ఆంగ్ల మాధ్యమంలో బోధన…తెలుగు గగ్గోలు!

షేర్ చెయ్యండి

ఆంగ్ల మాధ్యమం లో విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విధ్యా సంవత్సరం నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెడుతుంది. ముఖ్యమంత్రి వై. యెస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రకటన మీద మెజారిటి ప్రజలు స్వాగతిస్తున్నారు. 

తెలుగు భాష అభిమానం పేరుతొ విధ్యా వ్యాపారం చేసే కొందరు మరియు వారి తాబేదారులు లాంటి కొన్ని సంఘాలు, వ్యక్తులు ప్రభుత్వ పాఠశాల లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం ఈ నిర్ణయంతో ఒకేసారి తెలుగు భాష ప్రేమికులకు కొత్తగా భాష మీద ప్రేమ పుట్టుకొచ్చింది.ఈ భాషా ప్రేమికులు వ్యక్తపరచే భావాలను (మాటలను) అనుసరించిన దాఖలాలు లేవు.

ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తే తెలుగు భాష భూ మండలం మీద డైనోసార్స్ (రాకస బల్లులు) అంతరించినట్లు అంతరించిపోతుందని ఒకటే బాధ పడిపోతున్నారు. భాషలు బోధనా మాధ్యమాలు కానంత మాత్రాన అంతరించిపోతాయా ?

భాషలు బోధనా మధ్యమాలు అయినంత మాత్రనా వికసిస్తాయా? ఆదివాసీలు మాట్లాడే చాలా భాషలు వేల సంవత్సరాలనుండి సజీవంగా వున్నాయి.వాటికి ప్రభుత్వాలు ప్రోత్సాకాలు యిచ్చినట్లు కాని లేకపోతే ఆ భాష మాట్లాడే ఆదివాసీలందరూ ఆయా భాష మహాసభలు జరిపినట్లు కాని చూడం.

ఆదివాసీ భాషలు మాట్లాడే వారు మన తెలుగు మాట్లాడే వారిలాగా కోట్లలో కూడా వుండరు .వేల మంది మాట్లాడే ఆదివాసీ భాషలే సజీవంగా వున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 20 కోట్ల మంది మాట్లడే భాష అంతరించిపోతుందా!

Also read  మదుర మీనాక్షి ఆలయంలో దళితులు అడుగుపెట్టినప్పుడు ఏమైందంటే...?

లిపిలేని భాషలే వేల సంవత్సారాల నుండి ఉనికిలో వుంటున్నాయి .కొన్ని వేరె భాషల లిపిని ఉపయోగించుకొని భాష రాజసం వెలగపెడుతూ వుంటాయి .అందులో పెద్దన్నయ్య సంస్కృతం.

ఏ భాషలోకైనా ప్రవేశించి ఆ భాష నానుండే వచ్చిందనే వాగుడుకాయ భాష సంస్కృతం.భారత దేశంలో ఏ ఇద్దరూ కలసి మాట్లాడని భాష సంస్కృతం, చివరికి ఆ సంస్కృత భాష బోధించే పండితులు కూడా వారి రోజువారి సంభాషణలలో కూడా వాడరు.

ఏ ఇద్దరూ కూడా సంభాషణ చేయని భాషను మృత భాషగా నిర్ణయించాలి . మరి అలాంటి భాష ద్వారా వార్తలు కూడా ప్రసారం చేస్తున్నారు.అంటే భాషలనేవి కేవలం భాషలే కాదు వాటి వెనుక అధిపత్యాలుంటాయి.

మన తెలుగులోనే అనేక యాసలుంటాయి .వాడు మాట్లాడే యాసే అసలైనా తెలుగని భావించే ప్రబుద్దులున్నారు. మిగతావారు మాట్లాడే యాసను అవహేళన చేయటం, కొన్ని సమూహాలు మాట్లాడే పదాలను అవహేళన చేయటం, ఆ సమూహాలకు భాషా శుద్ది లేదనడం , ఇవన్నీ అధిపత్యం లో భాగాలే.ఈ అధిపత్య భావజాలంగల మేధావుల సమూహాల నుండే తెలుగు గగ్గోలు మొదలైంది.

