స్వేచ్చ, సౌభ్రాతత్వం ఎస్సి మహిళల ఆభరణం!

షేర్ చెయ్యండి

బారత దేశంలో స్త్రీ చిన్న అమ్మాయి  అయినా లేదా యువతి అయినా లేదా వయస్సు మళ్ళిన స్త్రీ అయినా తనంతట తాను ఏ పనులూ చెయ్యకూడదు అని మను స్మృతి చెబుతుంది. తన ఇంటిలో కుడా తాను స్వతంత్రంగా చెయ్యకూడదు. పెళ్లి కాకముందు తండ్రి , పెళ్లి అయిన తర్వాత భర్త, ముసలితనంలో కుమారుడి అడుగుజాడల్లో మాత్రమే నడవాలి. హిందూ మతస్తుల రూల్ బుక్ అయిన మను స్మృతి చెబుతుంది. కానీ ఎస్సి మహిళలకు ఏ రూలు లేదు. దేశంలో మహిళలందరిదీ ఒక సమస్య అయితే, ఎస్సి మహిళ లకు ఇంకొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయి. ఎస్సి మహిళ ల సమస్యలు సవర్ణ హిందూ మహిళ ల సమస్యలతో అసలు పోల్చలేము.

ఇటీవల పూణే లో జరిగిన “దళిత మహిళ స్పీక్ అవుట్” కార్యక్రమంలో రోహిత్ వేముల తల్లి  రాధిక వేముల ప్రారంబోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ , ఆరోగ్యం బాగాలేక మందులు కొనుకోవడానికి  పది, పదహైదు రూపాయిలు నా బర్తను మూడు , నాలుగు సార్లు అడగాల్సి వచ్చేది. అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను సొంతగా డబ్బులు సంపాదించాలి అని, ఉద్యోగం చేద్దాం అంటే పేదరికం వలన చదువుకోలేదు. అందుకే కుట్టు పని నేర్చుకుని బట్టలు కుడుతూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టెను. పిల్లలు పెద్ద వాళ్ళు అయి స్కూలు కి వెళ్ళడంతో సమయం ఉండటంతో చదవడం ప్రారంభించెను. రోహిత్ మొదట సంవత్సరంలో ఉంటే నేను రెండో సంవత్సరంలో ఉన్నాను. రోహిత్ మరణంతో నా చదువు ఆగిపోయింది. కానీ స్కూల్ పిల్లలకు పుస్తకాలు మరియు యూనిఫాం ఉచితంగా కుట్టి ఇస్తున్నాను. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చెప్పినట్లు ఎస్సి మహిళలందరూ తప్పనిసరిగా చదువుకోవాలి.

ఎస్సి మహిళలు మూడు రకాల సమస్యలు అధిగమించాలి  మొదటిది పేదరికం, రెండోది కుల వివక్ష వీటితో పాటు పురుషాధిక్యం కుడా ఎదుర్కోవాలి. మను స్మృతి యొక్క నియమ నిబందనలు ఎస్సి మహిళలకు వర్తించవు, ఎస్సిలు హిందువు గా ఉన్న అవి నిచ్చెన మెట్ల కుల వ్యవస్తలో పైన ఉన్న కులాలకే వర్తిస్తాయి.

హిందూ మను స్మృతి ప్రబావం, పురుషాధిక్యం ఎస్సి మహిళ ల మీద కుడా తీవ్రంగా ప్రబావం చూపించింది. అయినా  ఎస్సి మహిళ తన కుటుంబ పోషణకు గడప దాటి బయటకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. బార్య, బర్త కలిసి పని చేసే సంస్కృతి ఎస్సీలది . కడు పేదరికం, అంటరానితనం మరియు తల్లితండ్రులకు విద్య లేకపోవడం వలన ఎస్సి బాలికలు ప్రాధమిక విద్యలోనే 75% డ్రాప్ అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

