దేశ ప్రగతికి అడ్డు కుల రిజర్వేషన్ల లేకా స్కాంలా!..

షేర్ చెయ్యండి
 • 3
  Shares

బారత దేశానికి స్కాం లు కొత్త కాదు. ప్రతి ప్రబుత్వ హయంలో వేలకోట్ల రూపాయిల మోసాలు బట్టబయలు అవుతున్నాయి. ప్రబుత్వంలోని కొందరు సహకారంతో వారి బందు, మిత్రులు ఈ స్కాం(మోసాలకు) పాలపడుతున్నారు. సైనికుల శవ పేటికల నుండి, పశువుల దాణా వరకూ, చిన్నతరహ పొదుపు నుండి బోఫర్స్ గన్నులు వరకూ, నీళ్ళ దగ్గర నుండి సముద్రంలో దొరికే సహజ వాయువు వరకూ, భూమి నుండి భూమి లో దొరికే ఖనిజ నిక్షేపాల వరకూ, కొండలు, గుట్టలు ఇంకా చెప్పాలి అంటే అమ్మాయిల శరీరాల వరకూ స్కాం లు చెయ్యటం బారత దేశానికి కొత్తకాదు.

నిన్న 14.02.2018, బుధవారం వెలుగులోకి వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంకు వారి రూ 11,500 కోట్ల రూపాయిల స్కాం కొత్త తరానికి అచ్చర్యం అవొచ్చు లేదా ప్రధాన మంత్రి మోడీ అవినీతి లేని ప్రబుత్వాన్ని అందిస్తాం అనే ఎన్నికల డైలాగ్ నమ్మి మోసపోయిన యువతకు కాస్త అచ్చర్యం కలిగించవచ్చు, కానీ సామాన్యులకు ఇది సర్వసాదరణమే! నిప్పును తప్పా ఇప్పటివరకూ వీళ్లు చెయ్యని స్కాం లు అంటూ ఏదీ లేదు.

ఈ స్కాం లు విన్న తర్వాత సోషల్ మీడియా కాలంలో నవతరానికి ఒక అనుమానంరాక పోదు. ప్రబుత్వాల అండతో కొన్నివర్గాలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న ‘రిజర్వెషన్ల వలన దేశం వెనకపడి పోతుంది’ అనే కుట్రపూరిత ప్రచారంలోని డొల్ల తనాని తేటతెల్లం చేస్తుంది.

బారత దేశంలో అనాదిగా కొన్ని వర్గాలే సమాజం మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. విద్య, సంపద, అధికారం. ఈ మూడు కొన్ని వర్గాల గుప్పెట్లో బందీగా వేలాది సంవత్సరాల నుండి ఉన్నాయి. వీటికి వీరు దేవుడు – కులం అనే సరళ రేఖలు గీసి మిగతా ప్రజలను వాటికి శాశ్వతంగా అందకుండా చేసేరు. కాలం చాల సంఘటనలకు సమాధానం చెబుతుంది అలగే వేలాది సంవత్సరాలు గా జరుగుతున్న “విద్య , సంపద, అధికారం “ అనే సామజిక స్కాం కూడా కాలం సమాధానం చెప్పింది. ఆ సమాధానమే “రిజర్వేషన్లు”  బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు ఏమన్నారు అంటే అవి రిజర్వేషన్లు కాదు మా రిప్రజెంటేషన్స్ అని పేర్కొన్నారు.

Also read  యోగి 'రాంజీ' అంబేడ్కర్ ఒక కుట్ర!

అజ్ఞానంతో, మూడ నమ్మకంతో నిండి ఈ బారత సమాజంలో మానవనీయ కోణంలో బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు నిమ్నజాతీయులు అనబడే, ఎవరైతే దేవుడు – కులం పేరు చెప్పి వేలాదిగా ఏ హక్కులు, ఎలాంటి సదుపాయాలు లేకుండా దుర్భర జీవితాన్ని కొన్ని వర్గాల కోసం పణంగా పెట్టి జీవిస్తున్నారో అలాంటి వారిని ‘అంటారని’ వారు అని మోసం చేస్తూ ఉన్న సమాజానికి సూర్యుడిలా వెలుగు నింపి బారత ప్రబుత్వ పరంగా వారి సామజిక స్తితి నుండి సంస్కరించబడటానికి, ఉత కర్రలా నిలబడుతుంది అని విద్య, ఉద్యోగాల్లో కొంతమేర వారికీ కేటాయించేరు. వేలాది సంవత్సరాలుగా కొందరిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళిన వారిని చేరుకోవడానికి రిజర్వేషన్లు అనే ఉత కర్రను ఇస్తే ఓర్చుకోలేని సమాజం నేడు అదే దేవుడు – కులం పేరు చెప్పి దేశం నష్టపోతుంది అంటూ విష ప్రచారం చేస్తున్నారు.

