పెరియార్ రామస్వామి బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఫై వెల్లూరు మునిసిపల్ కౌన్సిల్ లో చేసిన ప్రసంగం

షేర్ చెయ్యండి
  • 138
    Shares
పెరియార్ రామస్వామి  ఈ పేరు తెలియని నాస్తిక ఉద్యమం లేదు  అంటే నమ్మకం కుదరదు. సెప్టెంబర్ 17 1879 లో  ఈరోడ్ , తమిళనాడు లో జన్మించేరు. అక్టోబర్ 14, 1956 న బౌద్ధుడయ్యాడు. ఈ సందర్బంగా పెరియార్ రామస్వామి బాబాసాహెబ్ చిత్రపటాన్ని ఆవిష్కరించేరు.
 
అక్టోబర్ 28, 1956 న వెల్లూరు మునిసిపల్ కౌన్సిల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సందర్బంగా పెరియార్ రామస్వామి ప్రసంగపాఠాన్ని క్రింది పేరాలో పేర్కొనడం జరిగింది. తమిళ మూలాన్ని అస్సాన్ అనే వ్యక్తి  ప్రసంగంలోని కొన్ని ముఖ్య అంశాలను తమిళ డైలీ ‘రేషనలిస్ట్’  లో 6 మరియు 7 1956 తేదీ లలో  ప్రచురించేరు. 
 
ముందుగా స్వాగత ఉపన్యాసం చేసిన వెల్లూరు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ పెరియార్ రామస్వామి  గారిని పొగడ్తలతో ముంచెత్తేరు. ఆ తర్వాత మాట్లాడిన పెరియార్ తన చేత ప్రపంచ మేధావి డా అంబెడ్కర్ ఫొటో ని ఆవిష్కరించడం చాలా సంతోషం వ్యక్తం చేసేడు. 
 
ఈ గొప్ప కార్యాన్ని నాతొ చేయించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. స్నేహితుడు కృష్ణస్వామి చెప్పినట్లు సహజంగా తనలాంటి వారిని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం అరుదు.నేను ఈ కార్యక్రమాన్ని , ఈ ఆహ్వానాన్ని నాయొక్క ఉద్యమానికి గుర్తింపు గా నేను అనుకుంటున్నాను. మనందరం కలిసి ఒక మంచి కార్యక్రమం కోసం కలసి పనిచేయడానికి మంచి అవకాశం.
 

డా. అంబేడ్కర్ సామాజిక సమానత్వం:

 

ప్రపంచంలో, ప్రత్యేకించి మన దేశంలో మనుషులను పెద్ద,చిన్న (కులాల వారీగా ) అనే తేడాలు చూడటం తగ్గుతూ వస్తుంది. క్రింది తరగతి వారు కూడా సమానత్వం యొక్క ఫలాలను అనుభవిస్తున్నాడు. 
 
డా. అంబేడ్కర్ ని తెలివిగల వాడిగా మనం కీర్తిస్తున్నాం. అతని చదువు అందుకు దోహదపడింది. కానీ డా. అంబేద్కర్ ఆ జ్ఞానాన్ని తన సాటి మనుషులను చైతన్య పరచటానికి ఉపయోగించారు.
 
సహజంగా చాలా మంది తెలివి తేటలు తమ స్వార్ధం కోసం లేదా  మత ప్రయోజనాల కోసం  ఉపయోగించుకుంటారు. కానీ డా అంబేడ్కర్ తన జాతి విముక్తి కొరకు ఉపయోగించడం గర్వకారణం. 
  
బారత దేశంలో సామాజిక రంగంలో ఒక గొప్ప విప్లవం జరుగుతుంది. ఆర్ధిక సమానత్వం సాధించడానికి ముందు, సామాజిక సమానత్వం సాధించాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య దేశాలలో, సామజిక సమానత్వం నెలకొల్పడం ద్వారా విప్లవం సాధించబడింది. అసమానతలు నిర్ములించడం ద్వారా ఒక వ్యక్తి పుట్టుకకు ఎలాంటి హాని జరగలేదు. అతను ఏ కులం / మతం లో పుట్టినా.సరే. అసమానతల వలన లాభపడినవారు నేడు పాలకులుగా ఉన్నారు. తత్ఫలితంగా, మన దేశంలో సామాజిక విప్లవం యొక్క ఉద్యమం బలంగా లేదు. కొద్దిమంది మాత్రమే సామాజిక సమానత్వం కోసం పని చేయడానికి ముందుకు వస్తున్నారు”

