మానవహక్కులు:అమెరికాలోమానవహక్కులుఇండియా లో మానవ హక్కులు కాదా?

0
485
మానవ హక్కులు

మానవ హక్కులు; జయరాజ్ మరియు పేనిక్స్ ఇప్పుడు భారతీయ జార్జి ప్లాయిడ్ లు అంటే ఈ దేశానికి ఇలాంటివి కొత్త కాదు. అక్కడ రంగు, జాతి మాత్రమే తక్కువ. ఇక్కడ రంగు ఉన్నా కులం తక్కువ, మతం మైనారిటి అయితే చాలు ఆఫ్రికా అమెరికన్ జార్జి ప్లాయిడ్ కంటే ఘోరంగా హింసించి చంపుతారు. 


దక్షణాది రాష్ట్రాల ప్రజలకు ఇంగ్లిష్ రాదు, లోకల్ బాష లోనే చెబుతారు కాబట్టి దక్షణాది సమస్యలకు ఉత్తర భారతదేశం స్పందించదు అని పక్కకు తప్పుకునే వారికి రేడియో జాకీ సుచిత్ర తమ రాష్ట్రంలో జరిగిన ఒక అకృత్యాన్ని దేశ ముఖచిత్రం గా గీసే ప్రయత్నం చేసింది. 


అమెరికాలో జరిగితే మానవహక్కులు, ఇండియా లో జరిగితే మానవ హక్కులు కాదా?  

మానవ హక్కనే భావన,ప్రతి మనిషీ గౌరవార్హుడనే పాశ్చాత్య నైతిక విశ్వాసం తెచ్చింది.అది పొందని మనిషికి హక్కును తిరస్కరించినట్లే.పుట్టుక కారణంగా లభించే మానవ గౌరవాన్ని సామాజికం ఆయాచితంగా పొందుతున్న మనుషులు..పుట్టుక అభిజాత్యాలను వదులుకోడానికి ఇష్టపడదు.అది అన్ని సామాజిక నియంత్రణా వ్యవస్తల్లోకి జొరబడి అక్కడ దాని ఉనికిని కొనసాహిస్తుంది.

మానవ హక్కులను కాపాడే మొదటి ఆధునిక చట్టం ఐఖ్యరాజ్య సమితి చార్టర్ ద్వారా..రెండో ప్రపంచ యుద్దానంతరం జూన్ 26 1945 న శాన్ ప్రాన్స్ లో ప్రకటితమైంది.ఎన్నో వందల సంవత్సరాల హక్కూల కర్యకర్తల అనేకానేక పోరాటాల,త్యాగాల ద్వారా సంక్రమించిన ఈ అంతర్జాతీయ హక్కుల ప్రకటన ప్రపంచానికి 10 డిసెంబరు 1948 న అందజేయబడి ఆచరణ కొరకు సందేశంగా/ఆదేశంగా ఇవ్వబడింది.

దోపిడీ తత్వం ఏర్పర్చుకుని దాన్ని పామర జనంపై రుద్దిన అనేక అమానవీయమైన మానవ హననాలకు వ్యతిరేఖంగా చేసుకున్న ఏర్పాటులలో మాగ్నా కార్టా,ధామస్ పెయిన్ మానవహక్కుల ప్రకటనలు, ప్రపంచాన్ని మత నిర్మితమైన హక్కుల హననాలాను కర్మ సిద్దాంతాల వైపు నుండి మరల్చి మనిషి హక్కుల వైపు ఆలోచించేలా చేసాయి.

“మనిషిగా పుట్టిన వెంటనే అతనికి మానవ హక్కులు సంక్రమించి వర్తిస్తాయి”

దేశ నైతిక చట్టాల్లో చూపించే అసమానతలు..మనకు నిత్యం నిజ చట్టాల్లో(రాజ్యాంగ అమలు) ప్రతిఫలిస్తుంటాయి.ఎందుకంటే నైతికతా ధర్మం జన్మలను బట్టి మానవ హక్కుల్లో హెచ్చు,తగ్గులను ప్రకటించి ఆచరణలో పెడుతుంది.దానిని మీరినపుడు సామూహికంగా తీసుకునే ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది.ఎందుకంటే సఘటు సామాజికునికి సమాజ పరిసరం చేసిన మానసికం, తన జన్మ తన దిగువ జన్మ కన్నా ఉత్తమమైనదీ..ఇంకా తనపై నున్న జన్మ తనకన్నా ఉత్తమమైనదనే ఉన్మాదపూరితమైన నమ్మకాన్ని నిర్మిస్తుంది.