రిజర్వేషన్ల వలన దేశం నష్ట పోయిందా?

1932 లో బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు పోరాడి సాధించిన “కమ్యూనల్ అవార్డ్ “ ని ప్రాణత్యాగం పేరుతొ మోసం చేసిన గాంధీ దగ్గర నుండి నేటి పెత్తందారి కులాల సంపన్న బిడ్డలు, పాలకులు కులాల కి ఇచ్చే రిజర్వేషన్లు వలన సమాజం / దేశం నష్టపోతుంది అంటూ వివిద వేదికల నుండి ప్రచారం చేస్తున్నారు. అయితే అంతే సమర్ధవంతంగా రిజర్వేషన్లు పొందుతున్న కులాల నుండి వచ్చిన మేధావులు, విద్యార్ధులు, సామాన్యులు అడుగుతున్న ప్రశ్న కి సమాధానం లేదు. రిజర్వేషన్ల వలన దేశం ఏవిధంగా నష్ట పోయిందో చెప్పమంటే ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేక పోతున్నారు. ఆధాకరిక లెక్కలు చెప్పకుండా , అధికారక ప్రకటన లేకుండా సామాన్య ప్రజల మధ్య రిజర్వేషన్ల వలన మీ ఆర్ధిక అభివృద్దికి అడ్డంగా మారుతుంది అంటూ అగ్ర వర్ణంలో కుడా పేదరికాన్ని సాకుగా చుపెడుతున్నారు. అగ్ర వర్ణం లో పేదరికం ఈ దేశ సంపద, విద్య, అధికారం తమ గుప్పెట్లో పెట్టుకున్న అదే అగ్ర వర్ణ నిదా లేకా ఆయా కులాల పాలకులదా లేక రిజర్వేషన్లదా అని తేల్చి చెప్పడం లేదు.

Also read  రిజర్వేషన్లు కావవి, రిప్రజెంటేషన్స్; మీ పేదరికానికి, మీ నిస్సహాయతకు రాష్ట్రాన్ని పాలిస్తున్న మీ కులం అని ఎందుకు గుర్తించరు?

బారత దేశంలో ౩% లేదా 4% ఉన్న కులాలో 0.5 % పేదలు ఉంటే 25% ఉన్న కులాల్లో 2% మాత్రమే ధనికులు ఉన్నారు. కానీ వేలాది ఎకరాల భూమి, రాజకీయ పదవులు, ఆర్ధిక వనరులు, ఉద్యోగాల్లో ఈ ౩ లేదా 4 శాతం జనాభా వారి వాటా కంటే 100 రెట్లు అధికంగా ఉన్నారు.

ఆర్ధిక నేరాలు చేస్తుంది రిజర్వేషన్ల కులాల !

దేశంలో రాజకీయ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, ఉపరితలం లో ఉన్న కుల ప్రయోజనాలను అడ్డంపెట్టుకుని, అడ్మిన్ స్త్రేటివ్ ఉద్యోగాలను అడ్డంపెట్టుకుని ఆర్ధిక మోసాలు, పన్ను ఎగవేత, బ్యాంకు లను మోసం చెయ్యడం, ఐ. పి లు పెట్టి వందలాది లక్షల డబ్బులు బినామీ పేరున మార్చుకుని సమాజ ఆర్ధిక స్తితిని, దాని ద్వారా జరిగే అభివృద్ధి ని అడ్డుకుంటుంది రిజర్వేషన్ల వర్గాలా లేక సంపన్న వర్గాలో రిజర్వేషన్ల కు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ సమాదానం చెప్పాలి. నిన్న వెలుగులోకి వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంబకోణంకి , దాని వలన లాభపడిన వ్యక్తుల కులాలు ప్రబుత్వం బయట పెట్టాలి. రిజర్వేషన్ల కి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు వేల కోట్ల రూపాయిల ఆర్ధిక నేరాలకు పాల్పడుతుంది ఫలానా కులం వ్యక్తీ ఆ కులం వ్యక్తులు ఆర్ధిక నేరాలకు పాల్పడటం వలన ప్రతి ఒక్కరికి అందాల్సిన అభివృది ఫలం ఆ వ్యక్తుల కి మాత్రమె అందుతుంది అని ప్రచారం చెయ్యాలి. రూ 11,500 కోట్ల మోసం ప్రబుత్వం మీద పడుతుంది అంటే ప్రతి సామాన్యుడి మీద పన్నుల రూపంలో పడుతుంది. ప్రతి ఒక్కరి ఆదాయం నుండి ఖర్చు అవుతుంది. రెండు నెలలు క్రితం వెలుగులోకి వచ్చిన నీరవ్ మోడీ అనే వజ్రాల వ్యాపారి చేసిన  రూ 281కోట్ల మోసం రిజర్వేషన్ల వలన జరిగిందా!   

