జార్జి ఫ్లోయిడ్:అతను నిర్దోషి..అతనొక మనిషి..అతనొక అభివృద్ది పరికరం!

0
592
జార్జి ఫ్లోయిడ్

జార్జి ఫ్లోయిడ్; #BlackLivesMatter ఒక నిర్దోషి..ఒక మనిషి..ఒక దినసరి జీతగాడు,అధిపత్యపు మోకాలి కింద మెడ నలిగిపోతుంటే గొణిగినట్టు వేడుకుంటున్నాడు..అధికారానికి..అహంకారానికి..ఆలోచన చచ్చిన జాత్యాహానికి వినిపిస్తున్నా..నటిస్తుంది..ఘటికులను కొనసాగిస్తుంది.

ఊపిరాడ్డం లేదని మళ్లీ మళ్లీ అడుక్కుంటునాడు..దాహమేస్తుందన్ని దేహీ అనంటున్నాడు..ఇప్పుడు ప్రపంచం మొత్తం వింటుంది..అగ్ర శిఖరాన ఊరేగుతున్న హక్కుల దేశంలో..అణగారిపోతున్న ఆర్తనాధాన్ని..మృత్యువుకు ముందటి మెడ విరుగుతున్న ధ్వనిని..చీత్కరిస్తూ..మనిషి జ్ఞానాన్ని..మనదనుకుంటున్న జ్ఞాన సమాజాన్ని ధిక్కరిస్తూ..ఇప్పుడు ప్రపంచం అంతా ఆదృశ్యాలను కంటుంది..

అతను నిర్దోషి..అతనొక మనిషి..అతనొక అభివృద్ది పరికరం

అంతే కాదు అతోనక తండ్రి..ఇద్దరు ఆడపిల్లల ఆలన చూసే..భాధ్యతగల తండ్రి..46 ఏళ్ల జార్జి ఫ్లోయిడ్..రంగునలుపంతే..తెల్ల వాళ్ల తోలు తెలుపంతే..వాళ్లలాంటి కుటుంభ భాద్యతలనే మోస్తూ పనిచేసుకుంటున్నాడు..అతను మనిషే..మామూలు మనిషి..మామూలుకన్నా జాతుల అహంకార మతుల్లో కొంచెం తక్కువగా పేర్చుకున్న..నల్ల మనిషి..

అమెరికా అభివృద్దిలో అగ్రభాగం వారిదే నల్ల వాడిదే..వాడి చెయ్యి కదలని నాడు అగ్రత్వం కుప్ప కూలిపోతుంది..వాడి ఊపిరి తగలని నేల బీడుబారిపోతుంది.వాడు మినిషే..మామూలు మనిషే..మనిషి మనస్సు చీదర తీర్చుకునే మానసికానికి అవుసరమైన మనిషే..మనిషినని మర్చిపోయ్యిన వాడికి పెట్టుకున్న మోసపు పేరు బ్లాక్ డాగ్..

ఆ రెస్టారెంటు యజమాని గారి వాగ్మూలం ప్రకారం..జార్జి నిజాయితీగల పనివాడు..చిత్తచుద్దిగల కుటుంబ పోషకుడు..భాద్యతగల తండ్రి..అనామకుడేం కాదు..కానీ మరో ఒక అనామకుడు పోలీసులకిచ్చిన ఓ కంప్లైంట్ ప్రకారం 25 మే న..20$ దొంగనోటును ఇస్తూ దానికి ప్రతిగా ఆహరాన్ని కొన్నాడని..నిందను తీసుకుని..పోలీసులు అతని పెడరెక్కలు విరిసి బోర్లా పడుకోబెట్టారు..ఇదంతా కంప్లైంట్ ఇచ్చిన కొద్ది నిముషాల్లో జరిగిపోయింది..చట్టం అగ్ర దేశంలో ఎంత త్వరితగతిన పనిచేస్తుందో కదా..?!

