సంబవ కులం: వెలుగులోకి వస్తున్న ప్రాచీనమైన దళితుల బాష!

షేర్ చెయ్యండి
  • 53
    Shares
మెలున్తిమా చెంపకాయి
 
పలుకువా పక్కట్టమారి
 
కన్యావేవ్ కొంనిట్యునై
 
పెయాడల్ తమార్కుపట్టు
 
(లోటస్ వంటి కళ్ళు తెరిచి,
 
ఓ తల్లి!
 
కాళి దేవి, నన్ను రక్షించుము;
 
నా  లోపల భయాలు చంపెయ్ )
 
స్వామిని శివనందన్,  సంబవ కులం కు చెందిన యువ దళిత కవి. కాళికా దేవిని శ్లోకం ఫోన్లో వినిపించేడు. వినటానికి ఈ శ్లోకం చాలా చిత్రంగా ఉంది. కానీ ఈ శ్లోకం తరాల నుండి సాంబవ కులంలో  ఒకతరం నుండి ఇంకొక తరానికి సాంప్రదాయంగా వస్తుంది. 
 
దక్షణాది రాష్ట్రాలలో అసంఖ్యాకమైన మాండలికాలు మరియు భాషలకు నిలయమైన కేరళ రాష్ట్రంలో జనాభా పరంగా అత్యధిక జనాభా కలిగిన  సంబవ కులం వారు మాట్లాడుకునే బాషని వాడుకలో లేకుండా చెయ్యడం దళిత కులాల పట్ల ఈ సమాజం చూపెట్టిన నిర్లక్ష్యానికి ఇదొక మచ్చుతునక. 
 
సాంబవ కులం కి రహస్యంగా మాట్లాడుకోవడానికి, ఒకరినుండి ఒకరు సమాచారాన్ని చేరవేయడానికి  ఒకప్పుడు ఈ భాషను ఉపయోగించే వారని తెలుస్తుంది.ఈ బాష బారత దేశంలోని పురాతన గాత్ర భాషల్లో ఒకటి, కానీ ఇది ఒక లిపిని కలిగి ఉండదు. 
 
అయితే 17 ఏళ్ళ ఏ. పి ఆకాష్ ఇటీవలే సంబవ కులం  మాట్లాడే బాష కోసం స్క్రిప్ట్ అభివృద్ధి చేసేడు. మూడు సంవత్సరాల క్రితం ఆకాష్ నాన్నమ్మ విరాజని దేవి (85 సంవత్సరాలు ) మరియు స్వామిని  మాట్లాడుతుండగా మొదట వినట్లు చెప్పేడు. 
 
ఆకాష్ నాన్న మరియు నానమ్మ సీక్రెట్ బాష లో మాట్లాడుకుంటుడుగా కూడా విన్నాడు, అయితే మొదట్లో ఆ బాష ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు, అయినా చాలా ఉత్సహాంగా , ఆశక్తితో వారి సంబాషణ విన్నానని పేర్కొన్నాడు. 
 
వారి సంభాషణ నన్ను  సంబవ కులం: ప్రజల సాంప్రదాయ బాష మీద పరిశోధన చెయ్యడానికి ప్రేరణ ఇచ్చిందని చెప్పేడు. ఈ విషయాన్ని ఆకాష్ తన బంధువు అయిన స్వామిని తో చెప్పడం తాను కూడా ఆకాష్ చేసే పరిశోధన లో భాగం పంచుకోవడం జరిగింది. 
 
కేరళ దళితులు మాట్లాడే అత్యంత పురాతన బాష కు లిపి రాయడం వారికి చాలా కష్టమనిపించింది. వేలాది సంవత్సరాలు గా లిపి లేకుండా మరుగున పడిన  సంబవ కులం బాష కి లిపి రాసే ప్రక్రియలో ఆకాష్ కి మరియు స్వామిని కి ఎర్నాకులం లో పనిచేసే MI మాధవన్ అనే ఉపాద్యాయుడు సహకరించేడు. 
 
ఏపీ ఆకాష్ – స్వామిని తయారు చేసిన ఈ లిపిని భారతీయ దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి యొక్క ఆమోదం లభించింది. 
 