Also read  ఎస్సీ ఎస్టీల పదోన్నతుల్లో రిజర్వేషన్: సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

ఇప్పటి వరకూ బారత దేశంలో జరిగిన ఆర్ధిక కుంబకోణాలు,దేశంలో ఇప్పటి వరకూ జరిగిన కొన్ని ఆర్ధిక నేరాలను పరిశీలిద్దాం

 • బొగ్గు స్కాం – రూ. 1,86,000 కోట్లు
 • 2 జి స్పెక్ట్రం స్కాం – రూ. 1,76,000 కోట్లు
 • వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ స్కాం – రూ. 1,50,000కోట్లు
 • కామన్వెల్త్ క్రీడల స్కాం – రూ. 70,000కోట్లు
 • తెల్గి స్కాం – రూ. 20,000కోట్లు
 • సత్యం స్కాం – రూ. 14,000కోట్లు
 • బోఫోర్స్ స్కాం – రూ. 200కోట్లు
 • హర్షద్ మెహత స్కాం – రూ. 5000 కోట్లు
 • జైన్ హవాల స్కాం – రూ. 100కోట్లు

ఇవి కాక కార్గిల్ యుద్ధం లో మరణించిన వీర జవానుల శవ పేటికల స్కాం, పశువుల దాణా స్కాం, కృషి బ్యాంకు స్కాం, కేతన్ ఫరెఖ్ ఇంకా ఎన్నో స్కాం లు ఈ దేశ ఆర్ధిక వ్యవస్తను కుదిపేశాయి. ఇవి కాక బడా వ్యాపారస్తులకు ప్రబుత్వమే లక్షలాది కోట్ల  రూపాయిల అప్పును బ్యాంకు లకు కట్టకుండా మాఫీ చేసింది. ఈ లక్షల కోట్ల ఆర్ధిక మాసాల్లో డబ్బు ఎగవేతలో ఎంత మంది రిజర్వేషన్లు లబ్దిదారులు ఉన్నారు?

ఋణ మాఫీలు , ఉచిత విద్యా పదకాలు , వ్యాపారస్తులకు పన్ను , విద్యుత్ ఫీజులు సబ్సిడీ లు ఏ రిజర్వేషన్ లబ్దిధారుడికి ప్రయోజనం చేకూరుతుంది.

2014 ఎన్నికల ప్రచారం లో బా జ పా ప్రదాని అబ్యర్ధిగా నేటి ప్రదాని మోడీ చేసిన ప్రదాన ప్రచారం విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బు ఏ రిజర్వేషన్ వలన అన్ని కోట్ల రూపాయిలు దేశంలో పన్ను కట్టకుండా విదేశాల్లో దాచుకున్నారు.

ఇలాంటి ఆర్ధిక మోసాలు , నేరాలు పాలకులు ప్రజలకు చెప్పకుండా, వారి అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి రిజర్వేషన్ల మీదకి నెట్టడం అంటే వేలాది సంవత్సరాలు గా చేస్తున్న మోసాన్ని అధికారికంగా కొనసాగించడమే అవుతుంది.

రిజర్వేషన్లు దేశ ప్రగతికి అడ్డు అనేది “అశ్వద్ధామ అధః ; కుంజరః “ లాంటిదే !  

(Visited 408 times, 1 visits today)

5 thoughts on “దేశ ప్రగతికి అడ్డు కుల రిజర్వేషన్ల లేకా స్కాంలా!..

 • 15/02/2018 at 11:04 PM
  Permalink

  right riyal story nice sir tq

  Reply
 • 21/08/2018 at 1:08 AM
  Permalink

  Really great informstion sir. Thsnk u

  Reply

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!