సుప్రీం కోర్టు తీర్పు ఎస్సి,ఎస్టీ మహిళల పై దాడులను ప్రోస్తహిస్తుందా!

షేర్ చెయ్యండి

Even the killing of a Dalit woman is explicitly justified as a minor offense for the Brahmins: equal to the killing of an animal (Manusmitri). If the killing of an untouchable was justified as a minor offense, you can imagine the treatment they received throughout their lives.

 ఎస్సి ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం (పి ఓ ఏ యాక్ట్ ) పై సుప్రీం కోర్టు మార్చి 20 వ తేదీన వెల్లడించిన తీర్పు   దళిత, ఆదివాసీ మహిళ ల బద్రత కు తీవ్ర నష్టం చేకూరుస్తుంది.

బారత దేశంలో మహిళల పట్ల ఎ విధమైన  వైఖిరి అమలుపరుస్తున్నమో అందరికీ తెలిసిందే, అందులో ఇంకా దళిత , ఆదివాసీ మహిళ అంటే ఇంకా చిన్నచూపు చూస్తారు. ఈ దేశంలో మహిళ లు వేరు , దళిత మహిళ వేరు అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు.

ఎస్సి, ఎస్టీ యాక్ట్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దళిత మహిళ లు తీవ్రంగా ఖండిస్తున్నారు. మన దేశంలో ప్రతి ఐదు కేసులను తీసుకుంటే అందులో ఒక కేసు ఎస్సి, ఎస్టీ అత్యాచార నిర్దోధక చట్టం క్రింద నమోదు అవుతుంది, అది కుడా దళిత మహిళల పై జరుగుతున్న దాడి పై కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం దళిత మహిళ పై బలత్కరించడం, బలత్కరించటానికి ప్రయత్నించడం, కిడ్నాప్, బలవంతాన పెళ్లి చేసుకోవడానికి ఎత్తుకు వెళ్ళడం, అవమానించడం, కొట్టడం, వివస్త్ర ను చెయ్యడం లాంటి నేరాలు తరచుగా జరుగుతున్నాయి.

Also read  దళితుల బంద్ బా జ పా దళిత ఓటు బ్యాంక్ కి గండి కొడుతుందా!

బారత చట్టాలు, రాజ్యాంగం దళితుల పట్ల వివక్ష మరియు దాడి చెయ్యడం, అంటరానితనం నేరంగా పరిగణిస్తుంది. అయినా సరే దేశంలో దళితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. దేశం మొత్తం మీద ఒక వారంలో 21 మంది దళిత మహిళలు అత్యాచారానికి గురిఅవుతున్నారు అని క్రైం రికార్డ్స్ క్లియర్ గా చెబుతున్నాయి. ఈ 21 మందిని అత్యాచారం చేసిన వ్యక్తులకు ఎందుకు శిక్షలు పడటం లేదు?

NCRB, National crime record Bureau 2016 యొక్క రిపోర్ట్ ను 2017లో   మొట్టమొదటి సారి నగరాల వారిగా ఎస్సి , ఎస్టీ ల మీద జరుగుతున్న దాడిని పట్టిక రూపంలో వెల్లడించింది. ఆ పట్టికలో ఉన్న వివరాలు స్టడీ చేస్తే 7.7% క్రైమ్స్ అంటే 3172 కేసులు ఎస్సి, ఎస్టీల ల మీద దాడి లేదా వివక్ష వివధ రూపాలలో జరిగినట్లు నమోదు చేయబడితే 6.2 % అంటే 2541 కేసులు దళిత ఆదివాసి మహిళల మీద బలత్కారం, వివస్త్ర ను చెయ్యడం తదితర నేరాల క్రింద నమోదు చెయ్యబడ్డాయి.

NCRB రిపోర్ట్ ప్రకారం 2014 నుండి 2016 వరకూ దళితుల మీద మరియు గిరిజనుల మీద జరిగిన దాడి లో BJP పాలిత 5 రాష్ట్రాలు ప్రముఖంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ , గుజరాత్ రాష్ట్రాలలో దేశం మొత్తం మీద  మొదటి ఐదు స్తానాలలో ఉన్నాయి. NCRB ప్రకారం దళితుల మీద జరుగుతున్న క్రిం రేటు 2015 కంటే 2016 లో 5.5 % శాతం పెరిగింది.

Also read  Annihilation of caste - A visionary document to build modern India!

సాదారణ మహిళ మీద జరిగే దాడులు కంటే దళిత , గిరిజన మహిళ ల మీద బహిరంగ ప్రదేశాల్లో దాడులు ఎక్కువగా జరుగుతాయి. నిత్యం దళిత, గిరిజన మహిళలపై జరిగే దాడులు తొమ్మిది రకాలుగా ఉంటాయి.

