స్టేట్ సోషలిజం – బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

షేర్ చెయ్యండి
  • 49
    Shares

గ్రేట్ ఇండియా పెనిన్సులా ( GIP) రైల్వేస్ లో పని చేస్తున్న అంటరాని కార్మికుల సమావేశం 12 , 13 ఫిబ్రవరి 1938 లో మన్మాడ్ లో జరిగింది. ఈ సమావేశంలో సుమారుగా 20,000 మంది పాల్గోన్నారు. సమావేశానికి డా. అంబేడ్కర్ చైర్ పర్సన్ గా వ్యవహరించారు.

ఈ సందర్భంగా అంటరాని కార్మికులను ఉద్ఢేశించి డా. అంబేడ్కర్ మాట్లాడుతూ బ్రాహ్మనిజం , కేపటలిజమ్ అనే రెండు శత్రువులతో భారత దేశంలోని కార్మికులు పొరాడవలసి వుందన్నారు.స్వేచ్ఛా , సమానత్వం , సౌభ్రాతృత్వం నిరాకరించేదే బ్రాహ్మనిజం అన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యావాదం పోతే ఇండియాలో కేపటలిజమ్ అంతరించదని, బ్రిటీష్ సామ్రాజ్యావాదులు ఇండియా నుండి వెళ్ళిపొయినా భూస్వాములు , మిల్లు యాజమానులు , వడ్డీ వ్యాపారులు ఇండియాలొనే వుంటారనీ ప్రజల రక్తం తాగుతూనే వుంటారనీ , అప్పుడూ కూడ కార్మికులు వారితో పోరాడవలసివుంటుందని డా. అంబేడ్కర్ హెఛ్హరించారు.

డా. అంబేడ్కర్ హెఛ్హరికను వర్తమానంలో భారత్ దేశ సామాజిక , ఆర్ధిక , రాజకీయ పరిస్థితులతో పరీశీలన చేసినప్పుడు పాలకులు రాజ్యాంగం నిర్ణయించిన ద్విముఖ లక్ష్యాలైన రాజకీయ ప్రజాస్వామ్యం ,ఆర్ఢిక ప్రజాస్వామ్యం ను నెలకొల్పడం ఆనే అంశాలను ఉద్ధేశపూర్వకం గా విస్మరిస్తునట్లుంది.

1946 సంవత్సరం ఇంగ్లాండ్ లో అధికారంలోకి వచ్హిన లేబర్ పార్టీ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన క్యాబినేట్ ప్రతినిధి బృందాన్ని ఇండియాకు పంపింది. ఈ బృందంలో లార్డ్ పెతిక్ , సర్ స్టాపర్డ్ క్రిప్స్ , మిస్టర్ ఎ ఎ ఆలెగ్జాండర్ వున్నారు.ఈ క్యాబినేట్ మిషన్ ప్రతిపాదనలలో ముఖ్యమైనది నూతన రాజ్యాంగ నిర్మాణానికి ఒక రాజ్యాంగ శాసనసభ ను ఎన్నుకోవడం. ఈ ప్రతిపాదన 1942 లో సర్ స్టాపర్డ్ క్రిప్స్ ప్రతిపాదించినదే. రాజ్యాంగ శాసనసభకు సభ్యులను పరోక్ష పధ్డతిలో ప్రొవిన్షియల్ శాసనసభల నుండి ఎన్నుకోవాలి. కాంగ్రెస్ వ్యతిరేకత కారణంగా డా. అంబేద్కర్ బొంబాయ్ నుండి రాజ్యాంగసభ కు ఎన్నుకోబడలేదు. జోగేంద్రనాధ్ మండల్, షేడ్యూల్డ్ కులాల, ముస్లింలీగ్ సభ్యుల సహకారంతో బెంగాల్ నుండి రాజ్యాంగ శాసన సభలోకి ప్రవేశించగలిగారు.

