాఖ్యలు చేశారు. వీరికి సహాయకులుగా అటార్నీ జనరల్ కె వేణుగోపాల్ ఉన్నారు.  
 
ఆగస్టు 13 న దేశవ్యాప్తంగా దళితులు నిరసన వ్యక్తం చేసారు. 
 
సంత్  రవిదాస్  అనుచరులు ఇలా రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేయడాన్ని సుప్రీం కోర్టు రాజకీయం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించడం దురదృష్టకరం. కోర్టు ధిక్కార నేరంగా పరిగణించాల్సి వస్తుందని దళితులను సదరు బెంచ్ బెదిరించింది. 
 

వివాదానికి కారణం ఏమిటి? 

 
15 వ శతాబ్దానికి చెందిన సంత్ రవిదాస్ గుడి గ్రీన్ జోన్ పరిధిలో ఉందంటూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో వివాదం ప్రారంభం అయ్యింది. 
 
సంత్ రవిదాస్  జయంతి మహోత్సవ సమితి  ఉత్సవాలు చెయ్యడానికి నిర్మించిన రవిదాస్ నిలువెత్తు విగ్రహాన్ని మరియు భక్తుల కోసం నిర్మించిన వివిధ రూములను ఢిల్లీ అభివృద్ధి అధారిటి కూల్చివేసింది. 
 
ఎదైతే గుడి నిర్మించిన స్థలం ఉందొ అక్కడ గురు రవిదాస్ మూడు రోజులు జీవించారని సంత్ రవిదాస్ జయంతి మహోత్సవ సమితి  తెలియజేసింది. భక్తుల నమ్మకం, సెంటిమెంట్ ను కోర్టు తీర్పు ఆధారంగా డిడిఏ కూల్చివేసింది. 
 
ఆగస్టు 13 నాటికి సంత్ రవిదాస్ గుడి కులచివేయాలని ఇద్దరు సభ్యులుగల సుప్రీం కోర్టు బెంచ్ ఆగస్టు 10 న ఇచ్చిన తీర్పును మేము అమలుపరిచినట్లు డిడిఎ చెబుతుంది. 
 
నవంబర్ 2018 న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు రద్దు చెయ్యకుండా ఆ తీర్పును కొనసాగిస్తూ ఫ్రై వాక్యాలు చేసింది. 
 

అసలు గుడి నిర్మించిన స్థలం ఎవరిది!

 
సంత్ రవిదాస్ జయంతి మహోత్సవ సమితి ప్రకారం గుడి ప్రాంతాన్ని సంత్ రూపచంద్ అనే వ్యక్తి స్వాధీనం చేసుకున్నారు. సంత్ రూపచంద్ రవిదాస్ మహోత్సవ సమితి పూర్వికులు. ఈయన ఆ స్థలం లో ఒక బావిని నిర్మించాడు. దీనిని చమార్ వాలా జోహార్ అని కూడా పిలుస్తారు. 
 
ఉత్సవ సమితి రెండో వాదన ఏంటంటే ఏ స్థలం అయినా 12 సంవత్సరాలు ఒకరి అధీనంలో ఉంటే ఆ భూమికి అతనే హక్కు దారుడు. అదే ప్రభుత్వ నివాస గృహం అయితే 30 సంవత్సరాలు. 
 
వివాదాస్పదమైన సంత్ రవిదాస్ గుడి ప్రాంతం 160 సంవత్సరాల నుండి గుడి కమిటి అధీనం లోనే ఉంది. 
 
160 సంవత్సరాల నుండి గుడి అధీనంలో ఉన్న స్థలాన్ని కాలి చేయించడం కుట్ర లాగే ఉంది. గ్రీన్ జోన్ లో ఎలాంటి శాశ్విత నిర్మాణం చేయకూడదంటూ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వెంటనే కూల్చి వేసారు. 
 

సంత్ రవిదాస్ ఎవరు?

 
గురు రవిదాస్ సంకీర్తనాకారుడు. 15 మరియు 16 వ శతాబ్దంలో గొప్ప ఉద్యమంగా పేరుగాంచిన భక్తి ఉద్యమంలో భాగస్వామి గురు రవిదాస్. కబీర్ యొక్క ప్రభావం ఇతని మీద ఉంది. . 
 
వారణాసి లో జన్మించిన సంత్ రవిదాస్  తల్లి తండ్రులు చర్మకారులు, అస్పృశ్యులు. భక్తి ఉద్యమం ద్వారా ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లాంటి ప్రదేశాలు తిరిగి ప్రచారం చేసాడు. సిక్కు మత గురువు గురునానక్ ని కలిసినట్లు ప్రచారంలో ఉంది. 
 