Also read  మదర్స్ డే:దళిత మాతృమూర్తులు

ఎస్సి మహిళల మీద అట్రాసిటీలు ఎక్కువ, వారిని బలత్కరించడం, చంపడం కుడా జరుగుతుంది. గ్రామీణ ప్రాంత స్కూల్లలో ఎస్సి విద్యార్ధినులు మంచి మార్కులు తెచ్చుకుంటే శుద్ర కులాల టీచర్స్ వారి మీద వివక్ష, టీజింగ్ లాంటివి చేస్తే వారి యొక్క అత్మస్తైర్యం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి మానసిక వేదన వలన కుడా ఎస్సి విధ్యర్దినిలు స్కూలు, కాలేజీ లు మధ్యలోనే వదిలేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి గా వ్యవసాయ ఆధారిత పనులుకు వెళ్తూ ఆర్ధిక స్వాలంభనలో, ఆర్ధిక స్వేఛ్చలో మిగతా కులాలకంటే ముందే ఒక అడుగు ముందే ఉంటారు. కుటుంబ పోషణ, ఇంటి యాజమాన్యం ఎస్సిల లో ఎక్కువ శాతం మహిళ లే చూస్తారు.

సామాజిక అభివృద్ధిపధం లో ఎస్సి మహిళ లు!

సామాజికంగా అత్యంత వెనకబడిన స్తితి నుండి వచ్చిన ఎస్సి మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. రాజకీయంగా, ఆర్ధిక రంగాల్లో వారి పాత్ర నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో , మునిసిపాలిటీ ఏరియా లో డ్వాక్రా లాంటి సంఘాల్లో చేరి స్వయం శక్తి తో ముందడుగు వేస్తూ వారి కుటుంబ ఆర్ధిక స్తితి మెరుగయ్యేందుకు తోడ్పడటమే కాకుండా వివక్ష నుండి బయట పడుతూ ఆత్మగౌరవం తో జీవిస్తున్నారు.

Also read  దళిత మహిళా ఉపాధ్యాయురాలిపై వేధింపులు!

ఇటీవల విజయవాడలో జరిగిన దళిత స్త్రీ శక్తి 12 వ మహాసభలో ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా సెక్రెటరీ శ్రీమతి కే సునీత మాట్లాడుతూ ఒకప్పుడు వెనకబడి ఉన్న ఎస్సి మహిళ లు నేడు ఎదుగుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు అని అన్నారు. ఎస్సి / ఎస్టీ మహిళ లకు పౌష్టిక ఆహార లోపం తీవ్రంగా కనిపిస్తుంది దీనితో వీరు అనారోగ్యనికి గురి కావల్సివస్తుంది.

దళిత సాహిత్యం పేరిట ఎస్సి వర్గాలు తమయొక్క బాష ,సంస్కృతీ వెతలతో కవితలు, రచనలు చేస్తుంటే ఇందులో కుడా దళిత స్త్రీవాద కవిత్వం ఎస్సి మహిళా రచియితల చేత వారి యొక్క బావలను వ్యక్త పరుస్తుంది.

దళిత వుమెన్ స్పీక్ అవుట్ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీకోర్టు అడ్వకేట్ శ్రీమతి క్రిబా మున్నుస్వామి మాట్లాడుతూ ఎస్సి మహిళ కు న్యాయం 2% కుడా అందించలేక పోతున్నాము అన్నారు. అట్రాసిటీ కేసులు పోలీసులు అసలు రిజిస్టర్ చెయ్యడం లేదు అని వాపోయేరు. ఈ పరిస్తితి నుండి గట్టెక్కడానికి న్యాయ వ్యవస్తలో ఉన్న వారు ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి ఎస్సి మహిళ ల మీద జరుగుతున్న అరాచకాల మీద న్యాయస్తానల్లో పోరాడాలి అని పిలుపునిచ్చేరు.

గ్లోబలీకరణ లో ఎస్సి మహిళలు!