1947 మార్చిలో ఆల్ ఇండియా షేడ్యుల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరుపున షేడ్యుల్డ్ కులాల రక్షణలపై రాజ్యాంగశాసన సభకు ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదికే ” రాష్ట్రాలు – అల్పసంఖ్యాక వర్గాలు , వారి హక్కులేమిటి , స్వతంత్ర భారతదేశంలో వాటిని ఏలా సాధించుకునేదెలా” . ఈ నివేదిక లో షేడ్యుల్డ్ కులాలు అల్పసంఖ్యాకుల కంటే ఎక్కువవారని , పౌరులకు అల్పసంఖ్యాకులకు ఇచ్హే ఏ రక్షణ అయినా షేడ్యుల్డ్ కులాలకు సరిపోదనీ స్పష్టంచేసారు.

ఈ నివేదిక రాజ్యాంగ నిబంధనల మాదిరిగా రూపొందించారు. రాష్ట్రాలు – అల్పసంఖ్యాక వర్గాలు అనే నివేదిక – 2 లో పార్ట్ – 1 ప్రాధమిక హక్కులు , పార్ట్ – 2 లో ప్రాధమిక హక్కులపై జరిగే అనేక రకాల దాడులకు నివారణోపాయాలు సూచించారు. పార్ట్ – 2 లోని నాలుగో అంశం ఆర్ధిక దోపిడి నుండి ప్రాథమిక హక్కులను ఏ విధంగా రక్షింఛు కొవాలనే విషయాన్ని తెలుపుతుంది. ఈ క్లాజులోనే డా. ఆంబేడ్కర్ స్టేట్ సోషలిజం రాజ్యంగబద్దంగా వుండాలని ప్రాతిపాదించారు.

ఇందులో డా. అంబేడ్కర్ సంపద ను న్యాయంగా పంచడానికి అవకాశం కల్పిస్తూ, ప్రయివేటు వాణిజ్యానికి మార్గాలను మూయకుండా, ఉత్పాదకత అత్యున్నత స్థాయికి చేరుకునేటట్లు , ప్రజల ఆర్థిక జీవనానికి ప్రణాళిక రూపొందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవలని ప్రాతిపాదించారు . ప్రజల సామాజిక , ఆర్ధిక అవసరతలు రక్షించేందుకు వ్యసాయ భూమి ,పరిశ్రమలు ,జీవిత భీమా మొదలగు రంగాలపై ప్రభుత్వం యాజమాన్యం కలిగివుండాలని ప్రాతిపాదించారు .

పారిశ్రామిక రంగానికి , వ్యవసాయ రంగానికి పెట్టుబడిని అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకొవాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం పెట్టుబడిని అందించకపొతే ఈ రంగాలు అభివృధ్ధిని సాధించలేవన్నారు. భీమా రంగాన్ని జాతీయం చేయాలన్నారు. ప్రయివేట్ భీమా సంస్థల కంటే జాతీయం చేయబడిన భీమా సంస్థలే వ్యక్తి కి అత్యధిక భద్రత కల్పిస్తాయాని, భీమ సొమ్ము చెల్లింపుకు జాతీయం చేయబడిన భీమాసంస్థ ప్రభుత్వ వనరులను హామీగా చూపిస్తుందని, ప్రభుత్వ ఆర్థిక పథకాలకు అవసరమైన వనరులను జాతీయం చేయబడిన భీమారంగం ప్రభుత్వానికి అందిస్తుందని డా.అంబేడ్కర్ సూచించారు.

Also read  మేరీకోమ్ 6 బంగారు పతకాలతో చరిత్ర సృష్టించిన బాక్సర్!

భారతదేశం లో పారిశ్రామికరణ జరగాలంటే స్టేట్ సోషలిజం అత్యవసరమని ప్రాతిపాదించారు. ప్రైవేట్ సంస్థలు ఆ పని చేయలేవు.ఒక వేళ ఆ పని చేయగలిగిన యూరప్ లో పెట్టుబడిదారీ విధానం సృష్టించిన మాదిరిగా భారత దేశంలో కూడా సంపదలో అసమానతలు సృష్టింస్తుందని డా. అంబేడ్కర్ అన్నారు.

