సెక్షన్ 49 పి; సర్కార్ సినిమా చెప్పిన ఓటు హక్కు గురించి మీకు తెలుసా!

షేర్ చెయ్యండి
  • 173
    Shares
 
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఆల్రెడీ కొందరు పోటీదారులు నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. ఎన్నికలు అంటే మనకు తెలిసిందే విదేశాల్లో ఉన్నా వచ్చి ఓటు వేసి వెళ్తారు. ఓటు హక్కు కు ఉన్న శక్తి అలాంటిది. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు తప్పకుండా వేయాలి. ఓటు హక్కు గురించి తెలిపే సెక్షన్ 49 పి గురించి సర్కార్ సినిమా చెబుతుంది. 
 
Indian voters
Indian voters
 
ఇళయదళపతి విజయ్ సినిమా సర్కార్ ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా ప్రేక్షుల అభిమానాన్ని చూరగొంది. ఈ సినిమా ని నిషేధించాలని తమిళనాడు లో అధికార ఏఐడి ఏం కె కార్యకర్తలు సినిమా హాళ్లు ముందు ధర్నాలు, సినిమా పోస్టర్స్ చించివేస్తూ నిరసన తెలుపుతున్నారు. 
 
ఈ సినిమాలో తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దివంగత సీఎం జయలలితను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు వున్నాయంటూ అన్నా డిఎంకె నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే పోలీసులను కూడా ఆశ్రయించారు. 
 
దర్శకుడు మురుగుదాస్ పై కేసులు కూడా పెట్టేరు. మురుగుదాస్ ఇంటికి పోలీసులు రావడంతో తమిళ సినిమా ఇండస్ట్రీ కోలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ సంఘటన మీద కోలీవుడ్ స్టార్లు మురుగుదాస్ కి మద్దతుగా ట్వీట్ లు చేసి బాసటగా నిలిచెను 
 
vijay's sarkar movie
sarkar Movie
 
బారత రాజ్యాంగంలోని సెక్షన్ 49 (పి) ని ఆధారంగా దర్శకుడు మురుగుదాస్ చిత్రీకరించేరు. ఓటు హక్కు ద్వారా ఒక సామాన్యుడు కూడా ఏమిచెయ్యగలడో దర్శకుడు తెరకెక్కించేడు. 
 
ఈ సినిమాలో హీరో విజయ్  ద్వారా సెక్షన్ 49 ( పి ) మీద సామాన్య ప్రజలకు ఒక అవగాహన కల్పించి సమాజంలో మార్పుతీసురావడం కోసం దర్శకుడు ప్రయత్నించేడు. 
 
మన దేశంలో ప్రజలకు వారి హక్కుల గురించి పట్టవు, రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులు కంటే మతం నేర్పే హక్కులే ప్రజలకు గుర్తు ఉంటాయి. అయితే బాదితుడుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాకు హక్కులు లేవా అని అడగడం పరిపాటి.  
 
మురుగదాస్ లాంటి సెలబ్రిటీ దర్శకుడు, విజయ్ లాంటి సూపర్ స్టార్ హక్కులు గురించి మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు ఆశక్తి తో ఆ హక్కు గురించి ఆలోచిస్తారు. అంటే మన దేశంలో టీచర్ చెప్పేదానికంటే సినిమా రూపంలో చెబితే సుళువు గా ప్రజలకు చేరుతుంది
 
సర్కార్ సినిమా రిలీజ్ నుండి ఇంటర్నెట్ లో ప్రజలు ఎక్కువగా బారత రాజ్యాంగం సెక్షన్ 49 (పి)  గురించి గూగుల్ చేసినట్లు గూగుల్ ట్రెండ్స్ చెబుతుంది. గూగుల్ అనాలటిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న కీ వార్డ్ సెక్షన్ 49 (పి) 
 

సెక్షన్ 49 పి ఆంటే ఏమిటి? 

 
బారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ గారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేరు. ధనికులు, పేద, ఉన్నత ఉద్యోగం, కులం , మతం, ప్రాంతం అని తేడా లేకుండా ప్రతి భారతీయ పౌరుడికి ఒక ఓటు – ఒకే విలువ కల్పించేడు. 
 