డా. అంబేడ్కర్ నాస్తికుడు: 

డా. బి ర్. అంబేడ్కర్ యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. మీ ఆహ్వాహనానికి , ఇలాంటి గౌరవం నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. డా. బి ర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావుల్లో ఒకరు. తనకు ఉన్న Wisdom ద్వారా గొప్ప వ్యక్తి గా కొనియాడబడుతున్నాడు.
 
తన చదువు, డిగ్రీ ల వలన డా. అంబేడ్కర్ ని గొప్ప వ్యక్తిగా ప్రశంసించడం లేదు. డా. అంబేడ్కర్ ని కీర్తించడానికి అతని  చదువు, మేధో శక్తి అనేవి రెండో స్తానం లో ఉంటాయి. డా. అంబేడ్కర్ తాను సంపాదించిన జ్ఞానాన్ని ప్రజల అభివృద్ధికి , సమాజ అభివృద్ధికి ఉపయోగించడం అతని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. 
 
డా. అంబేడ్కర్ నాస్తికుడు. ఇది ఇప్పుడు కాదు, కానీ చాలా కాలంపాటు అతను నాస్తికుడిగా ఉన్నాడు. నేను ఒక విషయం మీకు స్పష్టం చెయ్యదలుచుకున్నాను. ప్రపంచంలోని మేధావులందరూ నాస్తికులు. ఒక నాస్తికుడు మాత్రమే హేతుబద్ధ ఆలోచనలు చెయ్యగలడు. మరియు మానవత్వం గల మనిషిగా జీవించగలడు.
 
చదువుకున్న వారందరూ నాస్తికులు కాదు, తెలివిగలవారు కాదు. ఈ సమాజంలో 99 % మంది చదువుకున్న వారు బయటకు వచ్చి తన మనసులోని మాటను చెప్పుకోలేక పోతున్నారు. బావ వ్యక్తీకరణ చెయ్యలేక పోతున్నారు. దేవుడు ని వ్యతిరేకించిన వారే నాస్తికులు కాదు. దేవుడు పేరుతొ చెప్పే పురాణ గాధలను అడ్డుకున్నవారు కూడా నాస్తికులే. 

డా. అంబేడ్కర్ ధైర్యవంతుడు మరియు నిజాయితీ గలవాడు:

డా. అంబేడ్కర్ ఒక  గొప్ప మేధావి. అందువలన అతను నాస్తికుడు. అతను తన సొంత ఆలోచనల నుండి ఉద్బవించిన నిర్ధారణ ను ధైర్యంగా వ్యక్తపరుస్తాడు. మన దేశంలో మేధో వర్గం స్వేచ్ఛగా  వారి అభిప్రాయాలను వ్యక్తపరచలేని నిస్సాయతలో ఉన్నారు. కానీ డా. అంబెడ్కర్ అలంటి వ్యక్తి కాదు. తాను ఏమి అనుకున్నాడో అది ధైర్యంగా వ్యక్తంచేస్తారు.

డా. అంబేడ్కర్ బుద్దిస్టుగా మారడం ఒక అద్భుతమైన సంఘటన:

“ఇప్పుడు అద్భుతమైన సంఘటన జరిగింది. అది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బౌద్ధ మతానికి డా. అంబేడ్కర్ మారడం ఒక అద్భుతమైన సంఘటన. నిజం చెప్పాలంటే డా అంబేడ్కర్ ఎప్పటి నుండో బౌద్ధుడు గా ఉన్నాడు.” 
 
బౌద్ధుడు ఎవరు? జనవరి 1954 మూడవ వారంలో ఈరోడ్ (తమిళనాడులో) జరిగిన బౌద్ధ సమావేశంలో ప్రపంచ బౌద్ధ సంఘం అధ్యక్షుడు, ప్రఖ్యాత మల్లశేఖర వివరణ ఇచ్చారు. సిద్ధార్థుడు బౌద్ధ మార్గాలను స్థాపించారు. నిజానికి అతని పేరు బుద్ధుడు  కాదు. సిద్ధార్థ తన ‘బుద్ధుడి’ (తార్కిక అధ్యాపకులు లేదా తెలివి) ను ఉపయోగించాడు మరియు బుద్ధుడు అయ్యాడు. బుద్ధుడు జ్ఞానోదయం గలవాడు.
 
