హిందూ రాజ్యం ఇలానే ఉండబోతుందా?

షేర్ చెయ్యండి

హిందూ రాజ్యం అనివార్యం అయితే అంతకంటే ఈ దేశానికి పెద్ద అరిష్టం ఈ దేశానికి ఇంకొకటి లేదు. హిందువులు ఏమైనా అనుకోనీయండి ఇది మాత్రం వాస్తం. హిందుఇజం లో స్వేఛ్చ, సమానత్వం, సౌభ్రాతత్వం లేదు. ప్రజాస్వామ్యం అసలే లేదు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్  ఎట్టి పరిస్తితిల్లో హిందూ రాజ్యాన్ని నిరోధించాలి అన్నారు.

మానబంగం చెయ్యడం ఈ భూమి పైన అత్యంత బయంకరమైన నేరాలలో ఒకటి. బారత దేశంలో ప్రతి 5 నిమిషాలకు మహిళల మీద అత్యాచారం చేస్తున్నారు. ఫ్యూడల్ కుల సంప్రదాయంలో ఆర్ధికంగా, సామాజికంగా వెనకబడిన కులాల మీద తమ కుల దౌర్జన్యాన్ని, ఆధిపత్యం చూపించటానికి మహిళ ను మానబంగం చెయ్యడం పరిపాటి. హిందూ న్యాయ సూత్రం మనుస్మృతి శుద్ర స్త్రీ ని మానబంగం చేసినా శిక్ష లేదు అంటుంది.

గత వారం జమ్ము కాశ్మీర్ లోయలో ఒక సంచార జీవనం గడిపే 8 సంవత్సరాల బాలికను రేప్ చేసి రాయితో కొట్టి చంపిన సంఘటన విదేశాల్లో కుడా హెడ్ లైన్ వార్తల్లో ప్రముఖంగా వచ్చింది. ఇంతటి హేయమైన సంఘటనకు ప్రపంచమంతా నివ్వెరపోయింది.

బకేర్వాల్ అనే సంచార తెగ కు చెందిన 8 సంవత్సరాల అసిఫా ని దుండగులు ఒక హిందూ మందిరం లోకి  లాక్కెళ్ళి వరసగా వారం రోజులు బలాత్కరించి, రాయితో కొట్టి చంపేసేరు. ఈ సంఘటన వలన జమ్ము ప్రాంతంలో ఉన్న సంచార జాతులు ఇతర ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. దేశవ్యాప్తంగా అసిఫా సంఘటన ప్రజలు నిరసనలు, ర్యాలీలు, చేస్తున్నారు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే హిందూ  మనువాదులు, హిందూ జాతీయ వాదం పై మాకే పేటెంట్ హక్కు ఉంది అనుకునే హిందు నాయకులు,మంత్రులు రెప్ చేసిన వ్యక్తులకు మద్దత్తు గా జరిపిన ర్యాలీ లో పాల్గొని మద్దత్తు పలకడం అత్యంత దురదృష్టకరం. హిందువులు అని , హిందూ రాజ్యం అని చెప్పే వారు 8 సంవత్సరాల చిన్నారి ని రేప్ చేసి చంపిన వారికి మదత్తు గా నిలవడం అంటే హిందూ రాజ్యం మీద అనుమానాలు సామాన్యులకు రాకమానదు.

Also read  బలవంతపు దళిత గోవిందాలు ఆపండి!

ఏ మతం అయినా , కులం అయినా, ప్రాంతం అయినా స్త్రీలను , అదికూడా చిన్న పిల్లలను రేప్ చేసిన వారిని ప్రశంసించడం అంటే, వారిని హీరోలు గా చిత్రీకరించడం అంటే ఆ సమాజం యొక్క మానసిక స్తితిని , ఇతరుల పట్ల ద్వేషాన్ని తెలియజేస్తుంది. అసిఫాని మానబంగం చేసి చంపిన వ్యక్తులకు మదత్తు గా బా జ పా మంత్రులు , శాసన సబ్యులు పాల్గొనడం , కోర్టుల లో కేసు అఫిడవిట్ దాకలు చెయ్యకుండా అడ్డుకోవడం , కోర్టుల మీద జాతీయ జెండా పీకి పడేసి కాషాయ జెండా ఎగర వేయడం అదే హిందుత్వం , అదే హిందూ రాజ్యం యొక్క విధానం అయితే బారతీయులు ప్రమాదంలో పడినట్లే!

