సమాజాన్ని విడదీస్తున్న మతోన్మాదం!

షేర్ చెయ్యండి

“బలాబలాల సమతుల్యత అనే పద బంధం యుద్ద ప్రేరేపకుల సంధిప్రేలాపన. ఇది పై చేయి సాధిస్తున్న కాలం ప్రపంచం లో ఎక్కడా శాంతి కి తావుండదు” : జాన్ బ్రైట్, బ్రిటిష్ రాజనీతిజ్ఞడు.

మన దేశం లో ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ఇది అక్షర సత్యం అనిపిస్తుంది. కేంద్రం లోని బా జ పా ప్రబుత్వం తమ అవకాసాలను సుస్తిరం చేసుకోవటానికి ఉపయోగిస్తున్న ఎత్తుగడలు , ప్రణాలికలు చూస్తుంటే తమ రాజకీయ బలం పెంచుకునేదానికి అత్యంత తెలివిగా ప్రజలను వర్గాలుగా విడదీస్తూ అప్పుడు అప్పుడు నీతి సూత్రాలు చెబుతుంది.

ప్రపంచం లో ఏ మూలకు వెళ్ళినా ప్రజలు రెండు వర్గాలుగా మనకి కనిపిస్తారు. ధనికులు – పేదలు. పెట్టుబడిదారులు – సోషలిస్ట్ లు / ప్రజాస్వామ్య వాదులు. కాని బారత దేశం విబిన్న కులాలుగా విడిపోయింది. క్షత్రియ – బ్రంహణ వర్గాలు ఒకవైపు ఉంటే శూద్ర కులాలు ఇంకొక వైపు. ఆ కులాలను శాసిస్తున్న హిందూ మత రాజ్యాంగం ప్రజలను శాసిస్తుంది. గత దశాబ్ద కాలంగా హిందూ మత రాజ్యాంగం వైపు అత్యంత చాకిచాక్యంగా పావులు కదిపేరు ఆ ప్రయత్నం లో ఒకవిధంగా పై చెయ్యి సాధించే దిశగా ఉన్నారు. ఇందుకు శూద్ర కులాలను హిందు మత రాజ్యాంగం అక్కున చేర్చుకోవటం మొదటి ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఆ క్రమము లోనే అర్ ఎస్ ఎస్ – బా జ పా కళ్యాణ సింగ్ , ఉమాబారతి , ప్రస్తుత ప్రదాని నరేంద్ర మోడీ లాంటి శుద్రులను తెరపైకి తీసుకు వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా పాలిస్తున్న కాంగ్రెస్ మీద ప్రజల అవిస్వాసం ఒకవైపు – అభివృద్ధి ముసుగులో దిగజారి పోతున్న ప్రజల ఆర్ధిక పరిస్తితులు , యువత అసహనం మోడీ & కో మత జాతీయత ప్రజలను ఆకర్షించింది. మెజారిటీ శూద్రులు , అగ్రకులాలుగా హిందూ మత రాజ్యాంగాన్ని బుజాన ఎత్తుకున్నారు. అందుకే ప్రజలు, సమజాం రెండు వర్గాలుగా విడిపోయింది అర్ ఎస్ ఎస్ & కో మత జాతీయ వాదులు – దళిత ముస్లిం, బాబాసాహెబ్ డా  అంబేద్కర్ వాదులు మరియు కమ్యునిస్ట్ లు. 


మద్రాస్ విశ్వ విద్యాలయం నుండి, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ జె న్ యు వరకూ ప్రస్తుత పరిణామాలు గమనిస్తే సమాజం దళిత , ముస్లిం బాబాసాహెబ్ డా  అంబేద్కర్ మరియు కమ్యునిస్ట్ – అర్ ఎస్ ఎస్ మత రాజ్యాంగ వాదులుగా సమాజం విడిపోయింది.

ప్రజస్వామ్యం కాపాడాల్సిన న్యాయవ్యవస్త , పోలీసు , మీడియా కూడా వర్గాలుగానే విడిపోయింది అని చెప్పటం లో ఎలాంటి ప్రశ్నకు తావులేదు. ది పొర్త్ ఎస్టేట్ ఇప్పుడు పాలకుల జేబు సంస్తగా మారిపోయింది.

Also read  అంటరాని కులాల మొదటి విజయం!

” for in these days, with the press in hand it is easy to manufacture great men ” Babasaheb Dr. B R Ambedkar

బహుసా ఆనాడు బాబాసాహెబ్ చెప్పిన మాట నేడు నిజం చేస్తున్నారు.మీడియా / సోషల్ మీడియా ఇప్పుడు కొత్త జాతీయ వాదులను తయారు చేసే పనిలో చాలా బిజీ గా ఉంది. అందుకే క్షణాల్లో రోహిత్ వేముల , జె న్ యూ విద్యార్ధి నాయకుడు కన్నయ్య కుమార్ మరియు వారి అనుచరులు క్షణాల్లో దేశ ద్రోహులు అయ్యేరు. 
చివరిగా బాబాసాహెబ్ డా బి ర్ అంబేద్కర్ గారు చెప్పిన ఇంకొక మాట.

” Ours is a battle; not for wealth , not for power, ours is battle; for freedom for reclamation of human personality “

ప్రజాస్వామ్యం జిందాబాద్ , ఫాసిజం నశించాలి. 

 
(Visited 55 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!