సిద్దప్ప వరకవి తొలితరం మూలవాసి తత్వవేత్త- బహుజన చైతన్య దీపిక!

షేర్ చెయ్యండి
  • 43
    Shares
 
సిద్దప్ప వరకవి మట్టిలో పుట్టిన మాణిక్యం. చరిత్ర మరిచిన మూలవాసి తత్వవేత్త. ఈ దేశం ఇంకా ఎందుకు వెనకబడి ఉందంటే కారణం మతం – కులం.  నీ కులం ఏదని నను అడిగితె నాకు సిగ్గు అంటూ బహుజన కులాలు అన్నీ నావే అంటాడు సిద్దప్ప వరకవి. రండీ అందరం కలిసి కులాన్ని పారద్రోలుదాం అంటాడు. 
 
సహజంగా మనం బి సి కులాలు హిందూ మతం వైపు వడివడిగా అడుగులు వేస్తూ బ్రాహ్మణ  కుల వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు అని అంటున్నాము.  విశ్వ బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ గౌడ , యాదవ ఇలాంటి కులాలు ఇప్పుడు హిందూ మతం తో మమేకమై బ్రాహ్మణ మతానికి రక్షణ గా ఉన్నారు. 
 
అయితే బి సి లలో సామాజిక చైతన్యం పూర్వ కాలం నుండే ఉంది. మరి వారి చైతన్యాన్ని బ్రాహ్మణిజం ఎలా మింగేసిందో తెలియదు కానీ నేడు నిర్వీర్యం గా ఉన్నారు అనేది వాస్తవం. 
 
ఒక పోతులూరి వీర బ్రహ్మం ను పరిశీలన చేస్తే బ్రాహ్మణ కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించిన వ్యక్తి.. వీర బ్రహ్మం తత్త్వం  పూర్తిగా బహుజనులకు దక్కకుండా చేసింది బ్రాహ్మణ వ్యవస్థ. 
 
 సిద్దప్ప వరకవి , కరీంనగర్ కు చెందిన వ్యక్తి. తెలంగాణా తోలి తత్వకవి, వైతాళికుడు. కుమ్మరి కుటుంబం లో పుట్టిన సిద్దప్ప వరకవి 1903 లో గుండా రెడ్డి పల్లెలో జన్మించేడు. 
 
బ్రాహ్మణ కుల వ్యవస్థను వారి యజ్ఞ బలులను  తన కవితలు ద్వారా చీల్చి చెండాడిన వ్యక్తి. నల్లమేకను దెచ్చి నా యజ్ఞమున నిలిపి
నవరంద్రములు మూసి నణగబట్టీ, చంపి 

దానిని దీసి సరి హోమమున గాల్చి తినుచు 

ముక్తులమనిన ద్విజులు గారు ప్రజల మెప్పుల
 కొరకు బహుయజ్ఞముల జేసీ పాపరహితుల 
మనిన ఫలము లేదు
సోహా మెరిగినయట్టి సోమయాజియునైన
జీవ హింసలు జేయ జెల్ల దేవుడు 
 
ఆనాటి బ్రాహ్మణులు  జీవ హింస ఎలా చేసేవాడో ఈ కవిత ద్వారా మనకి సిద్దప్ప వరకవి చెప్పకనే చెప్పేడు. ఆ హింస అతి భయంకరంగా కూడా ఉంటుంది. అలాగే నేటి హిందూ వ్యవస్థ బహుజనులకు జీవహింస చెయ్యకూడదు, మాంసాహారం తింటే జ్ఞానం రాదు అని నిత్యం మనకి ప్రవచనాల ద్వారా, యోగ – ఆరోగ్యం పేరుతొ బహుజనుల ఇళ్ల ల్లో వారి బావజాలాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. 
 
ఏ మీడియా కానీ లేదా సాంస్కృతిక సంఘం కానీ బహుజనుల సంస్కృతి ని ప్రచారం చేసిన దాఖలాలు లేవు. 
 
బ్రాహ్మణుల కుల సంస్కృతిని బహుజనుల మీద రుద్దుతూ వారు ఇప్పుడు ప్రకృతిని ప్రేమించిన బహుజనులకే నీతి పాఠాలు చెబుతున్నారు అంటే బహుజనుల , మూల వాసుల సంస్కృతిని ఏ విధంగా నామ రూపాలు లేకుండా చేసేరో అర్ధం అవుతుంది. 
 
ఏ కులంబని నను  ఎరుకత తో అడిగేరు 
నా కులంబున చెప్ప నాకు సిగ్గు 
తండ్రి బొందిలి వాడు, తల్లి దాసరి వనిత 
మాతాత మాలోడు మరియు వినుడి 
మా యత్త మాదిగ  మామ యెరుకలి వాడు 
మా బావ బలిజయు మానవతుడు 
కాపువారి కాంత దౌమ్మరి వైశ్య 
బార్యగా వలెనాకు ప్రాణ కాంత 
పరుల మోహించి గడకెక్కి పాట పాడి 
కులము మరచి నాతోటి గుడమనెను
 
అంటూ ఆకాలంలోనే కులన్ని వదిలి సమాజంలోని పోకడలను ప్రవచించిన తత్వవేత్త వరకవి సిద్దప్ప రాజయోగి. 
 