మాతృభాషతో అవినాభావ సంబంధం అనేది బలవంతాన ఒకరు విడదీస్తే విడిపోయేదికాదు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగినంత మాత్రాన మన తెలుగుతో మన పేగు బంధమేమి తెగిపోదు.ఇప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఏ విధమైనా పోత్సాహకాలైనా ప్రభుత్వాలు యిచ్చాయా?

Also read  నాగబాబు: నిజం చెప్పలేని బయోపిక్స్ వద్దు!

లేకపోతే వాటి కొరకు ఈ భాషా ప్రేమికులైనా ఉద్యమాలు చేసారా? భాష మీద ప్రేమ వుంటే సరిపోదు మనం జీవనం సాగించడానికి ఆ భాష కనీసం మన ప్రాంతాలలో నైనా మనకు ఉపయోగపడుతుందా అనేదే అసలు ప్రశ్న .

పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉద్యోగాలలో మొదట ప్రాధాన్యత అని ఏ ప్రభుత్వమైనా ప్రకటించిందా? ప్రభుత్వాలే తమ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆంగ్లంలో జరుపుతున్నాయి. ఆంగ్లంలో మాట్లాడే వారికున్న గుర్తింపు గౌరవాన్ని మనం కాదనగలమా?

బయట ప్రపంచంలో జరిగే మార్పులను స్పష్టంగా అవగాహన చేసుకోవాలి.మన భాష ఎంత గొప్పదైనా ప్రపంచ విపణిలో మనం నిలబడటానికీ ఏం అవసరమో తెలుసుకొని వాటిలో తర్ఫీదు పొందటం అనేది తక్షణ అవసరం. ఆ తక్షణ అవసరం ఇప్పుడు ఆంగ్లం. ఆంగ్లంలో నీవు భావాన్నీ ఎంత తొందరగా వ్యక్తపరస్తావో అనేదాని మీద ఉద్యోగం ఆధారపడివుంటుంది.

ఇప్పుడు ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగును తప్పనిసరి సబ్జక్టుగా చదవలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించే ప్రతి పోటి పరీక్ష లలో తెలుగు ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన కూడా పెట్టవచ్చు. ఇప్పటికే దాదాపు డిపార్ట్మెంట్ పెట్టే అంతర్గత పరీక్షలలో తెలుగు పరీక్ష లో అందరూ ఉత్తీరణత సాధించాల్సిందే.

Also read  ఎన్నికలు 2019: దళిత రాజకీయం - ఎన్నికలు

సరైనా వాతావరణం లేకపోతే కొత్తగా వచ్చే మాధ్యమం వలన పిల్లలు ఒత్తిడికి గురవుతారనే వాదనలో కూడా నిజముంది.ఐతే అదే వాతావరణం నుండే ప్రయివేటు స్కూల్ కు ఆంగ్ల మాధ్యమం కోసం తల్లిదండ్రులే తమ పిల్లలను పంపిస్తున్నారు.

అంటే ఇక్కడ బయట పరిస్థితులు ఏలా వున్నా స్కూల్ వాతావరణంలో కొన్ని మార్పులైతే తీసుకురావాలి.ఒత్తిడి గురవుతారనే ఒకే కారణంతో ఆంగ్ల మాధ్యమం దూరం పెట్టలేం.

అలాగే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం తో సరిపోలేదు. బోధనకు అవసరమైన ఆర్థిక, మేధోపరమైన వనరులను తక్షణం అందించవలసిన అవసరం వుంది.ఆంగ్లంను ఆహ్వానిద్దాం . ప్రభుత్వతీసుకున్న నిర్ణయం నూరు శాతం మన పిల్లలకు ఉపయోగపడేలా అందరూ కృషి చేయాలి.

వున్నవ వినయ్ కుమార్ // SPK

(Visited 1 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!