హిందీ బాష ను మనం ఎందుకు స్వీకరించాలి? #StopHindiImposition
భారతదేశం మొత్తం హిందీ బాష మాత్రమే ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హిందీ దివాస్ రోజు మాట్లాడటం కలకలం రేగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిందీ మాట్లాడటం లేదు. హిందీ ని సెకండ్ ల్యాంగ్వేజ్ గా పరిగణిస్తున్నారు.
భారత దేశం అంటే విభిన్న ప్రాంతాలు, విభిన్న ప్రజలు, విభిన్న బాష మరియు మతాలు. అందుకే భారత దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని పేర్కొన్నారు మన రాజ్యాంగ పెద్దలు.
దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలు అతి కొద్ది రాష్ట్రాలు మాత్రమే. మరి ఎందుకు భాజపా ప్రభుత్వం హిందీ ఒక్క బాష నే ఉండాలని కోరుకుంటుంది. సంఘ్ పరివార్ శక్తులు ప్రభుత్వం వెనక ఉండి ఈ విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నారు.
2001 జనాభా లెక్కలు ప్రకారం దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడే వారు కేవలం 30% మాత్రమే. 30% మాత్రమే మాట్లాడే బాష ను దేశ ప్రజలందరి మీద ఎందుకు రుద్దాలని చూస్తున్నారు.
నేటి వరకు భారతదేశానికి ఒక జాతీయ బాష అంటూ లేదు. అలాంటిది RSS – BJP 70% జనాభా మీద హిందీ బాష ను ఎందుకు రుద్దాలనుకుంటుంది.
భారతదేశం విభిన్న దేశం, ప్రాంతం. ఇక్కడ మొత్తం 1600 బాష లు ఉన్నాయి. 2500 పైచిలుకు కులాలు వున్నాయి. కుల వివక్షత వుంది. రాజ్యాంగం 23 భాషలను అధికారిక భాషలు గా గుర్తించారు. అందులో హిందీ , ఇంగ్లీష్ కూడా ఉన్నాయి.
ప్రభుత్వం పౌరుల మీద నియంతృత్వ ధోరణిలో ఒక బాష ను గానీ, సంస్కృతి ని గానీ రుద్దాలనుకోవడం ప్రమాదానికి దారి తీస్తుంది. BJP – RSS వారి స్వలాభాల కోసం బలవంతాన ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంది.
ప్రజలను ఏకీకరణ చెయ్యకుండా ఇటువంటివి విధించడం జాతీయ ఐక్యతకు హానికరం. నియంతృత్వ ధోరణిలో పౌరుల మాట్లాడే బాష మీద, ఆహారం మీద మరియు వస్త్రధారణ మీద ఆంక్షలు పెట్టాలనుకుంటే భారత సంయుక్త రాష్ట్రాల ఐక్యతకు విఘాతం ఏర్పడుతుంది.
దేశంలో పౌరులు మాట్లాడే ప్రతి భాషకు ఒక స్వయం అస్తిత్వం ఉంది. దేని సాంస్కృతిక నేపథ్యం దానికి ఉంది. హిందీ బాష ప్రపంచ స్థాయి బాషగా గుర్తింపబడలేదు. అలాటిది హిందీ ని అందరి మీద పెత్తనం చేయించడం కుదిరేపనికాదు.
“దేశ బాష లందు తెలుగు లెస్సా” అన్నారు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గా తెలుగు బాష ను కీర్తించారు.అలాంటి బాష ను విస్మరించాలను కోవడం పొరపాటు.
ద్రావిడ బాష లే సింధు నాగరికత కు మూలం. భారత దేశ నాగరికత ద్రావిడ బాష లు ఆయువు పట్టు. సంఘ్ పరివార్ మరియు బాజాపా నాయకులు ప్రజల మీద హిందీ రుద్దేదానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
బ్రాహ్మణిజం రెండు నాల్కుల ధోరణి లో మాట్లాడుతుంది. RSS నిర్వహించే సరస్వతి శిశు మందిర్ లో సంస్కృతం నేర్పించరు గానీ మిగతా వారి మీద సంస్కృతం / హిందీ బాష అంటూ నానా యాగీ చేస్తున్నారు.
హిందీ నేర్చుకునే బదులు, ఏదైనా విదేశీ భాషను నేర్చుకోండి మరియు అది మిమ్మల్ని మరింత హేతుబద్ధంగా చేస్తుంది. వివిధ అధ్యయనాలు విదేశీ భాషలో పనిచేయడం వల్ల ప్రజలు మంచి నిర్ణయాలు తీసుకోవటానికి మరియు తక్కువ అభిజ్ఞా పక్షపాతానికి గురవుతారు. హిందీలో సమయాన్ని వృథా చేయడం కంటే జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, మాండరిన్ లేదా అరబిక్ నేర్చుకోవడం మంచిది.
కార్డిఫ్ బిజినెస్ స్కూల్కు చెందిన జేమ్స్ ఫోర్మాన్-పెక్ చేసిన అధ్యయనం ప్రకారం, బ్రిటన్లో విదేశీ భాషా ప్రావీణ్యం లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఆర్థిక వ్యవస్థకు 48 బిలియన్ డాలర్లు (80 బిలియన్ డాలర్లు) లేదా జిడిపిలో 3.5% ఖర్చవుతుందని అంచనా వేశారు.
భారత దేశానికి కూడా ఇలాంటి అదనపు ఖర్చులు ఉండటంలో ఆశ్చర్యపడక్కర్లేదు. పౌరులు హేతుబద్దంగా ఆలోచించాలి సంఘ్ పరివార్ యొక్క కుట్రలకు / ఉద్దేశ్యాలకు బలైపోకండి.
ప్రపంచంలో హిందీ భాషను మాట్లాడే కొద్ది రాష్ట్రాల ప్రజలు తప్పా మరెక్కడా హిందీ కి విలువ లేదు. అలాంటి హిందీ బాష ను భారత దేశం మీద బలవంతాన ప్రయోగించాలనుకోవడం అవివేకం.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిందీ మాట్లాడటం లేదు. హిందీ ని సెకండ్ ల్యాంగ్వేజ్ గా పరిగణిస్తున్నారు
తెలుగు మన మాతృ బాష. తెలుగు కాకుండా మరే ఇతర భాషను సొంత బాష గా గుర్తించలేము.