పోలీస్ అధికారి డెర్క్..బోజనం చేస్తున్న వారిలోంచి జార్జ్ ని మెడబట్టి లాకుపొయ్యాడు..దానికి ప్రదాన కారణం..అతనిపై వచ్చిన ఒక సామాన్యపు అనుమానం..దొంగ 20$ నోటు వ్యవహారం..డెర్క్ తన ఎడమ మోకాలిని జార్జ్ మెడపై భలంగా వత్తుతున్నాడు..మిగిలిన వారి..అతను అనుభవిస్తున్న వేధననూ..చావుబతుకులమధ్య చెరిగిపోతున్న గీతనైనా గమనించకుండా ఎంకవైరీ ప్రశ్నలడుగుతున్నారు..జార్జ్ మొర మూలుగౌతున్నా ..అధికారపు చెవులు వినిపించుకోవడం లేదు..ఊపిరినందనీయనంతటి గొప్ప భాద్య్త..నల్ల వాళ్లపైనే ఉంటుందేమో..

ఇదంతా ఎనిమిదే ఎనిమిది నిముషాల్లో ముగిసిపోయింది..జార్జ్ విగత జీవిపుడు..8 నిముషాల ముందు ప్రాణమున్న జార్జి..మనిషికాదిపుడు..జార్జి ఒక సామాన్య హక్కును మొరపెట్తుకుంటూ చచ్చిన శవమిపుడు..జార్జ్ చూపు ప్రపంచాన్ని వెంటాడుతుందిపుడు..జార్జ్ దోషి కాదు..నిందితుడూ కాదు..జాత్యాహంకారానికి బలైన మామూలు మానవుడు..జార్చ్ ప్రపంచానికి విసిరిన పెద్ద ప్రశ్న ఇపుడు.

జార్జ్..మనకోసం వదిలేసిన ఊపిరాడని మహా సఫికేషన్..గొంతు పొడారుతున్న అధికారపు తడారిన తనం..లేడు జార్జ్..ఇపుడు జార్జ్ కాదు అమెరికన్ జన సామాన్యానికి జాగురూకత..జార్జ్ కదిలిస్తుంది మనిషిని..మనిషిలో మరుగుపడిన హృదయాన్ని..కరోనా కాలంలో ప్రాణాలను సైతం లక్ష్య పెట్టక పోరాటాన్ని చేస్తున్న అమెరికన్ విజ్ఞులకు సలాం..

జార్జ్..ఈదేశ అణగారిన వర్గాలకు ఇపుడు ఓ దిక్చూసి..ఓ చైతన్యం..ఆలోచనను పెంచుకోకపోతే..మామిడికాయలు కోసారని మామూలుగా చంపేసే మనుషులున్న చోట..మనం చూస్తున్న అనేకమంది జార్జ్ లు కనిపిస్తారు..వాళ్ల అమానుష చావులపై చలించని కుల సామ్యం కనిపిస్తుంటుంది..గౌరవ హత్యలు వేటాడుతూ వెంటబడి నరికి చంపుతుంటాయి..జార్జ్ కోసం జరుగుతున్న పోరాటం ఒక స్పూర్తి కావాలి..తిండిదగ్గరా..గుళ్ల దగ్గరా..పుట్టుకల పేర చిత్రహింసలుపెట్టి చంపుతున్న కుల హత్యల..వాడలపై దాడులు చేసే కులస్తులున్న సమాజానికి జార్జ్ ఉదంతం ఒక కనువిప్పు కావాలి..

జార్జ్.. ఇప్పుడు చచ్చిపొయ్యి ఉండొచ్చు..కానీ డెర్క్ జాత్యాహంకారం తలకెక్కిన నాడే చనిపోయ్యాడు.
వాడి పీనుగ రాజ్యానికి ఊడిగం చేస్తుంది..అంతే.

–>>తిక్త👁

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here