సామాజిక స్మగ్లర్లు!

షేర్ చెయ్యండి

ఇన్నిరోజులు స్మగ్లర్ ల గురించి తెలుసు. వాళ్ళు ఎలా ఉండేవారో సినిమాలో చుసేము. అయితే సినిమాలో చూపించినట్లు వారు ఇప్పుడు లేరు. తళ తళ మెరిసే మంచి తెల్ల చొక్కా, సంస్కారవంతంగా ఉంటారు. దేవుడి భక్తి చిహ్నాలు. చాలా పెద్ద మనుషులులా ప్రవర్తిస్తారు.

బారత దేశం నిత్యమూ అభివృద్ధి చెందుతున్న దేశమే, ఒక్కో ప్రబుత్వం ఒక్కొక నినాదం ఇస్తూ దేశాన్ని అభివృది చేసేము అని ఎన్నికలకు వెళ్తారు. ఆ మధ్య వాజిపాయ్ ప్రబుత్వం దేశం వెలిగి పోతుంది అని ఆకర్షనీయమైన ప్రకటనలు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ప్రజలు తిర్స్కరించేరు. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రబుత్వం అసలు స్కాం లతో వారి ఓటమి వారే ఓడించుకున్నారు. అయితే సామాన్య ప్రజలకు ఒక అనుమానం రావోచ్చు ఇన్ని సంవత్సరాలు అయినా ఎందుకు దేశం అభివృద్ధి చెందలేదు, లక్షల కోట్ల బడ్జెట్ ఏమౌతుంది, దేశంలో ఎందుకు ఇంకా కనీస సౌకర్యాలు కల్పించలేక పోయేరు. సామాన్యుడికి వచ్చే ఇలాంటి ఆలోచన అది ఐదేళ్ళకొక్కసారి వచ్చే ఓటు అనే ఆయుధంతో సమాధానం చెబుతాడు. పాలకులు మారుతున్నారే కానీ సమాజం, ప్రజల అభివృది ఎండమావిగానే ఉంది.

ఇది ఇలా ఉంటే అసలు దేశంలో ఉత్పత్తి అవుతున్న సంపద అంతా ఎవరి చేతుల్లోకి పోతుంది, అసలు ఏమౌతుంది అని ఆలోచిస్తే ప్రో. కంచ ఇలయ్య ఆసక్తికరమైన ఒక చర్చ మన సమాజంలో పెట్టేరు. అదే సామాజిక స్మగ్లర్లు. అయితే కంచ ఐలయ్య గారు ఒక కులాన్ని సంబోధించి అంటే ఇక్కడ మనం మొత్తం వ్యవస్తలో జరుతున్న సామజిక స్మగ్లింగ్ ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకుందాం.

Also read  దేశ ప్రగతికి అడ్డు కుల రిజర్వేషన్ల లేకా స్కాంలా!..

కంచ ఐలయ్య చర్చ దురదృష్టవశాత్తు పక్కదారి పట్టింది. కారణం కులం. ఏది ఏమైనా ఇప్పుడు సమాజంలో చర్చ జరుగుతుంది.స్మగ్లర్లు ఎవరు వారి కార్యకలాపాలు ఏంటి అని ప్రజలు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యాన సామాన్య గృహిణి కూడా స్మగ్లర్లల గురించి తెలుసుకుంటున్నారు. మన దేశంలో వ్యాపారం ఎన్ని అడ్డదారులు తొక్కుతోంది, వ్యాపారం చేసేవారు ఎంత అడ్డమైన గడ్డి తిని వారి ఆస్తులు పెంచుకుంటున్నారు, ట్యాక్స్ లు కట్టకుండా ఎలా ప్రభుత్వాన్ని, వినియోగదారులను మోసం చేస్తున్నారో ప్రజలు చర్చిస్తున్నారు. కాబట్టి చర్చ మంచిదే. అది ఎ రూపాన ఉన్న చర్చ మంచిదే.

అచ్చేదిన్ ఆగయా! 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ మంత్ర దండం. విదేశాల్లో మూలుగుతున్న భారతీయ అక్రమార్కుల డబ్బు తీసుకు వచ్చి ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాను అన్నారు. అన్నా హజారే, కేజ్రీవాల్ లాంటివారు నీతికి మేమే ప్రతినిధులం అని ఉదార గొట్టేరు. ఎన్నికలు అయిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది. సంస్కరవంతమైన మాటలు చెప్పిన వారు అధికారం లోకి వచ్చేరు కానీ అవినీతి ఒక్క ఇంచి కూడా నిర్ములాన జరగలేదు.