25 అక్షరాలా ఈ వర్ణమాల ను తన కులం యొక్క బాష కోసం తయారు చేసిన యువకుడు ఏ కె ఆకాష్ ను బారతీయ దళిత సాహిత్య అకాడమీ అభినందించింది. డిసెంబర్ లో ఆకాష్ ని వారు యూత్ ఐకాన్ అవార్డు తో  సత్కరించబోతున్నారు. 
 
ఇటీవల కొత్తమంగళం లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆకాష్ సంభవా కులం యొక్క స్క్రిప్ట్ ని రిలీజ్ చేసేడు. అంతేకాదు ఈ 17 సంవత్సరాల యువకుడు సంభవా కులం మాట్లాడే బాష కు బాషా శాస్త్రం తయారు చెయ్యబోతునట్లు ప్రకటించేడు. 
 
Baratiya Dalit Sahitya Academy
Image: AP.Akash script recognition by Baratiya Dalit Sahitya Academy
 
లిపిలేని ఒక బాష కు బాషా శాస్త్రం తయారు చెయ్యడం చాలా కష్టమని, మేము అవసరమైన పునాదిని ప్రారంభిస్తున్నాం. త్వరలో ఈ పని పూర్తవుతుందని ఆశాభావం వ్యక్త పరిచేడు. 
 
ఆకాష్ మల్లుమ్పి (కంటి), మోల్ట్వెంవల్ (లుక్) మరియు మోలుంథావల్ (ప్రస్తుత రూపం యొక్క నిరంతర రూపం) వంటి సాధారణ పదాలను తీసుకోవడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తరువాత టీన్ మరియు అతని బృందం ఇతర పదాలు కైవసం చేసుకున్నారు. ఒక చిన్న ప్రాజెక్ట్ పెద్ద పని ద్వారా ప్రారంభమైంది 
 
“మొదట నేను నా కుటుంబ సభ్యులతో దీనిని ధృవీకరిస్తాను కానీ క్రమంగా నేను మరింత సహాయం అవసరమని గ్రహించాను” అని ఆయన చెప్పారు. వర్ణమాల మరియు స్క్రిప్ట్ యొక్క నిర్మాణం ఒక కఠినమైన మరియు దుర్భరమైన పని. అతను 2015 లో పనిని ప్రారంభించి 2017 లో మాత్రమే పూర్తి చేసాడు. ఇప్పుడు అతను జాతీయ దృష్టిని వర్ణమాలకి తీసుకొచ్చే లక్ష్యంతో ఉన్నాడు మరియు అది ఒక ప్రాచీన భాష యొక్క స్థితిని పొందేలా చూస్తానని వ్యక్తపరిచేడు 
 
 దళితుల ప్రాచీనమైన భాషను పునరుద్ధరించడం!
మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషల స్థితిని చూసినప్పుడు, కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు కనిపిస్తాయి. స్మిత్సోనియన్మాగ్లో ఒక నివేదిక ప్రకారం, 2100 నాటికి, మానవాళి ఈరోజు ఉపయోగంలో ఉన్న 7,000-ప్లస్ భాషల్లో సగభాగాన్ని కోల్పోతుంది. 
 
ప్రతి 14 రోజులకు ఒక  భాష చనిపోతుంది. దాదాపు ప్రపంచంలోని మూలవాసుల  భాషలో మూడింట ఒకవంతు 1,000 మంది మాట్లాడేవారు ఉన్నారు. ఇంతలో, కేవలం 23 భాషల జనాభా ప్రపంచంలోని సగం కంటే ఎక్కువగా ఉంది..
 
ఒక బాష అంతరించిపోతుందంటే అది సామాన్యమైన విషయం కాదు. మూలవాసులు మాట్లాడే బాష అదృశ్యం అవుతుందంటే అది వారి సంస్కృతి, చరిత్రను శాస్వితంగా కోల్పోతున్నట్లే!
 
అదృష్టవశాత్తు కనుమరుగయ్యే మూలవాసుల బాషను అతి కొన్ని జాతులు మాత్రమే రక్షించుకున్నట్లు చరిత్ర చెబుతుంది. 
 
