About us

షేర్ చెయ్యండి

నేటి జర్నలిజం హేతుబద్దమైన అభిప్రాయాలకు బదులు, హేతు విరుద్దమైన మనో వికారానికి చోటు కలిగిస్తుంది. బాద్యత కలిగినవారి ఆలోచనలను ప్రబావితం చేయడానికి బదులు, బాధ్యతా రహితములైన వారిని ఉద్రేక పరుస్తుంది: బాబాసాహెబ్ డా అంబేడ్కర్.

నేటి జర్నలిజం కులం పునాదుల మీద, ప్రాంతీయ పార్టీల ఆఫీస్ ల నుండి ఎడిట్ చేసుకుని వస్తుంది. ఏ వర్గానికి ఆ వర్గం తమ వర్గ ప్రయోజనాలకోసం మాత్రమే జర్నలిజం అనే తొడుగు వేసుకుని పని చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అసలైన వార్త విశ్లేషణ మరుగున పడుతుంది.

సత్యాలను వాస్తవాల నుండి గ్రహించాలి అంటాడు ఒక పెద్దమనిషి.

చరిత్ర తెలియని వారు చరిత్ర నిర్మించలేరు అంటారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్.

ఏదైనా ఒక సామజిక స్తితిని విశ్లేషణ చెయ్యాలి అంటే ఆ విశ్లేషకుడు ఆ సామజిక స్తితినుండి రావాల్సిందే లేదా అనుభవించాలి.అప్పుడే నిజమైన విశ్లేషణ బయటకు వస్తుంది.

తాతల మూతులు మూచ్చూసి 
నేతి కూతలు కూసే కుర్రగాడా 
నీకు తెల వదేమో 
మేం నున్చోనుంటే 
మీరు నడిమంచాల మీద కూకోని 
నక్రాల్జేసేకాలం కాదురా 
మేం పై పంచెలు సంకల్లో దాసుకొని పక్కకి తొలిగి నిలబడితే 
మీరు ఎదుర్రోమ్మిరుసుకొని ఎగేసుకుంటూ పోయే రోజులు కాదమ్మా 

దేశాన్నొక పడుపు మంచంగా వాల్చుకుని పిర్రలు పుళ్ళుపడిందాక కూకోని కూకోని కుక్కి కుక్కి చేసింది సాలుగాని లెండి లేవండహే The Editor Times, The independent news analyst సమగ్ర రాజకీయ, సామజిక, ఆర్ధిక అంశాలపై బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బావజాలం తో ఎప్పటికప్పుడు విశ్లేషణ మీకు అందిస్తుంది.

ఈ కార్యక్రమం లో మీరు మాకు సహాయ పడండి. మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు మా దృష్టికి తీసుకురండి లేదా మీరే ఒక వ్యాసం రాసి మాకు పంపండి, మేము ప్రచురిస్తాం.

ఈ మెయిల్ : theeditor2020@gmail.com

(Visited 44 times, 1 visits today)
error: Content is protected !!