1.ప్రత్యక్షంగా దాడి చెయ్యడం (Physical assult) 2. మాటలు ద్వారా అవమానించడం (Verbal Abusive),3.లైంగిక వేధింపులు (sexual harassment), 4. కొట్టడం (d assault),5.బలత్కరించడం(Rape),6.లైంగిక వేధింపులు(sexual exploitation), 7. బలవంతంగా వ్యభిచారం చేయించడం(forced prostitution), 8. అపహరించడం(kidnap) 9. ఎత్తుకేల్లడం(abduction)

దళిత మహిళ ల పై జరిగే దాడుల్లో 84% పైగా కేసులు ఆదిలోనే ఎలాంటి విచారణ లేకుండా తిరస్కరిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలికి వెళ్ళే దళిత మహిళ కు జరుగుతున్న అవమానాలు లేక్కలేనివి. ఎస్సి,ఎస్టీ యాక్ట్ ఉండటం వలన కాస్త ఉపసమనం కలిగింది అలాంటిది సుప్రీం కోర్టు ఎలాంటి ప్రాదమిక విచారణ లేదా సమాచారం లేకుండా పోలీసు స్టేషన్ లో రాజకీయ ప్రాబల్యం తోనో లేక , బెదిరింపులతో జరిగే రాజీ లు, లేదా పోలీసుల తప్పుడు సమాచారం ద్వారా కొట్టివేసే కేసులను ఉదహరించి అత్యున్నత న్యాయస్తానం దళిత, గిరిజన మహిళ ల రక్షణ గాలికొదిలేసింది.

పని చేసే ప్రాంతాల్లో అది ప్రబుత్వ, ప్రైవేట్ మరియు వ్యవసాయ ప్రాంతాల్లో కులం పేరుతొ లేదా Verbal Abusive ని సుప్రీం కోర్టు కి ఎలా సాక్ష్యం చూపించాలి. దళిత మహిళ ఆత్మాభిమానం సుప్రీం కోర్టు గాలికి వదిలేసింది.

బారత శిక్షాస్మృతి ప్రకారం ఏదైనా నేరాలు చేస్తే ముందస్తు బైయిల్ ఇవ్వడానికి లేదు. అదే ఎస్సి, ఎస్టీ ల కేసుల్లో మాత్రం ముందస్తు బైయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం వివక్ష తప్పా మరొకటి కాదు. కోర్టులు చట్టాలు చెయ్యకూడదు, అవి శాసనకర్తలు చేసే చట్టాలను పరిరక్షణ మాత్రమే చెయ్యాలి. ఇటీవల కాలం లో బారత న్యాయస్తానాలు గీత దాటి వ్యక్యానాలు చేస్తుండటం పార్లమెంటరీ విదానాన్ని అవమానించడం.

Also read  దళితులు మాత్రమే ఎందుకు అణిచివేతకు గురిఅవుతున్నారు?

హిందూ ధర్మ శాస్త్రం  మను ధర్మం ప్రకారం  బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య కులస్తులు ఎవరైనా శూద్ర మహిళను లైంగికంగా ఉపయోగించు కోవచ్చు వారికీ ఎలాంటి శిక్షలు లేవు (మనుస్మృతి IX.25) సుప్రీం కోర్టు ఎస్సి ఎస్టీ యాక్ట్ మీద ఇచ్చిన తీర్పు మనుస్మృతి ని ఆదరంగా చేసుకుని ఇచ్చేరా లేక బారత రాజ్యాంగ పరంగా ఇచ్చేరో అర్ధంకావడం లేదు.

హిందూ కుల సంస్కృతి దళిత మహిళ ల మీద హింసాత్మక చర్యలను ప్రోస్తహిస్తుంది, బలపరుస్తుంది. ఎలాంటి అది లైంగిక వేధింపులు గానీ లేదా మాటలు ద్వారా దూషించడం,దాడి చెయ్యడం. సుప్రీం కోర్టు తీర్పు ఇందుకు విరుద్దం ఏమీ కాదు.  జాతీయ మహిళా కమీషన్ ప్రకారం దళిత మహిళ ల మీద దాడి చేసినప్పుడు, దాడి చేసిన వ్యక్తి తన కుల అధికారాన్ని చుపెడతాడు. కులం పేరుతొ తిడుతూ అవమానిస్తాడు. అవసరం అయితే అమానుషంగా ప్రవర్తిస్తాడు. బూర్జువ కుల వ్యవస్థ సమాజంలో విస్తృతంగా ఉంటే సుప్రీం కోర్టు కు కనిపించక పోవడం విడ్డూరం లేదా మను ధర్మం అమలు చేస్తున్నారా?

 

(Visited 173 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!