వినాయక చవితి: చిందులేస్తున్న దళిత యువత!

షేర్ చెయ్యండి

ఆగస్టు మాసం వచ్చిందంటే వినాయక చవితి  మండపాల సందడి తెలిసిందే. గ్రామ, గ్రామాన ఎగబాకిన ఈ నయా సంస్కృతి ఎస్సి, ఎస్టి మరియు బిసి యువకుల మానసిక స్థితిని తెలియజేస్తుంది. 

వినాయక చవితి  నవరాత్రుల పేరిట జరిగే తంతులో తాగి తందానాలు ఆడేది ఎక్కువగా బహుజనులు. ఏ గ్రామం చూసిన ఈ వర్గాల పిల్లలే గణేష్ నిమజ్జనం లో చొక్కాలు విప్పుకుని డాన్స్ లు చేసేది వీళ్ళే. 

నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో పైన ఉన్న ఏ ఇతర వర్ణం యువత ఆలా రోడ్లు మీద తాగి డాన్సు లు వేయడం మనం చూసి ఉండము. 

దేవుడు ప్రతినిధి వర్గం మేమే అనుకునే ఏ బ్రాహ్మణ వర్గం అయినా , లేదా ఆ వర్గానికి కొమ్ముకాసే వైశ్య , క్షత్రియ కులాల యువత తాగి రోడ్ల మీద చిందులు వేయరు. 

దేవుడు గుడికి వస్తే  మైల / అంటూ అంటూ చెప్పే ఈ పూజారి వర్గం వారి తాబేదారులు ఆ దేవుడి ఊరేగింపుకు డప్పులు కొట్టే , చిందులు వేసే వారు మాత్రం ఎస్సి లు కావాలి, శూద్రులు కావాలి, మంగలోళ్లు , చాకలోళ్లు ,  గొల్ల తదితర బిసి లు కావాలి.  
హిందు కుల వ్యవస్థ యొక్క ధర్మం / నీతి ఇదే. అందుకే. దీనికే కుల వ్యవస్థ కావలి, వర్ణ వ్యవస్థ కావలి. కుల వృత్తుల పేరిట పై కులాలకు ఊడిగం చెయ్యాలి. 

ఇది నేను కేవలం రాస్తుంది SC/ST/BC యువత కోసం మాత్రమే.ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఈ దేశంలో అరకొర బతుకులు లాగుతున్న తలిదండ్రులున్న పిల్లల కోసం మాత్రమే.

మా ధర్మాన్ని మేం పాటించ కూడదా అని నన్ను తిట్టుకోండి. పర్వాలేదు.కానీ మీ బతుకులను ఇలా నిర్వీర్యం చేసుకోకండి. ప్రసాధాల కోసం ప్రభల వెంట పరుగులు తీసే..మద్య తరగతి తలిదండ్రులు కూడా ఆలోచించాలి. వాళ్ల పిల్లల తరవాతి భవిష్యత్ ఏమిటని?

Also read  ఎస్సి, ఎస్టీ లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు వ్యతిరేకించడం రాజ్యాంగ ప్రాధమిక హక్కును హరించడమే!

ఇక్కడ సాంప్రదాయ వాదులూ, వాటి వెనుకున్న మేధావులూ/ఈ దేశ ప్రతిభావంతులకు కూడా నేనొక హెచ్చరిక చేస్తున్నా! ఏ దేశపు మానవ వనరులను వ్యర్ధపర్చుకునే ఏ ప్రతిభ అయినా ఆ దేశానికి విషమంత హానికరం.

అది దేశాన్ని క్రమేణా మింగేస్తుంది.ఆ దేశ జవసత్వాలను కుంగదీస్తుంది.చివరాకరికి మీ ప్రతిభ ఏలేది నిర్జీవపు జనాలనే. ఆలోచన లేని సమూహం ఏదో ఒక రోజు అజ్ఞానంలో చిద్రమౌతుంది.

