సాంఘిక విప్లవం లేకుండా రాజ్యాధికారం సాద్యమా!

షేర్ చెయ్యండి
బారత దేశంలోని పాలిత సమాజం అణగారిన వర్గం అంటూ మెజారిటి సమాజాన్ని తమ ఆర్ధిక , విద్య మరియు భూస్వామ్య బలంతో పరిపాలిస్తున్నారు. బాబాసాహెబ్ డా . బి ర్ అంబేద్కర్ సృష్టించిన విద్య అనే విప్లవం ద్వారా అణగారిన వర్గాల లో వచ్చిన చైతన్యం ఇప్పుడు రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తుంది , మధ్య బారత దేశం లో ఒక సామాన్య దళిత మహిళ ముఖ్యమంత్రి అయ్యేరు , ఒక వెనకబడిన వర్గాల వ్యక్తి ప్రదాన మంత్రి కాగలిగేరు.అయితే ఈ సాంఘిక చైతన్యం / విప్లవం వందల సంవస్తరాల గా సామాజికంగా వెనకకు నేట్టబడిన ప్రజలకు సరి పోతుందా ? ఇదే నిజమైన రాజ్యాధికార చైతన్యమా ? ఎవరి అడుగు జాడల్లో ఎస్సి లు రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తున్నారు ?

తెలంగాణా లో ఎన్నికలకు ముందు దళిత ముఖ్యమంత్రి ఒక అగ్రకుల పెత్తందారి పార్టి నుండి వచ్చిందే , బి సి ముఖ్యమంత్రి ఇంకొక అగ్రకుల పెత్తందారి పార్టి నుండి వచ్చిందే , మోడి BC ప్రదాన మంత్రి ఒక అగ్రకుల మత చాందసవాద పార్టి నుండి వచ్చిందే, అయితే రాజకీయ ఎత్తుగడ లో బాగంగా ఆయా వర్గాల రాజకీయ నాయకులు వివిధ పార్టిల నుండి రాజ్యదికార దిశగా అడుగులు వేస్తున్నారు అని అనుకుందాం , అయితే ఈ మార్పు ఆ వర్గాల ప్రయోజనాలు కాపడుతుందా? అణగారిన వర్గాల సామాజిక స్తితిని మారుస్తుందా ? ఒక్క రాజ్యాధికారం ఎస్సి  వర్గాల సామాజిక , ఆర్ధిక స్తితిగతిని మారుస్తుందా ? ఖచితంగా అవును / కాదు అని చెప్పలేము . అందుకు ఉదాహరణ ఉత్తరప్రదేశ్ – బెహన్ జి కుమారి మాయావతి గారి ప్రబుత్వం. దేశం లో ఏ వర్గాన్ని  అడిగిన మొదట ప్రశ్న ఉత్తర ప్రదేశ్ వైపు చూపిస్తారు. రాత్రికి రాత్రే ఏ పార్టి , ఏ వర్గ ముఖ్యమంత్రి అద్బుతాన్ని సృష్టించలేరు, కాని వర్గ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఆ పార్టి రాజ్యాధికారంలో వుండి చేసినది ఏమిటి అని ప్రస్నించక మానరు. ఉదాహరణ కు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టి నే ఉదాహరణ గా తీసుకుందాం తెలుగు దేశం పార్టి లో ఆ వర్గాల(కమ్మ కుల)సామాజిక   చైతన్యం ఎస్సి  వర్గాల లో ఉందా ? లేదు అని ఖచితంగా చెప్పగలం .

Also read  ఎస్సీ ఎస్టీల పదోన్నతుల్లో రిజర్వేషన్: సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

అందుకే విద్య , వ్యాపార   ,ఆర్ధిక రంగాలలో ఎస్సి  వర్గాలు అభివృద్ధి చెందకుండా , ఆ వర్గాలను ఒకతాటిపైకి తీసుకు రాకుండా చైతన్యం కలిగిన కొద్దిమంది వివిధ పార్టిల నీడన చేరి ఆ అవర్గాలను ఓటు బ్యాంకు గా చిత్రీకరించటానికి తప్పా, నిజమైన రాజ్యాధికారానికి ఉపయోగాపడక పోవచ్చు .
 

(Visited 48 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!