సెక్యులరిజం కి పెనుసవాల్!

షేర్ చెయ్యండి

బారత దేశం విభిన్న ప్రాంతాలు , విభిన్న ప్రజలు, మతాలు కలిగిన, సర్వ సత్తాక సార్వబౌమాదికారం కలిగిన దేశం. బారతీయుడుగా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, మత స్వేఛ్చ కలిగిన దేశం. అందుకే బారత దేశం లౌకిక దేశం అన్నారు.

డిసెంబర్ 24, 2017 కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే ఒక పబ్లిక్ ర్యాలీ లో మాట్లాడుతూ సెక్యులరిస్ట్ ల రక్తం ఏ గ్రుపో ఒక్కసారి పరీక్షించు కోవాలి అని , వారి తల్లితండ్రుల రక్తం లేదు అని మాట్లాడటం కలకలం సృష్టించింది.  కేంద్రంలోని బా జ పా ప్రబుత్వం “సెక్యులర్” అనే పదం తోలిగిస్తాము అని మాట్లాడేరు. దీనికి ముందు మార్చి నెలలో జరిగిన ఇంకొక పరిణామం కూడా మనం గమనించాలి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బా జ పా గెలిచిన తర్వాత గోరఖ్ నాద్  పీఠం అధిపతి  అధిత్యనాద్ యోగి ముక్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యటం ఆచ్చర్యం కలిగించింది, చర్చనీయంశం అయ్యింది. ఇరాన్ లాంటి దేశంలో మాత్రమే ఒక మతాధిపతి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేడు , పాకిస్తాన్ , బంగ్లాదేశ్ , మలేసియా, ఇండోనేషియా లాంటి దేశాలలో కూడా ఎక్కడా కనిపించదు.

బారత దేశంలో లోకిక వాదానికి ప్రమాదం 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత తోనే ఏర్పడింది అని చెప్పాలి. ఆనాటి కేంద్ర ప్రబుత్వం కాంగ్రెస్స్ , మరియు కుట్ర చేసిన ఆర్ ఎస్ ఎస్ / బా జ పా రెండూ ఇందులో ప్రదాన ముద్దాయిలే! కేంద్ర మంత్రి అనంత కుమార్ చేసిన వాక్యాలతో ఇప్పుడు కొందరు గొంతు కలుపుతున్నారు. రాజ్యాంగ దీపికలో డా. అంబేడ్కర్ కుడా సెక్యులర్ అనే పదం చేర్చటానికి నిరాకరించేరు అని ప్రచారం చేస్తున్నారు. అయితే లోక సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నవంబర్ 2015 లో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ రాజ్యాంగ దీపిక లో సెక్యులర్ , సోషలిస్ట్ పదాలను చేర్చటానికి నిరాకరించలేదు అని , ఆనాటి పరిస్తితుల వలన అయిన అవి చేర్చలేక పోయేరు అని పేర్కొన్నారు. 1948 నవంబరు 15న  జరిగిన పార్లమెంటు సమావేశాల్లో భీహర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కే టి షా రాజ్యాంగం లో “బారత దేశం సెక్యులర్ , ఫెడరల్ మరియు సోషలిస్ట్ రాష్ట్రాల దేశం” గా పేర్కొనాలి అని రాజ్యాంగ సవరణ కొరకు ప్రతిపాదించిన చర్చలో డా. అంబేడ్కర్ సమాదానం ఇస్తూ సెక్యులర్ అనే పదం కొత్తగా చేర్చాల్సిన అవసరం లేదు, మొత్తం రాజ్యాంగాన్ని పరిశీలన చేస్తే ప్రతి పౌరుడికి మత స్వేఛ్చని కల్పించింది కాబట్టి ప్రత్యేకంగా రాజ్యాంగ దీపికలో సెక్యులర్ అనే పదం చేర్చాల్సిన అవసరం లేదు అని చెప్పేరు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల , ప్రబుత్వాల విధి విధానాల మీద ఆదారపడి ఉంటుది కాబట్టి మరియు కాలమాన పరిస్తితులలో ప్రజల ఆలోచనలో మార్పులు వస్తాయి కాబట్టి రాజ్యాంగమే ప్రజలను పలానా విధంగా ఉండాలి అని ఆదేశించటం సమంజసం కాదు కాబట్టి సోషలిస్ట్ అనే పదానికి తావు లేదు అని పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలు సోషలిస్ట్ బావనలు కలిగిస్తాయి అని అందుచేత ప్రత్యేకంగా సోషలిస్ట్ అనే పదం అవసరం లేదు అన్నారు.