ఎన్నికల సమయంలో ఈ ఓటు ను బలహీన వర్గాలను ప్రలోభ పెట్టి లేదా రిగ్గింగ్ చేసి, దొంగ తనంగా ఇతరుల ఓటు వేస్తుంటారు. దీనిని నివారించటానికి ఎన్నికల కమీషన్ ప్రతిసారి నానారకాల ఎత్తుగడలు, రూల్స్ పెడుతూ ఉంటారు. 
 
సర్కార్ సినిమాలో హీరో విజయ్ ఒక పెద్ద కార్పొరేట్ సంస్ఠ కు అధిపతి, ఎక్కువగా విదేశాల్లో ఉంటాడు. ఎన్నికల సమయంలో తన ఓటు హక్కును వినియోగించడానికి ఇండియాకు వస్తాడు. ఓటు వేయటానికి పోలింగ్ బూతుకు వెళ్తే అప్పటికే అతని ఓటు వేసినట్లు గా రికార్డ్స్లో నమోదు అవుతుంది. విదేశాల నుండి ఓటు హక్కును వినియోగించడానికి వస్తే ఆల్రెడీ ఓటు ఇంకొకరు వేసి ఉండటంతో హీరో విజయ్ ఖంగుతింటాడు. 
 
తన హక్కును ఇంకొకరు వినియోగించడం రాజ్యాంగ విరుద్ధం, నేరం కాబట్టి. సెక్షన్ 49 పి ద్వారా తనకు కల్పించిన హక్కు దుర్వినియోగం అయ్యింది కాబట్టి సదరు వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని హీరో కోర్టుకు వెళ్తాడు. అంతే కాదు తనకి మరలా ఓటు వేసే అవకాశం కలిపించాలని కోర్టు లో అప్పీల్ చేస్తాడు. 
 
కోర్టు విచారణ తరువాత మరలా అతనికి ఓటు వేసే హక్కు కోర్టు కల్పిస్తుంది. ఇదే అంశంతో దర్శకుడు మురుగుదాస్ సర్కార్ సినిమా తెరకెక్కించాడు. ఇప్పటి వరకూ ఇలాంటి సెక్షన్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. అందుకే ఈ సినిమా దర్శకుడు ని ప్రజలు అభినందిస్తున్నారు. 
 
Murugadas
Director: Murugadas
 
ఇది ఇలా ఉంటే సర్కార్ సినిమా డైరెక్టర్ మురుగదాస్ ని అరెస్ట్ చెయ్యడానికి గత గురువారం పోలీసులు వచ్చేరు. ఈ క్రమంలో అయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసేరు. 
 
మద్రాస్ హైకోర్టు మురుగదాస్ ను నవంబర్ 27 వరకూ అరెస్ట్ చేయకూడదంటూ చెన్నై సిటీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసేరు. 
 
కోర్టు తీర్పు అనంతరం మురుగుదాస్ మీడియాతో మాట్లాడుతూ, సినిమా ఎవరినీ ఉద్దేశించి తీయలేదని, ఇందులో ఎవరినీ కించపరిచే విధంగా సన్నివేశాలు లేవని అధికారంలో ఉన్న పాలకులే ఈ సినిమాను అడ్డుకుంటున్నారని చెప్పేరు. సామాన్య జనం ఎవరూ ఈ సినిమా మీద ఇప్పటి వరకూ ఎలాంటి ఆందోళన చెయ్యలేదని పేర్కొన్నారు. 
 

ఏది ఏమైనా కమర్షియల్ ట్రెండ్ లో ఒక సినిమా ద్వారా ప్రజలను చైతన్యం కలిగిస్తున్నారంటే దర్శకుడి ని , హీరో ని అభినందించాల్సిందే. సోషల్ మీడియా లో సర్కార్ సినిమా కి మద్దత్తు వెల్లువెత్తుతుంది 

Also read  భీం ఆర్మీ చరిత్ర!
(Visited 222 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!