గత వారం రోజులనుండీ చూస్తున్నాం, మా చిన్నప్పుడు ఊసుకు కూడా లేని వినాయక చవితి  పై భక్తి ఈ కాలానికి తారా స్థాయికి చేరుకుంది.అందులో శ్రామికులుగా ఎవరున్నారు? (భక్తి కార్మిక వర్గం అంటానేను. భక్తి యాజమాన్యానికి బంట్రోతులు వీళ్లు).

నా మాట తీరో మరి వాళ్లలో ఎక్కడో నిభిడీకృతంగా ఉన్న వెలికి పెగలని జ్ఞానపు నిస్సహాయతో నిన్న ఒక ఊరేగింపు ను కొంత చేపు లైటింగ్ ఇబ్బందితో ఆపినపుడు,కొందరు కుర్రాళ్లని అడిగినపుడు వాళ్లు చాలా ఓపిగ్గా సమాదానాలు చెప్పారు.

నా పక్కన నా ఫ్రెండ్ ఎందుకు సార్ వాళ్ల ఆ ఊపులో కొట్టినా కొట్టేస్తారు అని ఆపుతున్నా ఒక పావుగంట చిన్న పాటి చర్చ చేసాం. ఆ కుర్రాళ్లలొ ఒక్కరైన బ్రహ్మణులూ/వైశ్యులూ/రాజులూ ఉన్నారా? నా మొదటి ప్రశ్నలేరు సమాదానం వారి నుండి.

అలా చొక్కాలూడదీసి చిందులేస్తున్న వారిలో కొత్తగా ఆ పెద్ద కులాలైన వారెవరైనా ఉన్నారా? లేరు, నా రెండో ప్రశ్నకు సమాదానం. గమనిస్తే వాళ్లంతా ముందు వరసలో గంభీరంగా ముఖాలు పెట్టుకును ఆ వయసు నుండే ఆధిపత్యాన్ని ముఖాలకు పులుముకుని ఆ కార్య క్రమాన్ని నడుపుతున్నారు. రాబోయే కాలానికి కాబోయే నేతలు తొణికిసలాడుతున్నారు.

ఇక వీళ్ల చదువులు, ఈ చిందులేసే కుర్రాళ్లందరూ ఎక్కువ శాతంBC లు ఆ తరవాత SC/ST లు ఉన్నారని చెప్పుకొచ్చారు. మరి SC MLA వస్తే మైలపడే దేముడు వీళ్ల చిందులనేలా ఆక్సెప్ట్ చేస్తాడు ? అనడిగిన ప్రశ్నకు..అయ్యో ఆ డప్పు కళాకారులందరూ SC ల అండీ.

Also read  డిజిటల్ దళితులు-సోషల్ మీడియా దళితుల రాజకీయ అవకాశాలను పెంచుతుందా

దాని ముందు బజన చేసె వాళ్లను తెనాలి మండలం  నుండి వచ్చారు వాళ్లంతా SC లే అని చెప్పాడు ఒక BC కుర్రాడు ఇంజనీరింగ్ లో 6 సబ్జెక్ట్స్ మిగిలున్నాయంట తనని ఒక సారి ఆఫీస్ కు వచ్చి కలవమన్నా ఎలా పాస్ కావాలో గైడెన్సు ఇస్తానంటే రేపే వస్తా అన్నాడు.

మొత్తానికి చూస్తే ఈ పిల్లలంతా చదువులు అబ్బక, అంటే వాటి మీద శ్రద్ద పెంచే ఇంటి వాతావరణం లేక, ఆర్ధిక వనరులు సరిపోయినంతగా లేక/అందనీయని సామాజిక పోకడలో వ్యర్ధులైన యువత కాలక్షేపం కోసం తమలో ఉన్న అసంతృప్తిని కొంత బైటకు ఇలా చిందులేస్తూ వెళ్ల గక్కడం కోసం మాత్రమే వస్తున్నట్టు అర్ధం అయ్యింది.

వీళ్లలో భక్తి పాత్రకంటే మానసిక ఉపశమనం కాస్త పొందే ధైన్యత కనిపిస్తుంది. ఇంట్లో డబ్బులిచ్చి తాగమని చెప్పరు.ఇక్కడ ఊరేగింపుకు ముందో, నిమజ్జనం తరవాతో మధ్యాన్ని పంచుతారని ఇంకో అరకొర మార్కులతో చదువు కంప్లీట్ అయిన 23 ఏళ్ల బాబు అనే అబ్బాయి చెప్పాడు.