 అరుదైన సందర్భాల్లో, రాజకీయ సంకల్పం మరియు సమగ్రమైన వ్రాతపూర్వక రికార్డు కోల్పోయిన భాషను తిరిగి పొందగలదని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదికలు తెలియజేస్తున్నాయి 
 
క్రీస్తు పూర్వం నాల్గో శతాబ్దం  నుండి 1800 వరకు హిబ్రూ అంతరించి పోయింది, మరియు కాటలాన్ 1970 లలో ప్రభుత్వం పరివర్తన సమయంలో మాత్రమే వికసించినది. 
 
40 సంవత్సరాల తర్వాత 2001 లో ఒహియోలోని ‘మయామి’ బాష మాట్లాడే ఒకే ఒక వ్యక్తి  చనిపోయేడు, అయితే ఓహియో లోని మయామి  విశ్వవిద్యాలయం లో  మయామి  తెగ విద్యార్థులు వారి బాషను విద్యార్థులు నేర్చుకోవడం ప్రారంభించడం గొప్ప విశేషం. 
 
కొన్ని సంవత్సరాల క్రితం, కాలిఫోర్నియా యొక్క అతిపెద్ద స్థానిక అమెరికన్ తెగలోని యురోక్ యొక్క పెద్దలు వారి భాష మరణించకుండా ఎలా కాపాడుకున్నారో లాస్ ఏంజిల్ టైమ్స్ ఒక కధనాన్ని ప్రచురించింది. 
 
భాషని పునరుద్ధరించడంలో పాల్గొన్నవారు సాధారణంగా భాషావేత్తలు, సాంస్కృతిక లేదా సామాజిక  ఉద్యమకారులు  లేదా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు భాగస్వామ్యం  కలిగి ఉంటారు.  సాంబవా సమాజంలోని యువకులు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు మరియు దానిపైన పని చేస్తున్నారు.
సంబవ కులం సంస్కృతిని నిర్మించడం!
దళితులు, ఈ దేశ మూలవాసులైన సాంబావా జాతి తిరిగి వారి యొక్క కులం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునే దిశలో స్వామిని , శివానందన్ లాంటి యువకులు ఉద్యమంగా తీసుకోవడం వారి బాధ్యతగా తీసుకున్నారు. 
 

సంబవ బాష మా జాతి యొక్క గర్వకారణం. ఇప్పుడు ఇప్పుడే మా భాషను మేము బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు రహస్య బాష గా అంటరాని వారిగా ఉన్న మేము నేడు మా బాషకు లిపి ని బాష శాస్త్రం తయారు చేసుకునే పనిలో ఉన్నాము. 

Also read  స్వాతంత్రదినోత్సవం: చరిత్ర పునరావృతం అవుతుందా!
గత జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది సంబాబా కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు, వీరికి కేరళ రాజకీయ, సాంఘిక జీవితాల్లో ఆధిపత్య శక్తిగా ఉన్నారు. అయితే, ఈ రోజుల్లో సంబవ భాష విస్తృతంగా ఉపయోగించడం నేర్చుకోవడం లేదు. 
 
ఇది ఇడుక్కి మరియు వయనాడ్ జిల్లాలలో, కొట్టాయం, కొల్లం లోని తిరువల్ల మరియు పెరుంబవూర్ (ఎర్నాకుళం జిల్లా) ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. అనేక దళితులు ఎదుర్కొన్న సాంఘిక అణచివేత మరియు బహిష్కరణలు 1800 చివరిలో మరియు 1900 ల ప్రారంభంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించాయి, మరియు వారి సాంస్కృతిక మూలాలు దెబ్బతీశాయి. 
 
మా గత చరిత్రను తిరిగి పొందటం లో మేము కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. మాకు బెదిరింపులు వస్తున్నాయి అని స్వామిని చెబుతుంది. 
 
స్వామిని మాట్లాడుతూ, మనువాదులు కొందరు మా కుల చరిత్రను మా కులం యొక్క సంస్కృతిని తిరిగి పొందేక్రమంలో వారి నుండి మాకు బెదిరింపులు వచ్చాయి. దళితుల ఆత్మాభిమానం పెంపొందించుకునే క్రమంలో మా ప్రయత్నాలను చూసి అగ్రవర్ణాలు అసూయపడుతున్నాయి. అడ్డంకులు కల్పిస్తున్నారు. 
 
