దోపిడీ వర్గాల వ్యక్తి పూజ బహిష్కరించాలి

షేర్ చెయ్యండి

 ఒక పెద్ద మనిషికి ప్రజల స్వాతంత్రాలను అప్పగించకూడదు. సంస్థకు అతీతమైన అధికారాలను అతనికి కట్టబెట్టకూడదు. ఇంకో మాటలో చెప్పాలంటే వ్యక్తి పూజ కూడదు. 

తన విలక్షణమైన శైలిలో చెప్పుతూ మతంలో భక్తి అనేది ఆత్మవిముక్తి పొందటానికి మార్గం కావచ్చు కానీ రాజకీయాలలో భక్తి లేదా వ్యక్తి పూజ జాతి అధోగతికి తద్వారా నియంతృత్వానికి సూటైనదారని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఉద్గాటించారు”

ఇదే విషయాన్ని ఆసియా ఖండానికి వెలుగును చూపిన గౌతమ బుద్ధుడు ఏసుకు పూర్వం 600 వందల సంవత్సరాల నాడే చెప్పియున్నాడు. 

కొన్ని దశాబ్దాల అనుభవం తర్వాత భారత ప్రజలు ఈ సూత్రాన్ని అర్ధం చేసుకోగలిగినట్లు గా కనిపిస్తున్నారు. దీన్ని ఆచరణలోకి తేవడానికి ఉద్యుక్తులవుతున్నారు. తమ నాయకుడిని హీరోగా చూసే లక్షణం నుండి బయటపడుతున్నట్లుగానే కనిపిస్తున్నారు – బాబాసాహెబ్ డా అంబేడ్కర్. 

వ్యక్తి పూజ వల్ల ప్రజలు తమ హక్కులకై తామే పోరాడాలనే చైతన్యం మందగిస్తుంది. అలాగే హీరోయిజం విధానం కూడా టెర్రరిజం గా మారి ప్రజలు తమ కర్తవ్యాన్ని గుర్తించకుండ చేస్తుంది. 

“వ్యక్తి పూజ, హీరోయిజం, విగ్రహారాధన వంటివి భూస్వామ్య దోపిడీ వర్గాల సిద్ధాంతం. వీటిని పూర్తిగా వ్యతిరేకించాలి”
ప్రజలు సాగించే ఉద్యమలోనికిగాని, విప్లవాలలోనికి గాని కొందరు వ్యక్తులు వస్తారు, పోతారు వారు నిత్యంకాదు. ప్రజలే నిత్యం, వారి నుండి వచ్చే స్పందనే సత్యం. ప్రజల సమస్యలను ప్రజల నుండే నేర్చుకోవాలి. 

Also read  IAS officer without UPSC? Call of the upper castes by the back door!

డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు చెప్పినట్లు నేడు రాజ్యాంగ యంత్రాంగం అంటా వున్నత ఉద్యోగులు, బ్యూరోక్రసీ, వున్నత పదవులలో ఉన్న ప్రజాప్రతినిధుల నియంతృత్వంలో కొనసాగుతుంది. 

డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లే ఒక సందర్భంలో కార్ల్ మార్క్స్ ఇలా అన్నారు. ” నన్ను చికాకు పరచిన ప్రణాళిక పత్రాలను ప్రచారంలో ఉన్న నేనెప్పుడూ అనుమతించలేదు. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి మందలించడం తప్ప వాటికెన్నడూ సమాధానం చెప్పలేదు. 

ఏంగిల్స్, “నేను కమ్యూనిస్టు సొసైటీలో రహస్య సంస్థలో సభ్యులుగా మొదటిసారి చేరినప్పుడు అధికారంలో వున్నవారే గొప్పవారని మూఢనమ్మకాన్ని ప్రోత్సహించే అంశాన్ని తమ నిబంధనల నుండి తొలగించాలని షరతు పెట్టాం.”
తరువాత కాలంలో కార్ల మర్క్స్ నియంతృత్వం గురించి ప్రజాస్వామం గురించి ఏంతో వివరణలిచ్చారు. చివరకు అయన చెప్పిందేమంటే శ్రామికుల శ్రమశక్తి దోపిడీ కోసమే నియంతృత్వం పుట్టిందని అన్నారు. 

రష్యా, చైనా సోషలిస్టు రాజ్యాలలో ఆర్ధిక పరిణామాలు పెద్దఎత్తున జరిగినప్పటికి సాఘిక సంస్కరణలు పాత ధోరణిలోనే ఉండిపోయినాయి. ఆర్ధిక సంస్కరణలు జరిగినంత వేగంగా సాంఘిక మార్పు జరగడం కష్టం. 