ప్రైవేట్ పెట్టుబడి – ప్రతికూలత:

వ్యక్తి స్వేఛ్చాకు , సమాజ ఆర్థిక నిర్మాణ స్వరూప , స్వభావాలకు సంబంధం వుందని డా. అంబేద్కర్ అన్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక జీవనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే, ప్రభుత్వం జోక్యం లేకపొతే ప్రజలు స్వేఛ్చాను కోల్పోతారని, ప్రభుత్వమే సామాజిక బాధ్యతగా సామాజిక ,ఆర్థిక దోపిడి నుండి ప్రజలను కాపాడే వ్యవస్థను ఏర్పాటుc చేయలన్నారు.

ప్రైవేట్ పెట్టుబడి మీద ఆధారపడ్డ సమాజ ఆర్థిక వ్యవస్థ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందన్నారు. జీవనభృతిని సంపాందించుకోవడం కోసం రాజ్యాంగ హక్కులను వదులుకోవలసి వస్తుందన్నారు. నిరుద్యోగంలో వున్నవారు మనుగడ కొరకు పనిచేసే సదుపాయం పొందెందెకు తమ ప్రాథమిక హక్కులు వదులుకోవలసి వస్తుందని, ఉద్యోగంలో వున్నవారు అధిక గంటలు ,తక్కువ వేతనంకు పని చేయటం ద్వారా ప్రాథమిక హక్కులు కోల్పొతారని , ప్రైవేట్ పెట్టుబడిదారీ విధానంలో స్వేఛ్హా అంటే ప్రైవేట్ వ్యక్తుల స్వేఛ్హాని, వారు ఈ స్వేఛ్హను భూస్వాములైతే కౌలును పెంచడానికి , పెట్టుబడిదారులైతే ఉద్యోగుల వేతనలు తగ్గించి , పని గంటలు పెంచడానికి ఉపయోగిస్తారని డా. అంబేద్కర్ అన్నారు.

అందువలన ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకొని నియమాలను రూపొందించకపొతే , ఆ నియమాలను ప్రైవేట్ వ్యక్తులే రూపొందించి తద్వారా ప్రైవేట్ యాజమాని నియంతృత్వం (Dictatorship of Employer ) వస్తుందన్నారు. ఇటువంటి నియంతృత్వం రాకుండా ప్రాథమిక హక్కుల విషయంలో వంచన గురికాకుండా వుండాలంటే రాజకియ రంగంను ,ఆర్థిక రంగంను రాజ్యాంగబద్దంగా నిర్వచించాలన్నారు.అందుకే డా.అంబేడ్కర్ ప్రాతిపాదించిన స్టేట్ సోషలిజం రాజకీయ రంగంలో హేతుబద్దంకాని ఆంక్షలను విధించకుండా ప్రభుత్వాన్ని ఆదుపుచేయడం మాత్రమే కాకుండా, ప్రజల ఆర్థిక జీవనంపై బలవంతులకు గల పట్టును తొలగించడం ద్వారా బలహీనులపై బలవంతులు హేతుబద్దంకాని ఆంక్షలు విధించే అవకాశాలు పూర్తిగా తుడిచిపెడుతుందని అభిప్రాయపడ్డారు.

సమాజ ఆర్థిక నిర్మాణాన్ని స్టేట్ సోషలిజం నమూన పై నిర్మించేవారు దాన్ని రాజ్యాంగచట్ట పరిదిలోకి తీసుకురావాలని , స్టేట్ సోషలిజం సాధించడం కోసం ప్రజలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యన్ని వదులుకోవటానికి సిధ్దంకారని డా. అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. అంచేత నియంతృత్వం లేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్టేట్ సోషలిజంను డా.అంబేడ్కర్ ప్రాతిపాదించారు.

డా.అంబేడ్కర్ ప్రాతిపాదించిన స్టేట్ సోషలిజం ముఖ్యాంశాలు.

(1) ప్రధానమైన పరిశ్రమలను ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకొని నడిపించాలి.
(2) మూల పరిశ్రమలుగా వుండే పరిశ్రమలను రాజ్యం తన ఆధీనంలో వుంచుకొని తాను కాని 
తాను ఏర్పరిచిన కార్పోరేషన్ చేతగాని నడిపించాలి.

