సోషల్ మీడియా-యువ చైతన్యం!

షేర్ చెయ్యండి

ఈ కాలంలో సోషల్ మీడియా ది మోస్ట్ పాపులర్ కీ వర్డ్. సోషల్ మీడియా పేస్ బుక్ ద్వారా పరిచయం అయిన కొందరు యువతీ యువకులు “ఓపెన్ థింక్ ఫోరం-ఆలోచన లోచన” అనే కమ్యునిటీ గ్రూప్ గా ఏర్పడి మన చుట్టూ జరుగుతున్న సమస్యల పై ఎప్పటికప్పుడు చర్చ చేస్తూ ప్రతి ఏడాది వివిధ ప్రాంతాల్లో కలుస్తూ తమవంతు సామాజిక బాద్యతను నిర్వహిస్తున్నారు.

నేటి బారతీయ యువకులు కులం- మతం చుట్టూ పరిబ్రమిస్తూ ఉన్నారు. బారత రాజకీయాలలో ఈ కులం, మతం పాత్ర మరింత పెరిగింది. రాజకీయ పార్టీలు ఇప్పుడు బాహాటంగానే కుల సమీకరణలు, మత సమీకరణలు చేస్తున్నారు.

1990 నుండి మొదలైన ప్రపంచీకరణ, సరళీకరణ, పెట్టుబడిదారి విధానం బారతేయ యువకుల మీద చాలా ప్రబావం చూపించింది. యువకుల్లో నిరాస, నైరాస్యత పెరిగింది. అందుచేత చాల సులువుగా కుల సమీకరణలో , మత సమీకరణలో యువకులు బాగస్వామ్యం అవుతునారు.

దురదృష్ట వశాత్తు 1994 లో అనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్ర బాబు నాయుడు కాలేజీల్లో అలాగే విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధి సంఘాల ఎన్నికలు రద్దు చెయ్యడం జరిగింది. అదే సమయంలో విశ్వవిద్యాలయాల్లో ఫ్యూడల్ కుల రాజకీయ పార్టీల విద్యార్ధి విభాగం పాగా వేసి, సైంటిఫిక్ , సోషలిస్ట్, సామ్యవాద బావలగల విద్యాలయాల్లో కులతత్వం, ప్రాంతీయ తత్త్వం నూరిపోసాయి.

బారత దేశం నేడు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఫాసిజం. హిందూ జాతీయ వాదం పేరుతొ ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కి ఆహారపు అలవాట్లను కుడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also read  #ME TOO: బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ పై గుత్తా జ్వాల సంచలన వాఖ్యలు!  

2014 లో ప్రముఖ హేతువాదులు అయిన ఖల్బుర్గీ ని హత్య చెయ్యడం ద్వారా హిందూ జాతీయ వాదం ఈ సమాజానికి ఒక పెనుసవాల్ ని విసిరింది. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మరియు అతని మిత్రులను వెలివేయడం, ఆతర్వాత పరిణామాల్లో రోహిత్ వేముల చనిపోవడం, మద్రాస్ యునివర్సిటీ లో పెరియార్ – అంబేడ్కర్ చైర్ ని రద్దు చెయ్యడం,డీల్లి జే యెన్ యు లో కన్హయ్య కుమార్ మరియు ఉమర్ ఖాలిద్ ఉదంతం కాకతాలీయంగా అనిపించినా రాజకీయాలను దగ్గరగా చుసిన వారికీ ఒక టార్గెట్ బెసేడ్ చర్యలుగా అర్ధం అవుతుంది.

ఈ పరిణామాలను సోషల్ మీడియా విస్తృతంగా చర్చ చేసింది.తెలుగు రాష్ట్రాలలో పేస్ బుక్  “ఆలోచన-లోచన” గ్రూప్ లో కుడా విస్తృత చర్చలు జరిగేయి . దాదాపు 43 వేల మంది సబ్యులు గల ఈ గ్రూప్ వివధ సామజిక, రాజకీయ అంశాల చర్చల వేదిక.

సోషల్ మీడియా ప్రబావం సమాజం పై ముక్యంగా యువతరం పై ఎలా ప్రబావం చూపించిందో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బా జ పా కి బాగా తెలుసు. బా జ పా 2014లో అధికారంలోకి వచ్చేరు అంటే సోషల్ మీడియా లో వారు చేసిన ప్రబావం అంతా ఇంతా కాదు.

అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఒక పెనుబుతంలాగా కనిపించింది కేంద్ర, రాష్ట్ర పాలకులకు.కుల మీడియా ప్రబావాన్ని సైతం కాలరాసి సోషల్ మీడియా నిజాలు నిగ్గుతెలుస్తూ సాక్ష్యాలతో సహా బయటపెడుతున్న తరుణంలో సోషల్ మీడియా ని కంట్రోల్ చెయ్యాలి అని చూస్తున్నారు. పదే పదే తప్పులు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలను నగ్నంగా నిలబెడుతున్నారు నేటి యువత.

Also read  “ఇద్దరూ ఇద్దరే”అంబేడ్కర్-మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్!

ఈ క్రమంలో ఈనెల 25న హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో “ఆలోచన – లోచన” గ్రూప్ ‘సోహల్ మీడియా మరియు రాజ్యాంగ హక్కులు పై అవగాహన సదస్సు నిర్వహించింది. గ్రూప్ అడ్మిన్ తురిమేళ్ళ బలరాం ఈ కార్యక్రమం ముక్య ఉద్దేశ్యం గురించి ప్రకటిస్తూ కార్పోరేట్ వర్గాల చేతుల్లో ఉన్న మీడియా రాజకీయ పార్టీల కు తొత్తులుగా వ్యవరిస్తుంది. పాలకవర్గాల ప్రతి చర్య ప్రజా అనుకూలంగా చూపించబడుతున్నది.సామాన్య ప్రజల మెదళ్ల లోకి తమ భావజాలాన్ని జొప్పించి , ఒప్పించే ప్రయత్నం జోరుగా సాగుతున్నది. సోషల్ మీడియా ధాటికి విల విల లాడుతున్న ఈ శక్తులు సేచ్చావాణి గా ఉన్న ఈ సోషల్ మీడియా పై తమ ఉక్కుపాదం మోపేందుకు సిద్దం అయ్యాయి  సోషల్ మీడియా పోస్ట్ ల పై కేసులు పెట్టి జైళ్ళ కు పంపే పని లో ఉన్నారు పాలకులు సోషల్ మీడియా స్వేచ్చ ను కొనసాగించాలి అనే ఆలోచన తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించేరు.

Social media_constitutional rights
ఆలోచన లోచన గ్రూప్ నిర్వహించిన సోషల్ మీడియా -రాజ్యాంగ హక్కులు సదస్సులో పాల్గొన్న యువత

ఒక వైపు యువతరం లోని ఒక వర్గం కుల,మతాల రాజకేయాలలో నిమగ్నమై ఉంటే ఇంకొక వైపు ఇంకొందరు యువకులు సమాజానికి చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచన-లోచన నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతరం ప్రతినిధులు నవీన్. కందిమళ్ళ , తిరుమలేష్. రాసురి లాంటి యువకులు చురుకుగా పాల్గొని నిర్వహించడం అభినదనీయం. దాదాపు 200 మంది యువతీ యువకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బారత నాస్తిక సమాజం ప్రతినిధులు భైరి నరేష్ మిత్ర బృందం కుడా పాల్గొనడం విశేషం.

ఏ సమాజం అయితే కష్టాల్లో ఉందో ఆ సమాజంలోని మేధావులు బయటకు వచ్చి ఆ సమాజాన్ని ముందుకు నడిపించే బాద్యత తీసుకోవాలి అంటారు బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్.

పేస్ బుక్ అనేది సరదా కోసమో లేక కాలక్షేపం కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కమ్యునిటీ గ్రూప్ ఉండటం, హిందూ జాతీయ వాదం పేరిట చేస్తున్న దుర్మార్గమైన చర్యలను అడ్డుకుంటూ రాజ్యాంగ స్పూర్తిని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చెయ్యడం బారతీయ సమాజం అంత సులువుగా మతతత్వ వాదులకు లొంగదు అని నిరూపిస్తుంది.

Also read  రోహిత్ వేముల: ఆఖరి ఉత్తరం ఈ సమాజానికి

ఏది ఏమైనా యువతరంలో ఉన్న ఈ సామాజిక స్పృహ అభినందనీయం. పేస్బుక్ ఆలోచన లోచన గ్రూప్ లు సమాజం నేడు ఎదుర్కుంటున్న సవాళ్ళను నిశితంగా పరిశీలించి నిజాలను నిగ్గుతేల్చి ప్రజల స్వేఛ్చ , సమానత్వం ,సౌభ్రాతత్వం కోసం తనవంతు ప్రయత్నం చెయ్యాలి, మతోన్మోదాన్ని దీటుగా ఎదుర్కోవాలి.  

 

 

 

(Visited 174 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!