ఈ ప్రమాదాన్ని గుర్తించి చైనా లో మావో సాంస్కృతిక విప్లవాన్ని చేపట్టాడు. ఒక సాంస్కృతిక విప్లవంతో చాలదు. విప్లవం తరువాత మరో విప్లవం చప్పున వెయ్యి సాంస్కృతిక విప్లవాలు జరగాల్సి వుంటుందని సోషలిస్టు వ్యవస్థ పరిపూర్ణం చెందుతుందని మావో వెల్లడించాడు. 

సాంస్కృతిక విప్లవం అంటే ఒక్క వాక్యంలో చెప్పాలంటే పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత కట్టుబాట్లు అంతరించేలాగా సమాజన్ని తీర్చిదిద్దాలి. 

పాత భావాల స్థానాల్లో కొత్త బావాలు ప్రవేశపెట్టాలి. అదే “నూతన ప్రజాస్వామ్యం అంటే” గతం నాస్తీ గతం తిరిగి రాదు. అయితే గతాన్ని గమనంలోనే ఉంచుకుంటాం. వర్తమాన కాలమే వాస్తవం. 

Also read  Fascism has no place in democracy!

అంతేగాక నాయకుల జన్మదినాలు పార్టీ తరుపున గానీ ప్రభుత్వం తరుపున గాని జరగరాదని సాంస్కృతిక విప్లవం చాటి చెప్పింది. 

నాయకత్వంలో వున్న సభ్యులకిచ్చే ప్రచారం వాస్తవంగా ఉండాలి. వారిని సూత్ర రహితంగా, గొప్పగా పొగడరాదు. దోపిడీ వర్గాలకు చెందిన ముఖస్తుతి పూర్వక పదజాలంతో కార్మిక వర్గ నాయకులను ప్రశంసించడమే అనుమతించరాదు. 

వ్యక్తుల పాత్ర సమాజంలో ఒక భాగమే. సమాజం నుండి ప్రజల పరిస్థితుల నుండి పుట్టిన భావాలే వ్యక్తులకు పుట్టుకొస్తాయి. అంతేగాని వ్యక్తులకు ప్రత్యేకించి పై నుండి బావాలు పుట్టుకు రావు. 

మన దేశంలో కూడా బ్రాహ్మణిజం  అగ్రకులాల ద్వారా అణిచివేయబడ్డ నిమ్న కులాలు, గిరిజనులు వారి అంటరానితనం నుండి వారి బానిస బ్రతుకుల నుండి వారి కష్ట నష్టాల నుండి డా బాబాసాహెబ్ అంబేడ్కర్ పుట్టుకొచ్చారు. 

ఆనాటి కులవ్యవస్థలోని దుర్మార్గాల నుండి అంబేడ్కర్ భావజాలం పుట్టుకొచ్చింది. దళితులకు కుల వ్యవస్థ లేకపోతే అంబేడ్కర్ భావజాలం పుట్టుకరాదు. 

మావో శ్రామిక వర్గానికి, మేధావి వర్గాన్ని సమైక్య చెయ్యాలనుకున్నాడు. మేధోశ్రమ, శారీరశ్రమ రెండూ అవసరమే.  వీటిలో ఏదీ గొప్పది కాదు. 

Also read  అంతర్జాల పోకిరీలు!

ప్రజలు జీవితావసర ఉద్యమాలకు శరీర శ్రమ, మేధో శ్రమ  రెండూ అవసరమే. వీటిలో ఏది లేకపోయినా మానవ సమాజం మనజాలదు. 

ఈ సందర్భంలో బుద్ధుడు చెప్పిన మరో ఉదాహరణ చూద్దాం. “ఒక గొప్ప మేధావి కంటే పది మంది మూర్ఖుల సంఘమమే ఉత్తమం” మేధావి ఒక కోణం నుండి చూడగలిగితే పదిమంది మూర్ఖులు పది కోణాల నుండి వచ్చే భావజాలం మరింత పెద్ద రాశిగా ఉంటుంది. కనుక సంఘం, శరణం, గచ్చామి అన్నాడు బుద్ధుడు. 

అందుచేతనే ప్రస్తుత సమాజాన్ని నేటి ప్రజాస్వామ్యంలో విద్య ఉన్నవాడికి ఒకచోట, విద్యలేని వాడికి ఒకచోట దీన్నిబట్టి వ్యక్తుల గొప్పదనం చెల్లదని బుద్ధుడు ఏనాడో చెప్పడం ఆచ్చర్యంగా ఉంది. సమాజం అన్నా, సంఘం అన్నా అర్ధం ఒక్కటే. 

ప్రపంచంలో జరిగిన తిరుగుబాట్లు, విప్లవాలు పరిణామం వగైరాలు అన్నీ సామాన్య బానిసల నుండి జరిగినవే. 
రష్యా, చైనా విప్లవాలు నిరక్షరాస్యులైన ప్రజల నుండే విజయవంతం అయ్యాయి. 

సేకరణ:భూపతి నారాయణమూర్తి గారికి కృతజ్ఞలతో  

(Visited 18 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!