గ్లోబలీకరణ సహజంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సి మహిళ ల మీద ప్రబావం చూపించినా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చెప్పినల్టు నేడు మహిళ లు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణాల్లో తమ బవిషత్ ని నిర్మించుకుంటూ అత్మస్తైర్యం తో ముందడుగు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వర్గాల బారి నుండి తప్పించుకున్నా నగరాల్లో కొత్త తరహా వివక్షను ఎస్సీలు ఎదుర్కోక తప్పడం లేదు. చదువు అర్హత, కమ్యునికేషన్ స్కిల్స్ మరియు ఉద్యోగం చేసే సామర్ధ్యం, పోటీ తత్త్వం ఉంటున్న కార్పోరేట్ వ్యవస్తలో కుల వివిక్ష తప్పడం లేదు అంటున్నారు. కమ్యునికేషన్, మీడియా, కళారంగాల్లో ఎస్సి మహిళ లకు సరైన ప్రాధాన్యత ఇప్పటికీ లేదు.

Also read  Honour killing in Telangana, man hacked to death in front of pregnant wife.

చెన్నై నగరంలో మీడియా కార్పోరేట్ రంగంలో మేనేజర్ గా పని చేస్తున్న  వనిత చార్లెస్ దళిత వుమెన్ స్పీక అవుట్ లో మాట్లాడతూ, ఎస్సి మహిళలు డినమిక్ గా ఉండాలి, వేష, బాషలలో ఎక్కడా తగ్గకుండా అత్మస్తైర్యం తో ఉండాలి అని కోరేరు.

ఎస్సి కుటుంబాలు ఇంటిలో మగ పిల్లలకు తన సోదరి తో ఎలా మలుచుకోవలో , ఎలా గౌరవించుకోవలో ముందు నుండి నేర్పించాలి. మెజారిటీ ఎస్సి కుటుంబాలు తమ తోబుట్టువులతో మర్యాద గా మలుచుకుంటారు. ఈ విషయంలో మిగతా కులాల కంటే స్త్రీ ల పట్ల ఎక్కువ సానుబుతి చూపించేది చూపిస్తారు.

వివిధ రంగాల్లో ఉన్న ఎస్సి మహిళ లు బయటకు వచ్చి మాటట్లాడలి. అభివృద్ధి చెందిన మహిళ లు వారి యొక్క అనుబవాన్ని తమ వర్గాలతో పంచుకోవాలి. వారు స్పూర్తిగా నిలబడగలగాలి.

ఏది ఏమైనా ఒకప్పటి కంటే నేడు ఎస్సి మహిళ ల్లో చాలా మార్పులు వచ్చేయి. వారిని Exploitation చేసేవారి పట్ల వారు కాస్త కటువుగానే ఉంటున్నారు. ఆత్మగౌరవం తో ముందుకు వెళ్తున్నారు. ఎస్సి మహిళ ల ఆత్మ స్తైర్యం గొప్పది. అయితే వీరి గాధలు బయటకు రాకపోవడం వలన వీరు మరుగున పడిపోతున్నారు.

ఎస్సిలలో స్త్రీల పట్ల  మనువాద  బావజాలం చాల తక్కువగా ఉంటుంది. అదే వారికీ ఇచ్చిన స్వేఛ్చ,గౌరవం. కుటుంబ ఆర్ధికపరమైన సమస్యలు వారి అభివృద్దిని అడ్డుకుంటున్నా తమ హక్కులు సాధించుకోవడంలో ముందు అడుగు వేస్తున్నారు. స్కూల్ డ్రాప్ అవుట్ మరియు కాలేజీ స్తాయి లో ఇంకా వీరి ప్రాదాన్యత పెరగాలి. ఇప్పుడు ఉన్న అక్షరాస్యత శాతం ఇంకో 10% పెంచగలిగితే చాల మటుకు ఎస్సీలలో మార్పులు రావడానికి కారణం అవుతుంది.          

(Visited 134 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!