(3) జీవిత భీమా పై గుత్తాధిపత్యం ఉండాలి.
(4) వ్యవసాయం రాజ్య పరిశ్రమగా వుండాలి.
(5) డిబెంచర్ల రూపంలో నష్టపరిహారం.
(6) రాజ్యాంగం అమలులోకి వచ్హిన నాటినుంచి 10 సంవత్సరాలు దాటనీయకుండా అమలు 
జరగాలి.
(7) రాజ్యాంగ చట్టం ద్వారా అమలుజరగాలి.

బారత ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ చేసిన ప్రతిపాదనలు:

పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగాలంటే మౌలిక సదుపాయలైన రోడ్లు , సమాచార వ్యవస్థ , విద్యుత్ , నీరు అదించడం మీద ఆధారపడివుంటుంది. వాటిని సమకూర్చటానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. ప్రభుత్వాలు మాత్రమే భారీ పెట్టుబడులను సమకూర్చగలవు. దేశరక్షణ సంబంధించిన అణుశక్తి , రక్షణ నిమిత్తం తయారై పరికరాలు , మందుగుండు లాంటివి ఎట్టి పరిస్థితులలో ప్రైవేటు వ్యక్తుల లేక సంస్థలకు అప్పగించరాదు. అందుకే డా. అంబేడ్కర్ ప్రధాన పరిశ్రమలైన బొగ్గు ,ఇనుము , స్టీల్ ,రైల్వేలు , ఓడల తయారీ , భారీ పరికరాల తయారీ కార్మాగారాలు ప్రభుత్వం అధీనంలో వుండాలని , ప్రభుత్వాలే నడపాలని, పారిశ్రామికీకరణకు మూలాధారమైన చిన్నతరహా , కుటీర పరిశ్రమలను ప్రభుత్వమే ప్రోత్సాహించి నడపాలని ,అవసరమైతే ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.

Also read  రాజ్యాంగం: భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ డా. అంబేడ్కర్!

స్టేట్ సోషలిజం అమలు జరగాలంటే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ వుండాలని , పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతూవుంటాయనీ, అలా మారినప్పుడు అధికారంలోకి వచ్హే ప్రభుత్వాలు స్టేట్ సోషలిజం ను రద్డు చేయకుండా వుండాలంటే రాజ్యాంగ చట్టం చేయాలని , తద్వారా స్టేట్ సోషలిజం శాశ్వతమైనది అవుతుందని అభిప్ర్రాయపడ్డారు. అప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తప్పనిసరిగా ” ఒక మనిషి – ఒక విలువ ” అనేది ఆర్థిక రంగంలో కూడా అమలవుతుందని విశ్లేషించారు.

1947 , జులై , 15 న బ్రిటిష్ పార్లమెంటు భారత్ కు స్వాతంత్ర్యం ను ధృవీకరించే చట్టాన్నీఅమెదించింది.దేశ విభజన అనంతరం తూర్ప్ బెంగాల్ భౌగోళికంగా పాకిస్తాన్ అయ్యింది. చాలా మంది రాజ్యాంగ శాసన సభ లో సభ్యత్వం కోల్పొయారు. డా. అంబేడ్కర్ కూడా రాజ్యాంగ శాసన సభ లో సభ్యత్వం కోల్పొయారు. డా. ఎమ్.ఆర్ జయకర్ రాజీనామా చేసి ఖాళీగా వున్న బొంబాయ్ స్థానం నుండి మరలా రాజ్యాంగ శాసన సభ లోకి ప్రవేశించారు.ఆగష్టు నెలలో డా. అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా తాత్కాలిక ప్రభుత్వంలో బాధ్యతలు స్వికరించడం , 29 ఆగష్టు న రాజ్యాంగ ముసాయిదా కమిటికి ఛైర్మన్ ఎన్నుకోవటం జరిగింది. డా. అంబేడ్కర్ భారత రాజ్యాంగంను 1949, నవంబరు ,26 న రాజ్యాంగ శాసన సభకు సమర్పించడం జరిగింది.అదే రోజు రాజ్యాంగ శాసన సభకు హాజరైన 284 మంది సభ్యులు భారత రాజ్యాంగంపై సంతకం చేసారు..అదే రోజు రాజ్యాంగంను రాజ్యాంగ శాసన సభా అమెదించింది. 1950, జనవరి , 26 తేది నుండి అమలులోకి వచ్హింది.