Also read  పవర్ లెస్ దళిత మెజారిటీ!

ఆర్ ఎస్ ఎస్ / బా జ పా రాజ్యాంగాన్ని హిందూ మతం తో కలపాలి అని చూస్తుందా? అంటే అవుననే చెప్పాలి. అయితే బా జ పా కేంద్ర నాయకత్వం లేదా వారి రధసారధులు ఆర్ ఎస్ ఎస్ యూరప్ లో చర్చితో ప్రబుత్వాన్ని నడిపిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా తెలుసుకోవాలి. అలాగే అశోకుడు బుద్దిజాన్ని అధికారిక మతం గా ప్రకటించటం తో నే ఇప్పుడు ఆ మతం దేశం అవతలకు వెళ్ళిపోయింది అని కొందరి చరిత్రకారుల వాదన. ప్రజా ప్రబుత్వాలు ధార్మిక సంస్తాగా మారితే పాలన గాడి తప్పుతుంది.

మన బారత దేశంలో బక్తి తత్త్వం అత్యంత దారుణంగా ఉంటుంది. ఈ బక్తితత్వం నిపంపాదిగా రాజకీయాల్లోకి కుడా వస్తుంది. వ్యక్తీ పూజ దేశాన్ని కృంగదీసి సర్వనాసనం చేస్తుంది. అందుచేత రాజకీయాల్లో బక్తితత్వానికి, వ్యక్తీ పూజకు ఏమాత్రం తావియ్యరాదు : బాబాసాహెబ్ డా . బి ర్ అంబేడ్కర్

ఆధునిక బారత నిర్మాత డా బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు చేసిన ఈ హెచ్చరిక ప్రస్తుతం పాలకులు కాని అతివాద హిందూ సంఘాలు కానీ వినేటట్లు లేవు. వ్యక్తుల మత స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. బా జ పా కేంద్రంలో పాగా వేసిన కొత్తల్లో “ఘర్ వాపసి “ పేరిట హిందూ సంఘాలు చేసిన హడావిడీ అంతా ఇంతకాదు. చివరకు ప్రజలనుండి తీవ్రంగా వ్యతిరేకత వచ్చేసరికి విరమించుకున్నారు. హిందూ మతం లోని కుల చిక్కుముడులు విడదీయకుండా ఘర్ వాపసీ లు చేసి అభాసుపాలు అయ్యేరు.

Also read  Dalit movements in India!

బా జ పా ది హిందూ జాతీయ వాదం రాజకీయంకోసమే అయివుండవచ్చు. కానీ ప్రజల మధ్య పెరుగుతున్న మత ద్వేషానికి బా జ పా నే కారణంగా బావించాల్సి వస్తుంది అని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్ ఎస్ ఎస్ / బా జ పా అనుబంద సంఘాలు ఇతర మతాల ప్రచారాన్ని అడ్డుకోవడం అది రాజ్యాంగ విరుద్దం, సెక్యులరిజం కి వ్యతిరేకం. పాలకులు ఇతర మతాల మీద చేస్తున్న దాడిని చూసి చూడనట్లు గా ఉంటున్నారు. కేంద్ర మంత్రి అనత కుమార్ హెగ్డే లాంటి వారి అనుచిత వాక్యాలు ప్రజల్లో మత విద్వేషాలకు దారి తీసే విధంగా ఉన్నాయి.

