భారత ఆర్ధిక వ్యవస్థ పతనం; కులం-మతం-రాజకీయ ప్రభావం! 

షేర్ చెయ్యండి

భారత ఆర్ధిక వ్యవస్థ పతనం కు  కులం-మతం మరియు రాజకీయ ప్రభావం ఉందా అంటే ఉందనే చెప్పాలి. రాజకీయాలకు మతాన్ని, కులాలను జోడించి పాలన సాగిస్తుండటం తో సహజంగా రాజకీయ పార్టిలు కులం, మతం గురించి రాజకీయాలలో మాట్లాడాల్సిన తప్పని పరిస్థితి. 

ఈ దేశంలో ఎప్పటి నుండో ఒక భావజాలం / అభిప్రాయం కొన్ని వర్గాల ప్రజల్లో జిగురు లా  పేరుకుపోయింది. షెడ్యూల్ కులం మరియు తెగ వ్యక్తులకు భారత దేశ సంపద / భారత ఆర్ధిక వ్యవస్థ,  సబ్సిడీ రూపంలో దోచిపెడుతున్నారు అంటూ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ కొందరు మాట్లాడుతూ వుంటారు. రిజర్వేషన్లు మీద కూడా వీరు ఫస్ట్రేషన్ వ్యక్తం చేస్తూ ఉంటారు.

ముక్యంగా ట్యాక్స్ పేయర్స్ అంటూ ఢిల్లీ నడివీధిలో నిప్పును తొక్కిన కుక్కలా గంతులు వేస్తువుంటారు. బిజెపి – మోడి ప్రభుత్వం కు ప్రధాన ఆయుధాలు 1. మతం అయితే 2. దళితులకు ఇస్తున్న ప్రత్యేక హక్కులు, సదుపాయాలు తొలగిస్తారు అనే అభిప్రాయం ఆ వర్గాల లో వుంది.

అందుకు అనుగుణంగానే గత సంవత్సరం ఎస్సి / ఎస్టి అత్యాచార నిరోధక చట్టం ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చెయ్యడం, ఇ డబ్ల్యూ యెస్ రిజర్వేషన్లు మరియు మూక దాడులు.

 
2014 ఎన్నికల ముందు మోడి మార్కు మార్పు దేశంలో వస్తుంది, దేశాన్ని గుజరాత్ లాగా సూపర్ పవర్ దేశం గా చేస్తారని భారత ఆర్ధిక వ్యవస్థ ను అభివృద్ధి చేస్తారని  మీడియా లో బాగా ప్రచారం జరిగింది. ఆ మేరకు మోడి ప్రధాన మంత్రి అయ్యాడు. 

 
మోడి ఎన్నికల నినాదాలలో ఒకటి  “అచ్చేదిన్ ఆయేగా” మోడి రెండో సారి అఖండ మెజారిటి తో ప్రధాని కావడం అచ్చేదిన్ ఆయేగా నినాదాలకు పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటె NSO ( National statistical office) లెక్కలు మోడి ప్రభుత్వం యొక్క ఆర్ధిక (భారత ఆర్ధిక వ్యవస్థ) వైఫల్యం పూర్వపు సంవత్సరాల తో పరిశీలన చేసినప్పుడు గత నాలుగు దశాబ్దాల కంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినట్లు వారి సర్వే లో పేర్కొన్నారు. 

Also read  పేదరిక నిర్ములనా: కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థను దివాళా తీయించి ప్రైవేట్ వారిని గత 20 సంవత్సరాలు గా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే అవి నేడు దాదాపు 7 లక్షల కోట్లు నష్టాల్లో ఉన్నాయి. వాటిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పెయర్ డబ్బును లక్షల కోట్ల ల్లో ఇస్తుంది. అయినా అవి మూసివేసే దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నాయి. 

ఈ ప్రైవేటు టెలికాం కు దేశంలోని దళితులు, ఆదివాసీలకు ఎలాంటి సంభందం లేదు. సంభందం లేకపోగా దేశంలో ఉన్న 25% దళిత ఆదివాసి ప్రజలు కూడా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ నెల నెలా ఈ దివాళా తీసిన కంపెనీలకు వారి శ్రమను దోచిపెట్టారు. 

భారత ఆర్ధిక వ్యవస్థ ఏ వర్గాల వలన దివాళా తీస్తుందో ప్రభుత్వ లెక్కలు సైతం రికార్డుల్లో భద్రంగా ఉంటే కొన్ని వర్గాలు దళితుల మీదకు ఉసిగొలుపుతూ పబ్బంగడుపు కుంటున్నారు. భూస్వామ్య కులాలు, మరియు బ్రాహ్మణ – వైశ్య వర్గాలలో పేదరికం వుంది, ఆర్ధికంగా చితికిపోతున్నాం అందుకు రిజర్వేషన్లు, దళిత , ఆదివాసీలకు ఇచ్చే ప్రత్యేక ఆర్ధిక సదుపాయాలు అనే భ్రమ నుండి బయటపడలేక  ఆ వర్గాలు కుడితిలో పడ్డా ఎలుక లాగా కొట్టు మిట్టాడుతున్నాయి. 

భారత ఆర్ధిక వ్యవస్థ నిర్వీర్యం కావడానికి రిజర్వేషన్లకు ఏమైనా సంభందం ఉందా? భారత అగ్రకుల కార్పొరేట్ వ్యవస్థ పతనానికి రిజర్వేషన్లకు ఏమైనా సంభందం ఉందా? మెరిట్ అభ్యర్థులను కాలేజీ ప్రాంగణం నుండే సెలెక్ట్ చేసుకుని  10 నుండి 15 సంవత్సరాల కాలంలో దివాళా తీయడానికి కారణం దళిత, ఆదివాసీలా? 