కేరళ రాష్ట్రంలోని సాంబావ కులం లోని కొత్తతరం ప్రజలకు ఈ బాష గురించి తెలియదని ఆకాష్ చెప్పేడు. మా మిషన్ దళితుల యొక్క గర్వకారణం గా మేము చెప్పగలం. మా బాషను పునరుద్ధరించడం లో దళిత జాతికి గర్వకారణం. 
 
అణగారిన వర్గాల కొత్త గొంతుక సాంబావ బాషా. ఇది కొత్త చైతన్యాన్ని ఇస్తుంది, మా సంస్కృతి ని మేము నిర్మించుకుంటాం అంటున్నారు స్వామిని, ఆకాష్. ప్రదాన స్రవంతికి తీసుకు వస్తాం. 
ఏపీ ఆకాష్ మరియు అతని సహచరులకు అభినందనలు!
అనేకమంది రచయితలు, ప్రత్యేకించి దళిత సమాజంలోని వారు సంబవ  లిపి అభివృద్ధి గురించి సంతోషిస్తున్నారు. రచయిత మరియు దళిత విమర్శకుడు సన్నీ ఎం కపికాద్ మాట్లాడుతూ, ఏ దళిత భాషకు సంబంధించిన లిపి ఇంకా చూడలేదని, ఆకాష్  కృషి చాలా  ప్రత్యేకతను సాధించింది 
Aksha_sambava_Language
Imge: AP Akash showing his script of Sambava language
ఒక కులం మధ్య రహస్య సమాచార ప్రసార మాధ్యమంగా ఉపయోగించిన ఈ సంబవ బాష  దాని వర్ణమాల అభివృద్ధి చేయబడితే అదదే  పెద్ద లిపి, దానిని రాసినా గుర్తింపు వస్తుందని అయన అన్నారు. 
 
గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి అంతర్గత బాషలు అంతరించిపోతున్నాయి. ముక్యంగా మూలవాసులు మాట్లాడిన బాష లిపి లేకపోవడం వలన ఇప్పటికే చాలా వరకూ అంతరించి పోయాయి. గిరిజన తెగలు మాట్లాడే చాలా వరకూ వాడుకలో లేవు. 
 
ప్రముఖ బాషా  శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోపాలకృష్ణన్  సంబవ కులం ప్రజల బాష విన్నాను అని ఇది ఒక రహస్య బాష లాగా వారు ఉపయోగించేవారు ముక్యంగా అగ్రకులం వారు వారి మధ్యకు వచ్చినప్పుడు, దాడి జరిగేటప్పుడు మిగతా వారిని  ఈ బాషను  ఉపయోగించేవారు. 
 
 
 సాదారణంగా దోపిడీ కులాలు దళిత ప్రజల మీద దాడి చేసేటప్పుడు  సంబవ కులం ప్రజలు సమాచారాన్ని  ఒక్కరికి ఒకరు  చేరేవేసే దానికి ఈ బాష ఉపయోగించేవారని, ఇది ద్రావిడ భాషల్లో అత్యంత పురాతనమైనది గా ప్రొఫెసర్ నాధువతం చెప్పేరు. 
 
ఆకాష్ సాధ్యం కానిది సాధ్యం చేసేడు. ఆకాష్ తండ్రి వడ్రంగి పని తల్లి నర్సరీ లో దినసరి కూలీగా పనిచేస్తుంది. ఆకాష్ కుటుంబ పోషణకు మరియు తను చేస్తున్న ప్రాజెక్ట్ కు ఆర్ధిక అవసరాలకు పార్ట్ టైం ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. 
 
ఆకాష్ చేసిన కృషి వలన నేడు సంబవ కులంసాంబవ కులం గర్వాంగా ఉంది. ఎన్నో తెగల మాతృ బాష అంతరించిపోతే ఆకాష్ వారి కమ్యూనిటీ భాషకు జీవం పోసేడు. కొత్త తరం ఆకాష్ వలన సంభవ బాషా మాట్లాడుకునే అవకాశం కల్గింది. 
 
Curtsy : The news minute
(Visited 371 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!