బుద్ధిజం: ఒకప్పటి బౌద్ధ శిల్పాలు, క్షేత్రాలే నేటి హిందు,ఇస్లాం, క్రైస్తవ  పుణ్యక్షేత్రాలు!

0
808
బుద్ధిజం

బుద్ధిజం, బుద్ధ భగవాన్ శిల్పాలు విభిన్న శైలి, ఆకృతి లో మనకి దర్శనం ఇస్తాయి. ఇటీవల అయోధ్య రామ జన్మభూమి లేదా బాబ్రీ మసీదు ప్రాంతం లో అయోధ్య రామడి ఆలయం నిర్మాణం కొరకు బాబ్రీ మసీదు శిధిలాలు తొలగిస్తుండగా బుద్ద శిల్పాలు, సంస్కృతి కి చెందిన అనేక రాతి శిల్పాలు బయటపడ్డాయి. 


ఎప్పటి నుండో భారతీయ బుద్ధిష్ట్ లు హిందూ దేవాలయాల నిర్మాణం బౌద్ధ ఆరామాల మీద నిర్మాణం జరిగినట్లు చేబు తున్నారు. అందుకు కావాల్సిన ఆర్కియాలజి, పురావస్తు శాఖ మరియు చరిత్ర ఉదాహారణలతో సహా చూపెట్టి ప్రకటన లు చేస్తున్నారు. 


వివాదాస్పదమైన రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం ఎన్ని రాజకీయ మార్పులకు కారణమైందో తెలిసింది. ఇప్పుడు బుద్ధిజం ప్రతిమలు బాబ్రీ మసీదు శిధిలాలు నుండి బయటపడటం బుద్ధిష్ట్ లు చేస్తున్న డిమాండ్ లకు సాక్ష్యాలు గా నిలబడుతున్నాయి. 


చైనా బుద్దిస్ట్ మాంక్, యాత్రికుడు ఫెక్సియాన్  తన భారతదేశం యాత్రలో అయోధ్య లో 100 అశోక స్తూపాలు ఉన్నట్లు తన పుస్తకంలో పేర్కొన్నాడు.
భారతదేశాన్ని మౌర్యల సంబ్రజ్యాన్ని కూలదోసి ఆక్రమించుకున్న పుష్య మిత్ర శృంగ నుండి బౌద్ధ ఆరామాలు, బౌద్ధ దేవతలు హిందువుల దేవీ దేవత రూపాలు గా మార్చినట్లు మనకి చరిత్ర చెబుతుంది. 


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని కి కూత వేటు దూరంలో ఉన్న అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం ఒకప్పటి బౌద్ధారామం అనటానికి ఎన్నో శిల్పాలు  సాక్ష్యాలు గా వున్నాయి. 


ఇది ఇలా ఉంటే జపాన్ కు చెందిన బుద్ధ శిల్పాలు, బౌద్ధ దేవీ దేవతల ప్రతిమలు చూస్తుంటే అచ్చం విష్ణు మూర్తి , వెంకటేశ్వర స్వామి రూపంలో పోలి ఉంటాయి. 


జపాన్ మొత్తం ప్రయాణిస్తే బూట్సుజో ఆరామాలలో బుద్ధ దేవుడి రూపాలు వారు బుద్ధుడిని వివిధ రూపాల్లో చేసి పూజించిన విధానం మనకు అర్ధం అవుతుంది. 


జపాన్ బుద్ధుడి రూపం బుద్ధిజం లో ఒక్కొక్క ఆరాధనకు ఒక్కొక్క రూపంగా మనకి కనిపిస్తుంది. అక్కడ కనిపించే రూపాలు బుద్దుడి బోధనల స్వరూపాలు మరియు జ్ఞానోదయానికి వ్యతిరేకంగా ఉన్న అడ్డంకులను అధికమించడానికి బుద్దిస్ట్ కు అవి బుద్ధి, కరుణ, నిగ్రహం, మరియు రక్షణ పొందటానికి సహాయపడతాయి. 


