సేలం రాజ్యలక్ష్మి హత్య: కులం ప్రాతిపదికన స్పందిస్తున్న మీడియా పౌర సమాజం!

షేర్ చెయ్యండి
  • 75
    Shares

సేలం రాజ్యలక్ష్మి హత్య తో ఈ సమాజం కులం, మతం ప్రాతిపదికన స్పందిస్తుందని మరోసారి ఋజువు అయ్యింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటూ వేల కోట్లు రూపాయిలు పోసి విగ్రహాలు పెట్టినా కులం  ఉన్నంతవరకూ యూనిటీ అనేది ఎండమావులు లాంటిదే. 

 

Salem_murder
Credits: FII; Poster translation: Silence kills. So does Caste. Let’s destroy them both. Let’s eliminate arrogance.

 తమిళనాడుకు చెందిన రాజ్యలక్ష్మి తల మొండెం వేరు చెయ్యబడ్డ 13 సంవత్సరాల దళిత బాలిక. తమిళనాడు అంటే ద్రావిడ ఉద్యమానికి , పోగ్రెస్సివ్ ఆలోచనలకు పెట్టింది పేరు. అలాంటి తమిళనాడు రాష్ట్రంలో ఒక అమ్మాయి తల మొండెం వేరుచెయ్యబడి అత్యంత కిరాతంకంగా హత్యగావించబడితే ప్రధాన మీడియా కళ్ళకు కనబడదు. పౌర సమాజం నిరసనలు కూడా చెయ్యదు. ప్రతిఘటించదు. కారణం కులం 

 
బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగడం లేదా గుట్కా , పొగాకు తినడం మీద ప్రకటన జారీ చేసినట్లు ఈ సమాజానికేమైంది అని ప్రకటన ఇవ్వలేము. పొగ త్రాగడం , పాన్ పరాగ్ , ఖైనీ లు తినడం వలన కేన్సర్ వస్తుంది. మరి కులం అనే భయంకర రోగం వలన కేన్సర్ వస్తుందా? సమాజానికి ఏమీ నష్టం జరగదా ? ప్రభుత్వాలు ఎందుకు ప్రకటనలు జారీ చెయ్యడం లేదు? స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం ఎందుకు స్పందించడం లేదు?
 
నవభారత నిర్మాత బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ గారు కులం అనే రోగాన్ని కేన్సర్ గా గుర్తించారు. మరి ఈ కులం అనే క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఎవరు చెయ్యాలి. పౌర సమాజం యొక్క బాధ్యత లేదా? ప్రభుత్వాలు ఏ విధంగా ఈ రాచపుండును నివారణ చేస్తారు. కులం అనే క్యాన్సర్ ద్వారా చనిపోయిన 13 సంవత్సరాల బాలిక మరణానికి శిక్ష ఎవరికి వెయ్యాలి? రాజ్యలక్ష్మి తల – మొండెం వేరుచేసిన కుల ఉన్మాదికా, కనీస స్పందన లేని పౌర సమాజానిదా? ఫోర్త్ ఎస్టేట్ లో బాగం అయిన మీడియా దా? ఒక చిన్న వార్త రాయిని మీడియా, కనీస స్పందన లేని పౌర సమాజానికి కూడా కులం అనే క్యాన్సర్ బారినపడింది. 

సేలం రాజ్యలక్ష్మి హత్య  కు కారణం కులమేనా?

 
రాజ్యలక్ష్మిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న దినేష్ అనే 27 సంవత్సరాల  వివాహితుడు ను అడ్డగించి అతడి చేష్టాలను వారి కుటుంబ సబ్యులకు చెప్పిన రాజ్యలక్ష్మి.,  అవమానంతో రగిలిపోయిన దినేష్ అనే పీడక కుల ఉన్మాది రాజ్యలక్ష్మి మెడను కొడవలితో కోసి తలా , మొండెం వేరుచేసేడు. దినేష్ చేసిన ఈ కిరాతకాన్ని అతని బార్య మతి స్థిమితం లేని వ్యక్తి చేష్టలు గా చెబుతూ వెనకేసుకొచ్చే ప్రయత్నంచేస్తుంది . రాజ్యలక్ష్మిని చంపేటపుడు అతని కుటుంబ సభ్యలుకానీ, భార్య కానీ అడ్డగించలేదు. 13 సంవత్సరాల ఒక దళిత అమ్మాయి తనను వ్యతిరేకించడం అనే అహంకారంతో ఊగిపోయి కిరాతకంగా రాజ్యలక్ష్మిని చంపేసేడు.  
 
Rajyalakshmi_killer
Credits: The newsprint. Image; Dinesh Salem Rajyalakshmi killer
 
కులోన్మాది దినేష్ ని  అతని కుటుంబ సభ్యులు వెనకేసుకురావడం బారతీయ కుల సమాజానికి కొత్తేమి కాదు. పెత్తందారీ కులాలు ఆడపిల్లలను హత్యాచారం చేసిన వారిని , కులోన్మాదం తో చంపేవారిని వెనకేసుకు రావడం ఎప్పటి నుండో జరుగుతుంది. . వేల సంవత్సరాల నుండి జరుగుతున్న తంతు ఇదే. సూర్పనఖ చెవులు, ముక్కు కోసిన లక్ష్మణుడి ని కీర్తించిన ఈ కుల  సమాజం రాజ్యలక్ష్మిని తల నరికితే స్పందిస్తుందా? 

మీ టూ  ఉద్యమకారులు స్పందించరేమి? 

 
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన మీటూ ఉద్యమం 13 సంవత్సరాల దళిత బాలిక సేలం రాజ్యలక్ష్మి హత్య  విషయంలో స్పందించక పోవడానికి కారణం కులం అనే క్యాన్సర్ నే కారణం కదా! మమ్మల్ని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు అంటూ ఎప్పుడో జరిగిన సంఘటనలు గురించి గొప్పగా చెప్పుకున్న ఈ దేశపు ఆధిపత్య కుల మహిళలు లైంగికంగా వేధింపులకు గురై , ఉన్మాదిని అడ్డగించి, అతడి చేతులో కిరాతకంగా హత్యగావించబడిన మైనర్ బాలిక మీద స్పందించడం సాధ్యమవుతుందా? 
 
నిర్భయ లాంటి  పీడక కుల అమ్మాయిని హత్య చేస్తే దేశం మొత్తాన్ని స్తంభింపజేసిన కుల మీడియా, సామజిక సంఘాలు, రాజ్యలక్ష్మి విషయంలో కనీస స్పందన లేకపోవడం దారుణం. ఈ దేశంలో దళిత వర్గాల హక్కులు, ఆత్మగౌరవం పట్ల సమాజం చూపిస్తున్న వివక్షకు ఇది తార్కాణం. అక్టోబర్ 30 వ తేదీన జరిగిన ఈ సంఘటన ప్రోగ్రసివ్ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకునే తమిళనాడు లో కూడా పౌర సమాజం స్పందించలేదంటే తమినాడు ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. 
 
13 సంవత్సరాల బాలిక పని చేసుకుంటూ, చదువుకోవాలని, కలెక్టర్ స్థాయికి ఎదగాలని ఆమెకన్న కలలను కులం అనే రాచపుండు తో కిరాతకంగా హత్య చేసిన ఈ సమాజాన్ని నేడు క్షమించినా  భవిషత్ తరం క్షమించదు. 
 
 
(Visited 124 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!