అందు వల్ల పైన చెప్పుకున్న ప్రపంచం ప్రకటించుకున్న మానవ హక్కు ప్రకటనలు..మన సమాజపు చెవికి ఎక్కనంటే ఎక్కవు.ఇంకా చెప్పాలంటే వాటిని ఇక్కడ అమలు పర్చేలోపు..దర్మాల ముసుగులు ఎగసిపడి ఆ ముసుగులో ఆ హక్కులను ధ్వంసం చేస్తూ ఉంటాయి..వాటిని అను నిత్యం మనం చూస్తూ ఉంటాము..వాటిపై మన స్పందన 90% వరకు నిర్లిప్త దశలోకి మనని తోసి వేస్తుంటాయి.

ప్రాదమిక అవసరాలను తీర్చుకునే హక్కునూ,రక్షణపొందే హక్కునూ,చివరికి జీవించే హక్కును కూడా తమ నుండి లాగివేయబడిన మానవ సమూహం నిత్యం తమలో తాము కలహించుకుంటూ..హక్కులను హరిస్తున్న వారి ప్రాపకం కోసం పాకులాడుతూ..వారి జీవించే హక్కు కోసం తన వారి హక్కులన్నింటినీ హరించడానికి సహకరిస్తూ మరబొమ్మలుగా కొనసాగుతూ ఉంటారు..ఇది మన దేశంలో BC,SC,ST వర్గాల్లో కనిపిస్తుంటుంది..గమనించాలి.దీనికి సామూహిక తత్వచింతన పెరగడం ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుంది.

ఇక్కడ ఈలాంటి వ్యవస్తపై చిన్న ప్రయత్నాలు చేసిన వారు సైతం విసిగిపోయి..ఈ సామూహిక ఐఖ్యాభావన ఒక మిధ్యలాగా..భ్రమలాగా అనేసుకుంటూ..ప్రకటించుకుంటూ..తమ తమ పబ్బం గడుపుకునే కొందరు గడుగ్గాయిలూ బయలు దేరతారు..వీరికి ప్రపంచంలో మానవ హక్కుల్లకై జరిగిన పోరాటాల రూపాలూ..ఓర్పులూ,సహనాలూ,,వందల ఏళ్లపాటు కొనసాగించిన ఐఖ్యతా నిర్మాణపు చరిత్రలూ పట్టవు..వచ్చిన అనేక మర్పులు మతుల్లోకి ఎక్కవు.సముద్రమంత చెయ్యాల్చిన చోట నీటిబొట్లు రాల్చి విసిగిపోవడం స్వర్ధపు చింతనౌతుంది..హక్కుల ద్రోహం అవుతుంది.

స్పార్టకస్ నుండీ మండేలా,మార్టిన్ లూధర్ కింగ్ వరకూ..పూలే నుండీ అంబేడ్కర్ వరకూ ఎవరు ఏ దశలో విసిగి వీళ్లు ఐఖ్యం కారని కాడె కింద దిగజార్చినా కనీసం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వేచ్చా ప్రకటనలూ..హక్కుల నినాదాలూ కర్మ దర్మాల మద్య కప్పివేయబడి..ఏ నాడో కనుమరుగైపొయ్యేవి…

ఇది పేపర్ వార్త చదివాక..

లాక్డౌన్ సమయాన్ని మించి అరగంట షాప్ ఓపెన్ చేసినందుకు..హక్కుగా తన కాలర్ పట్టి లాగిన పోలీసుని..ఒక సఘటు గొంతుపెగల్చిన ప్రశ్నకూ ప్రతిగా రెండు ప్రాణాలను హరించిన మన వ్యవస్తలోని వివిద రంగాల్లో ఇమిడిపోయిన జాత్యాహంకారపు నియంతా దోరణిని చూస్తూ కూడా మౌనాన్ని ఆశ్రయించిన అనేక సఘటుల బుద్ది మాంద్యాన్ని దృష్టిలోపెట్టుకుని నా వేధన.

అమెరికాలో ఒక నల్ల వ్యక్తి జీవించే హక్కుకోసం..వైట్ హౌస్ ను ప్రాణాంతక వ్యాధిని లక్ష్యపెట్తక ముట్తడించిన హక్కుల చైతన్యం..దానికి సానుభూతిగా ముఖపుస్తకపు గోడలనిండా కుండలకొద్దీ సానుభూతిని కుమ్మరించిన ఇదే దేశ వాసులు మౌనానికి విసిగిపోకుండా చిటికెడు చైతన్యాన్ని విదిలించాలని ఈ నా నాలుగు మటలు

–>>తిక్త👁

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here