బౌద్ధ విశ్వంలో నాలుగు ప్రధాన వర్గాలు ఉన్నాయి: బుద్ధులు , బోధిసత్వులు, జ్ఞాన రాజులు, మరియు ఖగోళ జీవులు. 
జపనీస్ బౌద్ధ మతంలో ఉన్న లెక్కలేనన్ని జీవులలో, ప్రస్తుతం ఉన్న అనేక శిల్పాలు పురాతన మరియు భూస్వామ్య జపాన్ యొక్క కులీన మరియు లే బౌద్ధ వృత్తాలచే ప్రాచుర్యం పొందిన కొన్ని ఎంచుకున్న శిల్పాలను వర్ణిస్తాయి.

టోక్యో జాతీయ మ్యూజియం లో ఉన్న బుద్ధుడి శిల్పాలను చూస్తుంటే ఆది శంకరాచార్యుడు హిందూ మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎన్నో బౌద్ధ క్షేత్రాలు, శిల్పాలు కూలగొట్టి, వాటి పునాదుల మీద హిందూ మతాన్ని నిలబెట్టిన చరిత్ర వెలుగులోకి వస్తుంది. 


ప్రాచీనాంధ్ర బౌద్ధం:


ప్రాచీనాంధ్రదేశంలో అంటే క్రీ. పూ 3 వ సంవత్సరం నుండి క్రీ. శ 6 వ శతాబ్దం వరకూ ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ కట్టడాలు ఎక్కువగా రూపుదిద్దు కున్నాయి. బుద్ధుని జీవించిన కాలంలోనే ఆంధ్రదేశం లో బౌద్ధ ధమ్మం ప్రవేశించి, వ్యాప్తి చెందింది. 


అశోకుని ఎనిమిదో శిలాశాసనంలో బౌద్ధ ధమ్మం ఆచరిస్తున్న ఆంధ్రులు తన రాజ్యంలోని వారేనని పేర్కొనబడింది. ఇందుకు సాక్ష్యంగా అమరావతి, రాజులమందగిరి, ఎర్రగుడి శలాశాసనలు ఆంధ్రదేశం అశోకుని పాలనలో ఉన్నట్లు తెలుస్తుంది. 


మౌర్యుల తరువాత ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన వారిలో ముక్యులు శాతవాహనులు. వీరి కాలంలో బౌద్ధం స్థిరపడి, వున్నత దశకు చేరుకుంది. ఆతర్వాత పాలించిన రాజుల్లో ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు క్రీ. శ 6వ శతాబ్దం వరకు పాలించారు ఆ తర్వాత రాజుల కాలంలో బౌద్దానికి ఆదరణ తగ్గింది. 


జపాన్ బౌద్ధ శిల్పాలను పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్ లో తిరుమల లోని శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం కనిపిస్తుంది. క్రీ శ 7 వ శతాబ్దం లో రామానుజాచార్యుడు శైవ-వైష్ణవ ల మధ్య ప్రఛ్ఛన్య యుద్ధం తొలగించడాన్ని, అలాగే హిందు మతం వ్యాప్తికొరకు విష్ణు- చక్రం ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి ని ప్రతిష్టించారు. 


దక్షణాది న ప్రాచీన ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో బౌద్ధం, కర్ణాటకలో వీరశైవం ప్రభావాన్ని నిలువరించడానికి రామానుజాచార్యుడు చేసిన ప్రయత్నమే శంకు-చక్రం కలిగిన కొత్త అవతారం తిరుమల వేంకటేశ్వరుడు. 


తమిళ దేశంలో బుద్ధిజం: 


నాగుల పట్నమే నాగపట్నం అని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపా రాణి గారు ప్రకటించారు. అశుకుని కాలంలోనే తమిళ దేశంలో బౌద్ధం విస్తరించింది. 


చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ తన యాత్రా రచనలో అశోకుడు నాగపట్నంలో మాహా స్తూపాన్ని, విహారాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. నాగపట్నం, తంజావూరు, మధురై, కాంచీపురం మొదలైన పట్టణాలలో బౌద్ధం విశేషంగా వ్యాప్తి చెందింది. 


ద్రావిడ దేశమైన తమిళనాడు లో బౌద్ధం విస్తారంగా వ్యాప్తి చెందింది అని చెప్పడానికి అనేక చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. గుంటుపల్లి క్షేత్రములో రాతితో మలిచిన స్తూపాన్ని శివలింగంగా పూజించడం అందరికీ తెలిసిందే. 