సిక్కు ఆధ్యాత్మిక గ్రంధం గురు గ్రంధ్ సాహిబ్ లో సంత్ రవిదాస్ యొక్క భక్తి గీతాలను చేర్చారు. గురు రవిదాస్ నిర్గుణ సంప్రదాయం అంటే సంత్ పరంపరను ప్రచారం చేసిన వ్యక్తి. అతని భక్తి  పాటలు ద్వారా  సామజిక స్పృహను కల్గించడానికి ప్రయత్నం చేసారు. 
 
సంత్ రవిదాస్ జయంతిని వారణాసి గంగా నది ఒడ్డున ప్రతి సంవత్సరం మాఘ మాసం , పౌర్ణమి రోజు వేలాది మంది భక్తుల మధ్య నిర్వహిస్తారు. 
 
గురు రవిదాస్ మీరా భాయ్ కి ఆధ్యాత్మిక గురువు. మీరా భాయ్ సంత్ రవిదాస్ గురించి తన గేయాల్లో ‘గురు మిలియా రవిదాస్ జి … అంటూ రాసారు. 
 
మతం, కులం అనే సామాజిక కట్టుబాట్లు మధ్య గురువు గా ఒక అంటరాని కులానికి చెందిన వ్యక్తి సమాజాన్ని ప్రభావితం చెయ్యడం అయన యొక్క గొప్ప లక్షణం. 
 
అతని 41 ఆధ్యాత్మిక గీతాలు సిక్కు ల పవిత్ర గ్రంధం గురు గ్రంధ్ సాహిబ్ లో పొందుపరిచారు. సిక్కుల 5 వ గురువు గురు అర్జున్ సింగ్ వీటిని చేర్చారు.గురు రవిదాస్ అనుచరులను రవిదాసీ లని పిలుస్తారు. 
 
న్యాయస్థానాలు మనువాదుల అగ్రహారాలా! 
 
160 సంవత్సరాల నుండి రవిదాసీల ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న స్థలాన్ని గ్రీన్ జోన్ అంటూ కూల్చివేయడం దళిత వర్గాల పట్ల బ్రాహ్మణిజం అనుసరిస్తున్న వైఖరికి నిదర్శనం. 
 
నిరసన కారులను ఉద్దేశించి సుప్రీం కోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణి లో వున్నాయి. గ్యాంగ్ స్టార్ లు, భూకబ్జా దారులు బెదిరించినట్లు గౌరవ న్యాయమూర్తులు మాట్లాడటం దళిత వర్గాల పట్ల వివక్ష వలన మాత్రమే. 
 
సదరు న్యాయమూర్తులు మరో అడుగు ముందుకు వేసి ఈ క్రింది విధంగా రవిదాసీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
“You cannot go on and on and make comments and criticism of the judgment. This is the Supreme Court. Don’t invoke politics here.”  
 
కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడితే కోర్టు ధిక్కారం ఎలా అవుతుంది. రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో హిందుత్వ శక్తులు కోర్టు ధిక్కారానికి పాల్పడలేదా?  కోర్టు తీర్పును ధిక్కరించి బాబ్రీ మసీద్ కూల్చిన వారి పట్ల గౌరవ సుప్రీం కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా న్యాయస్థానాలు తమ తీర్పుల్లో తప్పులు ఉంటే వాటిని పునః సమీక్ష చేసి తీర్పులు చెబుతారు. భారతదేశంలో న్యాయస్థానాలు మనువు యొక్క న్యాయస్థానాలుగా ఏకపక్షంగా ఉన్నాయి. 
 
ఎన్నికలకు ముందు వారణాసి లో సంత్ రవిదాస్ మందిరాన్ని దర్శించి ప్రార్ధనలు చేసిన ప్రధాని. ఎన్నికలు అయిపోయిన తర్వాత గురువు మందిరాన్ని కూల్చివేసి దళితుల చరిత్ర లేకుండా చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారు. 
 
హిందూ ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువులు గా ఉన్న దళిత గురువుల మీద మనువాద గురువు లు కుట్రలు చేసి వారిని నిర్వీర్యం చేస్తున్నారు. వారి ఆధ్యాత్మిక కేంద్రాలను ఆక్రమించుకుంటున్నారు. 
 
న్యాయస్థానాలు మనువాదుల కేంద్రాలు అనడానికి కారణం రాజస్థాన్ హైకోర్టు ముందు మనువు విగ్రహాన్ని నెలకొల్పిన మనువాద ఫాసిజం. కాబట్టి తీర్పులు మను గ్రంధం ఆధారంగా చెబుతారు తప్పా, భారత రాజ్యాంగాన్ని అనుసరించి కాదు. 
 
 
 
(Visited 171 times, 1 visits today)
Also read  దళిత మిలినియర్స్: స్ఫూర్తిదాయకమైన దళిత మిలియనీయర్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!