మోడీ డబ్బులు వేయలేదు. ఇపుడు మనం ఐలయ్య గారి బాష మాటల్లో మాట్లాడు కుందాం. ఈ స్మగ్లర్లు ఎవరు? ఈ సామాజిక స్మగ్లర్లు ఎవరు?

Also read  డిజిటల్ దళితులు-సోషల్ మీడియా దళితుల రాజకీయ అవకాశాలను పెంచుతుందా

దేశాన్ని నాశనం చేస్తున్న ఈ స్మగ్లర్లు ఎవరు? వారి సామాజిక నేపథ్యం ఏంటి? స్మగ్లర్లు లకు సామాజిక నేపధ్యం ఏంటి, తోట కూర కట్ట కాకపోతే అంటారా! రాష్ట్రపతి కి కులం ఆపాదించి దళిత రాష్ట్రపతి అంటున్నారు, ఒక మహిళ ని మానభంగం చేస్తే దళిత మహిళ అని తాటికాయ అంత అక్షరాలతో రాస్తున్నారు. ఒక ఉగ్రవాది అరెస్ట్ అయితే మొత్తం ముస్లిం ఉగ్రవాదులు అంటున్నాం కాబట్టి స్మగ్లర్లు లకు కూడా సామాజిక నేపథ్యం ఉంటుంది, వారి సామాజిక వర్గం గురించి మాట్లాడితే తప్పుకాదు!

ఐలయ్య గారు అంటున్నట్టు productivity, non productivity ల భాగస్వామ్యం ఈ దేశ నిర్మాణం లో వారి పాత్ర మీద చర్చ జరగాల్సిందే. ఈ దేశం అవినీతి ఊబిలో ఎవరి స్వార్ద ప్రయోజనాల కోసం కూరుకు పోయింది అందులో సామాజిక వర్గాల పాత్ర తెలాల్సిందే. కులాల ప్రకారం ఓట్లు అడుగుతున్నప్పుడు, కులాల ప్రకారం సమాజంలో స్థాయిని (social status ) పెంచుకుంటున్నప్పుడు కులాల ప్రకారం స్మగ్లర్లు ఎవరో కూడా తెలియాలి కదా! చాలా రోజులు వరకూ దొంగలు ఎవరూ ఆంటే ఫలానా కులం అనేవారు. మేము మారేము అన్నా కూడా ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులు మొదట ఆ ఫలానా కులం వారి ఇండ్ల మీద పడే వారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక నీతి లేకుండా బారత దేశం సంపద అంతా ఏమవుతుంది, ఏ సామాజిక వర్గాలు అక్రమంగా సంపాదించుకుంటున్నారు అనే చర్చ చేస్తే సామాన్యులకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి స్మగ్లర్లు ఎవరో నిగ్గు తెలుద్దాం.

Also read  గాడ్సే:గాంధిని చంపడానికి కారణాలు ఏమిటి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక గొప్ప పరిణామం జరిగింది. లక్ష కోట్ల అవినీతి చేసేడు అంటూ వై యెస్ జగన్మోహన్ రెడ్డి మీద , CBI ఎంక్వయిరీ వేసి ఒకటిన్నర సంవత్సరాలు జైలులో పెట్టెరు. ఇప్పుడు న్యాయ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు నిజం అని కోర్టు నిర్ధారణ చేసి శిక్ష వేసినా లేదా ఆరోపణలు నిజం కాకుండా కోర్టు జగన్మోహన్ రెడ్డి ని నిర్దోషిగా ప్రకటించినా ఒక చారిత్రాత్మకమైన సంఘటన కు పునాది అవుతుంది. కాబట్టి అవినీతి, అక్రమ వ్యాపారులు ఎవరో, ఏ సామాజిక వర్గమో మాట్లాడుకుందాం. చర్చ చేద్దాం. కులాల పునాదులను కదిలిద్దాం.

ఐలయ్య గారి బాషలోనే స్మగ్లర్లు ఎవరో నిగ్గు తెలుద్దాం, బారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటిద్దాం.

(Visited 41 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!