చోళవంశీయులతో ఉన్న సంభందాలు కారణంగా ఒకటవ రాజ రాజ  చోళుని కాలంలో క్రీ. శ 1090 లో “చూడామణి” బుద్ధ విహార్ ను సుమిత్రా దీవి నేటి ఇండోనేషియా రాజు శైలేంద్ర మహారాజు నిర్మించారు. 


తమిళనాడులో చోళుల కాలం నాడు బౌద్ధం విరాజిల్లినట్లు పేర్కొనే రాగి శాసనాలు ప్రస్తుతం నెదర్లాండ్స్ దేశంలోని లీడెన్ విశ్వ విద్యాలయంలో భద్రపరిచి ఉన్నాయి. వీటిని లీడెన్స్ ప్లేట్లుగా ప్రచారం పొందాయి. 


కాంచీపురం (కంచి) బౌద్ధానికి కేంద్రంగా నిలిచింది. థేరవాద, మహాయాన బౌద్ధానికి కంచి ఆయువు పట్టుగా ఉండేది. నలందా విశ్వవిద్యాలయం కు కాంచీపురం లోని బౌద్ధ స్కాలర్స్ కు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. 


కాళిదాస మహాకవి చెప్పిన సమాచారం ఆధారంగా కంచిలోని బౌద్ధం దాని సంస్కృతి సేవలు ప్రజలందఱకు విశ్వాస పాత్రమైనవి. కంచి భిక్షు సంఘాలు నేల మీద నడియాడె దేవదేవుళ్ళని కవితారూపంలో కొనియాడారు. 


“కంచి పట్టణానికి దక్షిణ భాగంలో ఆడవి 

తలుపులు ముసినట్లుగా ఉంది

ప్రేమ పూర్వకంగా తామర పుస్పాలు 

ఆ పుస్పాలతో నావికుడిలా బుద్ధ భగవానుడు 

ఉదయించాడు”  


బౌద్దాన్ని ధ్వంశం చేసిన హిందు, ముస్లిం, క్రైస్తవులు:


అయోధ్య బాబ్రీ మసీదు శిధిలాలు క్రింద ఉన్న బౌద్ధ స్తూపాలు, ప్రతిమలు, నాగుల పట్నం గా బౌద్ధులకు నిలయంగా ఉన్న నాగపట్నం క్రైస్తవుల పుణ్య స్థలంగా మారిన తీరు ఇందుకు ఉదాహరణ. క్రీ. శ 3 వ శతాబ్దానికి చెందిన బౌద్ధ దేవత తారా దేవీ విగ్రహాన్ని కంచి లో కామాక్షి అమ్మవారి గా  నేటికి పూజిస్తున్నారు. 


నలంద యునివర్సిటి ని ధ్వంశం చేసిన పుష్యమిత్ర శృంగ వారసులు, భక్తియార్ ఖిల్జీ బుద్ధిజాన్ని భారత భూభాగం నుండి పారద్రోలే ప్రయత్నం చేశారు. 


క్రీ. శ 16 వ శతాబ్దంలో పోర్చుగీసు క్రైస్తవ మిషనరీలతో మద్దలైన క్రిస్టియానిటీ దక్షిణాదిన బౌద్ధ ఆరామాలను ధ్వంశం చేసి వాటి స్థానంలో  చర్చీలు నిర్మించిన ఆధారాలు చరిత్రలో కనిపిస్తాయని ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి గారు అంటారు. 


నాగపట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న నాగోర్ ఒకనాటి బౌద్ధుల చైతన్యం ఆ తర్వాత కాలంలో ఇస్లాం దర్గా గా మరి నేడు ముస్లిం లకు పవిత్ర స్థలంగా మారింది. 


తమిళనాడు లోని తీరప్రాంతమైన నాగపట్నం, నాగర్ కోయిల్, నాగోర్ పట్టణాలు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి, కృష్ణ తీర ప్రాంతాల్లో బౌద్ధ బిక్షువులు నడియాడిన నేల. ఆ తీరప్రాంతం అంతా నేడు క్రైస్తవం, హిందూ మతం వ్యాప్తి చెందింది. 


భారతీయుల చరిత్ర వంచనకు, విద్వాంసానికి గురైందన్న అతివాద హిందూవాదులు గుర్తించాల్సింది ఈ దేశ మూలవాసులైన నాగుల చరిత్ర, ఇంకా చెప్పాలంటే బౌద్ధుల చరిత్ర. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here