డా. అంబేడ్కర్ షేడ్యూల్ఢ్ క్యాస్ట్ ఫేడరేషన్ తరుపున రాజ్యాంగసభకు సమర్పించిన ” రాష్ట్రాలు – అల్ప సంఖ్యాక వర్గాలు ” అనే నివేదికలో స్టేట్ సోషలిజం ను ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చారు . కాని భారత రాజ్యాంగంలో రాష్ట్రాలు – అల్ప సంఖ్యాక వర్గాల నివేదికలోని ప్రాథమిక హక్కులను రెండు భాగాలు విభజించారు.అవి (1) ప్రాథమిక హక్కులు , (2) ఆదేశిక సూత్రాలు. దీన్ని 72 మంది సభ్యులు గల ప్రాథమిక హక్కుల, మైనారిటాల్ సలహా మండలి సూచించింది. ఈ కమీటిలో డా. అంబేడ్కర్ కూడ సభ్యులే . ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానంను ఆశ్రయించవచ్చు.ఆదేశిక సూత్రలు న్యాయస్థానం ద్వారా అమలుపరచదగినవి కావు.

ఆదేశిక సూత్రలు రాజ్య విధానంను సూచించేవి.దేశ పరిపాలనలో ప్రభుత్వాలు సాధించవలసిన లక్ష్యాలను ,ఉద్దేశాలను వివరిస్తుంది. డా.అంబేడ్కర్ ఆశించిన స్టేట్ సోషలిజం అంటే సంక్షేమ రాజ్యం ఆదేశిక సూత్రలలో వుంది. భారత రాజ్యాంగం నాల్గవ భాగం 36 నుండి 51 వరకు గల ఆర్టికల్స్ ఆదేశిక సూత్రాలను గూరించి వివరిస్తూంది.”రాష్ట్రాలు – మైనారిటీలు ” నివేదిక లో స్టేట్ సోషలిజం రాజ్యాంగ చట్టంలో వుండాలని డా.అంభేడ్కర్ ఆశించారు.కాని భారత రాజ్యాంగం లోని సంక్షేమం కోసం నిర్ణయించిన ఆదేశిక సూత్రలనేవి తప్పనిసరిగా అమలు చేసివి కాకపొయిన , ప్రజల సంక్షేమం కోసం ఒక విధానంను సూచిస్తాయి.ఎవ్వరైతే అధికారంలోకి వస్తారో వారు నిజంగా ప్రజల సంక్షేమం కోరేవారైతే అలాంటి వారికి ఆదేశిక సూత్రలనేవి మంచి సూచనలు యిస్తాయి.

ఆదేశిక సూత్రల అమలు ప్రభుత్వాల నిజాయితీ మీద ఆధారపడి వుంటుంది. ప్రభుత్వాలు ఆదేశిక సూత్రల అమలు వైఫల్యం గూరించి ఎన్నికల సమయంలో సమాధానం చెప్పవలసివుంటుంది. ఆదేశిక సూత్రలు అమలు చేసినప్పుడు మన రాజ్యాంగం కోరిన సంక్షేమ రాజ్యాని అమలుపరచడానికి వీలుంటుంది.

Also read  "బాబాసాహెబ్" డా. అంబేడ్కర్ ఆగ్రా ఉపన్యాసం!
స్టేట్ సోషలిజం – రాజకీయ ప్రజాస్వామ్యం:

డా. అంబేడ్కర్ భారతదేశంలో ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించాలనీ ఆశించారు.ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం ద్వారానే రాజకీయ ప్రజాస్వామ్యంకు అర్థంవుంటుందన్నారు. 1949,జనవరి , 26 రాజ్యాంగం అమోదం పోందే రోజు చేసిన చారిత్రాత్మాక ప్రసంగంలో మనకు రాజకీయాలలో ఒక మనిషి – ఒక ఓటు , ఒక ఓటు – ఒక విలువ అనే నియామాలతో గుర్తింపబడుతున్నాం. కాని సామాజిక ,ఆర్థిక నిర్మాణం కారణంగా ఒక మనిషి – ఒక విలువ అనే నియమం సామాజిక ,ఆర్థిక జీవితాలలో తిరస్కరింపబడుతుంది.