భారత ఆర్ధిక వ్యవస్థ పాదరసంలా జారిపోవడానికి భారత కుల వ్యవస్థకి సంభంధం వుంది. అందుకే ఒకవైపు మేము పేదలం అంటూనే కులాన్ని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు నిచ్చెన మెట్ల కుల వయ్వస్థలో పైన వున్న కులాలు. 

Also read  'యువక' కలేకూరి ప్రసాద్!

భాజపా ప్రభుత్వం వీరి యొక్క బలహీనతలు గ్రహించి అధికారం కోసం ఎస్సి / ఎస్టి ల మీద అరాచక వ్యవస్థను సృష్టించి మత కోణం జోడించి వారి మీద దాడులకు పాలపడుతున్నారు. 

భారత సమాజాన్ని పూర్తిగా బ్రాహ్మణ మత వ్యవస్థ చేతుల్లోకి తీసుకోవడానికి సంఘ్ పరివార్ శక్తులు కుట్రలు చేసాయి. అందులో భాగంగా ఎస్సి లకు , ఆదివాసీలకు రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రత్యేక హక్కులను హరించడం ఆర్ ఎస్ ఎస్ – భాజపా ప్రభుత్వం యొక్క తుదపరి ప్రణాళిక. 

రాజ్యాంగం లోని ఆర్టికల్ 25, 26, 27, 28 ద్వారా సంక్రమించిన మత స్వేచ్ఛ హక్కును రద్దు చెయ్యడం ద్వారా మైనారిటి మతాల ను అణిచివేసే చర్యకు మోడి ప్రభుత్వం ఈ నాలుగేళ్ళ లో ఏదో ఒకరోజు దిగవచ్చు. 

మైనారిటి లను, దళితులను అణిచివేయడం అనే మనువాద ఫాసిస్టు చర్య ఈ దేశంలో చాలా మంది కి సంతోషదాయకమైన చర్య. కారణం వారి యొక్క ఆర్ధిక దివాళాకు ఈ వర్గాలే కారణం అనుకుంటున్నారు. 

21 వ శతాబ్దం లో ఎస్సి లు, ఆదివాసీ లు మరియు మైనారిటి ప్రజలు విద్యా, ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్లడం పెత్తందారి వ్యవస్థకు సుతారం ఇష్టం లేదు. అందుచేత ఆ వర్గాలు ఏదోఒక విధంగా దళితులను, మైనారిటి లను అణిచివేసే కుట్రకు పాల్పడుతున్నారు. 

సహజంగా ఆర్ ఎస్ ఎస్ లాంటి హిందూ సంఘాలు ప్రజల సమానత్వాన్ని, సౌబ్రాతత్వాన్ని కోరుకోరు.  మఠాలు, పీఠాధిపతులు వర్ణ వ్యవస్థ బలంగా ఉండాలని కోరుకుంటారు. వీటికి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ వారసులు వ్యతిరేకంగనుక రాజ్యాంగ వ్యవస్థ ద్వారానే బలహీన పరచాలని ఆలోచనలో వున్నారు? 

భారత సమాజం పేదరికం లో మగ్గడానికి మొదట మత / కుల వ్యవస్థ మొదటి కారణం అయితే  ఏడు దశాబ్దాలు స్వాతంత్రం వచ్చిన  స్వపరిపాలన లో కూడా పేదరికం విలయతాండవం చెయ్యడానికి కారణం అదే మత / కుల వ్యవస్థనే కారణం. 

Also read  ఆధిపత్య సంక్షేమ సంఘమే ఆలిండియా  ఈక్వాలిటీ ఫోరం!

టాటా లు, బిర్లా లు ప్రారంభించిన కంపెనీలు సైతం వేల కోట్ల రూపాయిల నష్టాల్లో ఉండటానికి కేవలం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఆ కంపెనీల పాలనా వ్యవస్థ లో లోపాలు. వీరికి లక్షల కోట్లు ఉద్దీపనాలు ఇస్తున్నప్పుడు ఈ దేశానికి పట్టుకొమ్మలు లాంటి దళిత వర్గాల పట్ల కుట్రలు చెయ్యడం భారత ఆర్ధిక వ్యవస్థ పతనావ్యవస్థకు దారి తీసే పరిస్థితులకు నిదర్శనం. 

ఇప్పటికైనా సాటి ప్రజల పట్ల సోదరభావం తో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తూ స్వేచ్ఛ, సౌభ్రాతత్వం ను ప్రజలు అలవాటు చేసుకుంటే పాలకుల కుట్రలు తేలిపోతాయి. భారత ఆర్ధిక వ్యవస్థ  దిగజారకుండా కాపాడుగోగలుగుతాం. 

ప్రజలు మతం పట్ల , కులం పట్ల మూఢ విశ్వాసాలతో ఉంటే పాలకులు వాటినే ఎరగా వేసి వారికి కావాల్సిన వారికి దేశ సంపదను దోచిపెడతారు. అంబాని , అదానీ లాంటి వారే లక్షల కోట్లకు పడగలెత్తుతారు. 

భారత ఆర్ధిక వ్యవస్థ  ప్రతి ఒక్కరిది, ఏ కొందరి జేబుల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. లేదంటే భవిషత్ లో ఆర్ధిక సంక్షభంతో వీధుల్లో బట్టలు లేకుండా ప్రదర్శన చెయ్యాల్సి ఉంటుంది. 

(Visited 1 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!