అయితే మరి భక్తి సంగతేంటీ? అనడిగా? సార్ మీకన్నీ తెలుసు మళ్లీ మా చేత ఎందుకు సార్ చెప్పిస్తారు. భక్తంటే ఇది కాదు సార్. శుద్దంగా కూర్చుని మనస్సు నిగ్రహంగా చేసుకుని ఏకాంతంలో ధ్యానం చెయ్యడం.

ఇలా చెమటలు కక్కు కుంటూ మందుకొడుతూ చిందులెయ్యమని ఎవరు చెప్పారు సార్ అని ఒక ఇంజనీరింగ్ ఫైనలీయర్ చదూతున్న వెంకటెష్ చెప్పాడు, ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది!

మామూలుగా మనం అనుకునేది యువతలో భక్తి వెర్రి తలలేసి ఇలా చేస్తున్నారని. కాదు పేద వర్గాలు తమలోని అసంతృప్తిని చల్లార్చుకోడానికి ధనిక సామ్యం ఇలా అవకశాలను కల్పిస్తుంది.

దీని తరవాత ఇంకో నవరాతృలు వస్తాయి,ఆ తరవాత అనేక దీక్షలూ ఇస్తారు. ఆతరవాత ఇంకోటి, ఇంకోటి, మొత్తానికి సినిమా, క్రికెట్ తో సహా ఈ దేశ యువ శక్తిని వారి శక్తి సామర్ధ్యాలనీ నిర్వీర్యం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్న ఈ సంపన్న సాంప్రదాయ వాధులు నడుపుకుంటున్న వ్యవహారం బెడిసికొడితే ఎంత ప్రమాధం ఈ సంఘానికి?

Also read  స్వాతంత్రదినోత్సవం: చరిత్ర పునరావృతం అవుతుందా!

ఈ దేశంలోని మొత్తం మానవ వనరుల్లో 45%( రీసెంట్ సర్వే) యువతరం ఉంది ఈ స్థితి ప్రపంచంలోని ఏ దేశానికీ లేదు. దీనిని ప్రాపర్ గా ఉపయోగించుకునే శక్తి ఈ దేశ ప్రతిభావంతులకు లేదు కదు. వాడడానికి ఇష్టపడని వ్యవస్తకు వారు భానిసలు.ఈ దేశ ప్రతిభావంతులంతా తామెక్కిన గుర్రాన్ని ఎక్కడ దిగాల్చి వస్తుందో అని నిత్యం భయపడుతు కొత్త కొత్త ఎత్తుగడలతో యువతరాన్ని నిర్వీర్యం చేస్తుంది.చేసుకుంటూ పోతుంది. గ్రేట్ ఇండియా!

మధ్య తరగతి తలిదండ్రులకు ఇవి అర్ధం కావు అనడం కన్నా వీళ్లకు అలా ఆలోచించే టైం ఉండదు. కానీ యువత మనం చెబితే ఇనగలిగే స్తాయిని ఇంకా దాటిపోలేదు. చెప్పే వారే లేరు. చెప్పే భాధ్యత ఉన్న వారిపై సాంప్రదాయ వాధులు మూఢత్వం ఉన్న వారిచేత దాడులు చేయిస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారు.

అలా అని చెప్పి వారు బావుకునేదేం లేదు.  జష్ట్ వారి ఆధిపత్యం కొనసాగడం కోసం మాత్రమే. ఇదంతా బహుళ జాతులకు అవసరమైన చీప్ లేబర్ దొరికే ఒక అవకాశాన్ని కలిగిస్తుంది.

40 ఏళ్లు దాటితే వాళ్లను తొలిగించి 24 ఏళ్ల వాళ్ల యవ్వన కాలాన్ని దోసుకునే రాబందులకు మనలాంటి సమాజం చాలా అవసరం.

బహుపరాక్…యువతరమా బవిష్య భారతం మీది..ఆలోచించుకోండి.

–>>తిక్త 👁

(Visited 359 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!