1948 నవంబరు 4 న ప్రారంబం అయిన రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ మాట్లాడుతూ బారత రాజ్యాంగ చట్ట నిర్మాణంలో హిందూ సాంప్రదాయాలు నేమాత్రము అంగీకరించలేదు అనే విమర్శ కుడా ఉంది. ఇలా విమర్శ చేసేవారు కేంద్ర , రాష్ట్ర ప్రబుత్వాలు ఏర్పాటు ను కుడా విమర్శిస్తారు. వారికీ కావాల్సింది ప్రాచీన హైందవ సాంప్రదాయంలో ఉన్న గ్రామ పంచాయితీలు , జిల్లా పంచాయితీలు మాత్రమే. వీరి సనాతన మనస్తత్వం చాల విచారాకరమైంది అని మాత్రమే చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అల్పసంఖ్యాకుల మీద దళితుల మీద మతపరమైన దాడి, సాంస్కృతిక దాడిని ప్రబుత్వాలు త్వరతిగతిన అరికట్టకపోతే, రాజ్యాంగం వారికీ కల్పించిన రక్షణ చట్టాలు అమలు చెయ్యకపోతే దేశం తల్లక్రిందులవుతుంది. ఇదే విషయాన్ని బాబాసాహెబ్ డా . అంబేడ్కర్ రాజ్యాంగ సభలో మాటల్డుతూ ఇర్లాండ్ ని ఉదాహరణగా చూపించేరు. ఇర్లాండ్ లో అధిక సంఖ్యాకుల నాయకుడు రెద్మాండ్ అధికారంలోకి వచ్చి మీ అల్ప సంఖ్యాకులకు ఏమి కావాలో కోరుకో అన్నప్పుడు ఛీ ! మీ ద్వారా మాకు ఎలాంటి రక్షణ చట్టాలు అవసరం లేదు అసలు మీ పరిపాలనే మేము సహించం అన్నాడు అల్ప సంఖ్యాకుల నాయకుడు కార్బన్. ఆ తర్వాత ఇర్లాండ్ రెండు గా విభిజించబడింది.

Also read  ఎన్కౌంటర్ లో చనిపోయిన 40 మంది లో ఏడుగురు చిన్నపిల్లలు!

ప్రపంచ గత చారిత్రిక సత్యాలను అనుభవాలను కొత్తగా అధికారంలోకి వచ్చిన బా జ పా లేదా వారి పరివార్ తెలుసుకోవాలి. స్వేఛ్చ , సమానత్వం , సౌబ్రాతత్వం తో కలసి మెలిసి జీవిస్తున్న బారతీయుల మధ్య మత రాజ్యాంగం పేరిట సెక్యులరిజం ను దెబ్బతీస్తే చరిత్ర పునరావృతమౌతుంది. గతంలో విభజించబడిన  మన దేశం మరొకసారి విభజన జరగకుండా జాగ్రతాలు తీసుకోవాలి. కుల, మత వివక్షతోనూ, అనైక్యతా, అసమర్ధతతోనూ వ్యవహరించినట్లు అయితే దేశం మరొకసారి విభజన చెయ్యాల్సి వస్తుంది.

ప్రజాస్వామిక పద్దతులు ద్వారా సమస్యలు పరిష్కారం గానప్పుడు విప్లవాత్మక (తిరుగుబాటు) విధానం అనివార్యమవుతుంది.

(Visited 25 times, 1 visits today)

2 thoughts on “సెక్యులరిజం కి పెనుసవాల్!

 • 14/02/2018 at 6:52 PM
  Permalink

  దళిత సమాజానికి అద్భుత సమాచారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు…

  Reply
  • 15/02/2018 at 9:42 PM
   Permalink

   ధన్యవాదాలు, మీ ప్రోస్తాహం వలన ది ఎడిటర్ టైమ్స్ ఇంకా క్వాలిటి తో బాబాసాహెబ్ ఆలోచనా విధానం ముందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం.
   జై భీమ్

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!