డాక్టర్ అంబేద్కర్ గత 20 లేదా 30 సంవత్సరాల్లో హిందూ మతాన్ని అంగీకరించలేదు. అతను గాంధీ (1869-1948) ను ఒక సంప్రదాయక హిందూ మరియు మను స్మృతిని అంగీకరించి వర్ణాశ్రమ దర్మను సమర్ధించటానికి తీవ్రంగా విమర్శించాడు. ఒక సనాతన హిందూ, గాంధీ నిజంగా ఆది ద్రావిడ  ( భారతదేశంలోని అసలు నివాసితులు) యొక్క ఉద్ధరణకు ప్రాథమికంగా లేదా గణనీయంగా ఏమీ చేయలేదని ఆయన అన్నారు.

డా. అంబేడ్కర్  పంజాబ్లో ఒక సమావేశం:

కులాలను నిర్ములించడం పై డా అంబేడ్కర్ కి రాడికల్ అభిప్రాయాలు ఉన్నాయి. పంజాబ్ ( నేడు పాకిస్తాన్ లోని  పంజాబ్) ఒక సంస్థ ( జాట్ పాట్ తొడక్ మండల్ ) కులాల రద్దుకు పని చేస్తుంది. వారు నన్ను సభ్యుడి గా చేర్చుకున్నారు. వారి వార్షిక సర్వ సభ్య సమావేశానికి డా అంబేడ్కర్ ని పిలిచేరు. డా. అంబేడ్కర్ తన అధ్యక్ష ఉపన్యాసం వారికి పంపేరు.
 
అందులో డా. అంబేడ్కర్ కులాలు నిర్ములించబడాలి అంటే  హిందూ మతం నిర్ములించబడాలి అని రాసేరు. అందుకు వారు డా. అంబేడ్కర్ కి ఒక ఉత్తరం రాసేరు. మేము కులాలు రద్దు కొరకు పోరాడుతున్నాము, మతం కొరకు కాదు, కావున ఆ పేరా తొలగించాల్సింది గా కోరేరు.
 
కులానికి మూలం హిందూ మతం కావున మతం రద్దు కావాలని నేను ఆ మాట ను తొలగించలేను అని అన్నాడు. డా అంబేడ్కర్ పంజాబ్ వెళ్ళలేదు. నేను డా అంబేడ్కర్ వద్ద నుండి ఆ ప్రసంగ పాఠం తెప్పించి  1936 లో తమిళం లో “జయతియ ఓషిక్కా వజీ” గా ప్రచురించాను.
 
మనం రామాయణం తగలబెట్టాలని ఆలోచిస్తున్నాం. డా. అంబేడ్కర్ 1932 లోనే ఒక సమావేశంలో కాల్చిపడేసేరు. శివరాజ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించేరు.”
 
ఒక సమావేశం కొరకు డా. అంబేడ్కర్ మద్రాసు వచ్చినప్పుడు భగవత్ గీత ఒక వెర్రివాడి యొక్క యొక్క బ్లేబర్బరింగ్ అని అన్నారు.దీనికి సర్ సి. పి రామస్వామి అయ్యర్  అభ్యంతరం వ్యక్తం చేసేడు. డా. అంబేడ్కర్ సాధారణ వ్యక్తి కాదని, రాజ్యాంగ కౌన్సిల్ సభ్యుడని, ఇలాంటి వాక్యాలు అనడం సరికాదు. 
 
నేను (1930 ) ఈ రోడ్ లో ఒక సమావేశానికి ( స్వీయ గౌరవం యొక్క రెండొవ సదస్సు )కు డా అంబేడ్కర్ ని పిలిచేను. డా. అంబేడ్కర్ వైద్యుడు అని పొరబడి రెండు రోజుల్లో తిరిగి పంపిస్తాను, అందువలన రోగులకు ఎలాంటి ఇబ్బంది రాదని ఉత్తరం రాసేను. ఎందుకో ఈ సమావేశానికి డా. అంబేడ్కర్ రాలేదు. సర్ RK షణ్ముగం డా. అంబేడ్కర్ స్తానం లో అధ్యక్షత వహించేరు. MR జయకర్ కూడా సమావేశానికి వచ్చేరు. 
 