రేపిస్ట్ లకు మద్దత్తు గా ర్యాలీలు తీయడం పెద్దగా అచ్చర్యపడక్కర్లేదు. అసిఫా సంఘటన జరిగిన రాసాన  ప్రాంతం లో రేపిస్టు లకు మద్దత్తు గా జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన వారు పాలక పార్టీల నాయకులు  “ఓయ్ గుజ్జ్రో 47 భుల్ గయే ”  ఓయ్ గుజ్రో 1947 సంఘటన లు మర్చి పోయెరా ? అని నినాదాలు చేసేరు.    

దేశ విభజన జరిగినప్పుడు జరిపిన దాడులు , రేప్ లను చేసిన వారిని ప్రశంసిస్తూ , హిరో లను చెయ్యడం కాకతాళీయం కాదు. హిందువు లు అనబడే వారు ఇతర కులస్తులను , మతాల వారిని చిన్న చ్పు చూస్తూ సాగించిన దుచ్చార్యాలు ఒకటి కాదు రెండు కాదు రోజు కధలు కధలుగా చెప్పుకోవచ్చు.

Also read  శబరిమల అయ్యప్ప బిజెపి కి దక్షణాదిన ఓట్లు తెచ్చిపెట్టే బృహత్తర పధకం గా ఆ పార్టీ భావిస్తుందా?

2002 లో జరిగిన ముస్లిం స్త్రీ ల సాముహిక అత్యాచారం లో బాబు బజరంగీ అనే వ్యక్తీ తన బార్య ముందే ముస్లిం స్త్రీ ని మానబంగం చేసేడు. ఆమె ప్రవేట్ పార్ట్శ్ లో కత్తిని దింపేడు. అలాంటి బాబు బజరంగి ని హిందూ సమాజం హిరో ని చేసింది. కనీసం ఖండన కుడా ఇవ్వలేని హిందూ సంమాజం రేపు హిందూ రాజ్యం ఏర్పడితే ఇంకెన్ని ఘోరాలు చేస్తుందో ఆలోచించాలి.

ఇది ఒక్క ముస్లిం ల మీదనే కాదు 1984 లో సిక్కు మహిళ ల మీద జరిపిన సాముహిక అత్యాచారాలను హిందూ సమాజం వేడుకలుగా చేస్తుంది. అలాగే దళిత మహిళ పట్ల లేక్కలేనని సంఘటనలు రోజు చూస్తున్నాం.  ఇటీవల శ్రీరామ నవమి వేడుకల్లో శంబులాల్ అనే వ్యక్తీ ఒక ముస్లిం యువకుడిని సజీవంగా కాల్చి చంపడం జరిగింది, అతనిని కుడా హిందూ సమాజం హిరో ని చేసింది. హిందూ సమాజం నుండి అలాంటి సంఘటన మీద  ఒక చిన్న నిరసన కుడా రాలేదు.

Also read  ఇండియాలో హిట్లర్ వారసులు-విద్వేషమే అజెండా!

చట్టం అసిఫా బాను కేసులో న్యాయం చెయ్యక పొతే రేప్ చేసిన వ్యక్తులకు వారసులు తాయారు అవుతారు, వారిని కీర్తిస్తారు. వారికి పార్లమెంట్ సీట్ ఇచ్చి సత్కరించినా అచ్చర్యపడక్కర్లేదు.

బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్లు “హిందూ రాజ్యం బారత దేశానికి పెద్ద విపత్తు” ఈ విపత్తును ఎదుర్కొనడానికి బారతీయులు సిద్దంగా ఉండాలి. ఓటు ద్వారా ఇలాంటి నేరస్తులను వారికి మద్దత్తు ఇచ్చే పార్టీలను నిలువరించాలి.   

 

 

 

(Visited 130 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!