ఈ దేశంలో హిందూ కుల వ్యవస్థ పట్ల బహుజనులు ఎంత విరక్తి స్వభావంతో ఉన్నారో 1903 లో జన్మించిన వరకవి ని మరియు పోతులూరి వీర బ్రహ్మం ను యోగి వేమన కవిని, కుసుమ ధర్మన్న కవిని చుస్తే మనకి అర్ధం అవుతుంది. 
 
ఈ బహుజనుల తత్వ జ్ఞానాన్ని మరుగున పరచి ప్రజలు ముక్యంగా వెనకబడిన కులాలలో చైతన్యం రాకుండా చేసేరు. దశాబ్దాల నుండి బ్రాహ్మణ కవులు నన్నయ , తిక్కన , ఎర్రన్న , అన్నయ్య శ్రీనాధుడు తదితర సంస్కృత కవుల శృగార కావ్యాలు మనమీద బలవంతాన రుద్దేరు. 
 
బహుజనులు అచ్చ తెలుగులో రాసినవి కనీసం ప్రచురణ కు కూడా నోచుకోకుండా చేసేరు. వారి పేరునే చరిత్ర పుటల్లో లేకుండా చేసే ప్రయత్నం చేసేరు. 
 
బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ 1932 లో  తన కుల నిర్ములనా వ్యాసాన్ని ప్రచురించి సంచలనం సృష్టించి బహుజనులలో చైతన్యం సృష్టిస్తే వరకవి సిద్దప్ప లాంటి వారు అంతకు పూర్వమే తమ కవితలు ద్వారా కుల రీతులను ఎండ గెట్టేరు. 
 
రాతి బొమ్మలు మొదటి రాశిగా అన్నంబు 
తినుమన్న యా రౌతు తినుదరన్న 
తినెడి వాడివి నీవే, నీవే తీవ్రంబు చెందేవు 
కానలేవు నీలోని తిమిరములను 
పేదలకు అన్నంబు పెట్టు దైర్యంబు లేదు 
గట్టు రాళ్లకు తిండి పెట్టగలవే
 
అన్నం లేక పేద వర్గాలు అల్లాడిపోతుంటే, ఈ హిందూ పూజారి వర్గం రాతి బొమ్మలను దేవుడు చేసి దేవుడు కి అన్నం పెడుతున్నాం అంటూ ఎలా మోసం చేస్తున్నారో వరకవి సిద్దప్ప తెలియజేసేడు. 
 
అట్టడుగు వర్గం లో పుట్టిన సిద్దప్ప ఇంగ్లీష్, హిందీ , ఉర్దూ, పార్సీ ,సంస్కృతం బాషలలో ప్రావీణ్యం సంపాదించేరు. సిద్దప్ప ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. నైజాం వ్యతిరేక ఉద్యమం తెలంగాణా లో వస్తుండగా రజాకార్ల ఆగడాల వలన సిద్దప్ప ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. 
 
సిద్దప్ప వరకవి జ్ఞానబోధిలోని నాలుగు బాగాలు జీవన సత్యాలను ఆవిష్కరించేరు. కుల, మత, వర్గ వ్యవస్థలను తన రచనలు ద్వారా ప్రజలను చైతన్య పరిచేరు. 
 
నైజాం కాలం లోనే గోల్కొండ అనే పత్రికలో వరకవి సిద్దప్ప కవితలు ప్రచురించేరు. సిద్దప్ప కవి యొక్క తత్వ బోధనలు విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు పరిశోధనలు చెయ్యాలి. సిద్దప్ప కవి 1984 మార్చి 23 న మరణించేరు. 
 
1996 లో గంగారెడ్డి పల్లి లో సిద్దప్ప కవి విగ్రహం ఆవిష్కరించేరు. అయితే చరిత్ర లో సాధారణ గా జరిగినట్లే సిద్దప్ప వరకవి కూడా మరుగున పడిపోయేరు. 
 
చరిత్ర తెలియని వారు, చరిత్ర నిర్మించలేరు అన్న బాబాసాబ్ డా అంబేడ్కర్ చెప్పిన సత్యాన్ని బహుజనులు గుర్తు పెట్టుకోవాలి. లేదంటే బ్రాహ్మణిజం లో బహుజనుల చరిత్ర కనుమరుగవుతుంది. 
 
 
 
 
 
 
 

 

 
(Visited 164 times, 7 visits today)
Also read  కెసిర్ ఫెడరల్ ఫ్రంట్ కేంద్రం మీద పెత్తనం కోసమేనా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!