ఈ వైరుథ్యాలను సాధ్యమైనంత త్వరలో నిర్మూలించాలన్నారు. కాని ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్ణంచిన లక్ష్యాలను విస్మరించి రాజ్యాంగ స్పూర్తి కి విరుధ్ధంగా నడుస్తున్నాయి.ప్రాథమిక హక్కులతో సమానమైన ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు అనుసరించక పోవటం వలన ప్రజల సంక్షేమం అయోమయంలో పడింది. ఆదేశిక సూత్రాలు సూచించిన ఉచిత విద్య , వైద్యం , తగినంత జీవనోపాధి , పని హక్కు , బలహీన వర్గాలను ఆర్థిక పరమైన అంశాలలో ప్రోత్హాహించడం , కుటీర పరిశ్రమలను ప్రోత్హాహించడం , స్త్రీ , పురుషలకు సమానపని కి సమాన వేతనం లాంటి ఎన్నోఅంశాలను ఉధ్దేశపూర్వకంగా నీరుగార్చుతున్నారు.

అంతా కార్పోరేటికరించటమనేది ప్రభుత్వ విధానం అయ్యింది. విద్య , వైద్యం మొత్తం ప్రైవేట్ వ్యక్తుల హస్తగతం అయ్యింది. ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే నిర్ణయాలే ప్రభుత్వ విధానాలుగా చాలామణి అవుతున్నాయి. ఉద్యోగులకు భద్రత కరువైంది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి ప్రైవేట్ ఉద్యోగాలు పెరగడం వలన జీవన భద్రత ప్రశ్నార్థకమైనది. డా. అంబేడ్కర్ హెచ్చరించిన  
“Dictatorship of Employer “ ను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.

ఇప్పుడు భారత దేశ రాజకీయాలను కేపెటలిస్టులే ప్రభావితం చేస్తున్నారు. కేపెటలిస్టులే ప్రజాపతినిధుల రూపంలో పార్లమెంట్ , రాష్ట్ర శాసన సభలలోకి ప్రవేశిస్తున్నారు. రాజ్యాంగ విభాగాలలోకి ప్రవేశిస్తున్నారు . వీరి లక్ష్యం లాభార్జనే కాని ప్రజా సంక్షేమం కాదు .ఆ లాభాలను ఆర్జించే క్రమంలో అనేక మంది జీవించే హక్కును కోల్పోతున్నారు .ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా సంపదను సమానంగా పంచమని రాజ్యాంగం సూచిస్తూంటే దానికి విరుద్దంగా సంపదంతా కొద్ది మంది కుల పెట్టుబడిదారుల చెంత చేరుతుంది. 

“రాజ్యాంగమనేది అద్భుతమైన దేవాలయం , అక్కడ దేవుళ్ళను ప్రతిష్టిద్దాం అనుకున్నాం , కాని దేవుళ్ళను ప్రతిష్టంచక ముందే దెయ్యాల గుంపు అక్కడ తిష్టవేసాయ్.”అన్నారు డా. ఆంబేడ్కర్.

రాజ్యాంగంను పరిరక్షించుకోవటo అనేది ప్రస్తుత లక్ష్యంగా పీడిత జనాలు తీసుకోవాలి. రాజకీయ పార్టీల మ్యానిపెస్టో రాజ్యాంగం మాత్రమే కావాలి. డా. అంబేడ్కర్ తాను స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మ్యానిపెస్టోను భారత రాజ్యాంగంగా సూచించారు. డా. అంబేడ్కర్ ఆశించిన స్టేట్ సోషలిజం ప్రస్తుత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల రూపంలో వుంది. బహుజనులు ,పేదలు అధికారంలో కి రావటం ద్వార మాత్రమే స్టేట్ సోషలిజం సాధించగలం.

జై భీమ్ 
వున్నవ వినయ్ కుమార్
సామాజిక పరివర్తన కేంద్రం(SPK)
9490611903

(Visited 249 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!