1930 లో డా. అంబేడ్కర్ ముస్లిం మతం లోకి మారాలని అలోచిస్తున్నాను అని చెప్పేడు . నేను రామనాధం గారు ఒక ఉత్తరం రాసేము. 
 
ఆత్రుతతో నిర్ణయం తీసుకోకండి. మీరు ఇస్లాం లోకి మారేటప్పుడు మీ వెనకాల లక్ష మంది జనాభా ఉండాలి. అప్పుడే మీకు వారు గౌరవిస్తారు లేదంటే మౌలానా చెప్పింది వినాలి. ఇస్లాం చాలా ఫర్ఫెక్ట్ మతం అని వారు చెప్పుకుంటారు. అది ఎలాంటి మార్పులకు, చేర్పులకు అంగీకరించదు, కేవలం పూజించడం , ప్రార్ధించడం ఇంకేవిధమైన మార్పుకి అవకాశం లేదు  మీరు నిర్బంధం గా భావిస్తారు. 

1954 బర్మా లో డా. అంబేడ్కర్:

డా. అంబేడ్కర్ మతం మారాలని ఆలోచిస్తున్నాడు.  బుద్దిస్ట్ గా మారిపోయేడు. బుద్ధిజం లోకి మారక ముందు నుండే డా. అంబేడ్కర్ బౌద్దుడి గా ఉన్నాడు. 1954, డిసెంబర్ లో  నేను,డా అంబేడ్కర్ ప్రపంచ బౌద్ధ సమ్మేళనం కోసం బర్మా వెళ్ళేము. నాకు చెప్పకుండానే వారు ఆహ్వానితుల లో నా పేరుని కూడా ప్రకటించారు. అందుకే వెళ్లెను. కొన్నికారణాల వలన నా స్థానంలో వేరే వ్యక్తి చేత మాట్లాడించేరు ( ఆ తర్వాత సభ్యుల అబ్యర్ధన మేరకు మాట్లాడేరు ) 
 
ఆ సభలోనే డా. అంబేడ్కర్ బుద్ధిజం తీసుకోవాలని నిర్ణయానికొచ్చేరు. దాదాపుగా సిలోన్ ( నేడు శ్రీలంక ) నుండి , బర్మా మరియు అమెరికా నుండి  500 మంది ప్రతినిధులు వచ్చేరు.అంతేకాకుండా స్థానిక సందర్శకులు కూడా వచ్చేరు. దాదాపుగా 2000 మంది బిక్కులు పూజలు చేస్తున్నారు. హిందువు లు లాగే చేస్తున్నారు. వారి వైపుకు చూపిస్తూ  నేను డా అంబేడ్కర్ కి చెప్పేను. 
 
మీరు బౌద్ధం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చేరు. ఈ పూజారులతో  ( బిక్కులు) మీరు ఏమి చేస్తారు. మనం హేతు  బద్దంగా ఉండాలని అనుకుంటున్నాము. ఈ బిక్కుల ఆజ్ఞలు మనం ఎలా స్వీకరిస్తాము. హిందూ మతం పూజారుల  మీద పోరాటం చేస్తూ ఈ బౌద్ధ పూజారులను ప్రశంసించాలా.”
 
ప్రజలను రెండు మూడు సార్లు కలవండి, వారితో మాట్లాడి కనీసం ఒక లక్ష మందితో అయినా బుద్ధిజం లో చేరండి అప్పుడే ఆ బిక్కుల నుండి గౌరవం లభిస్తుంది. బుద్దుడి యొక్క హేతువాద మరియు  మానవతా సిద్ధాంతం గురించి ప్రచారం చెయ్యగలుగుతాము  
 
నేను డా. అంబేడ్కర్ తో మాట్లాడేటప్పుడు ఒక బౌద్ధ భిక్షువు మా వద్దకు వచ్చేడు. అతని వయస్సు దాదాపుగా 30 సంత్సరాలు ఉంటుంది. తెల్లగా పొడవు, సన్నగా వున్నాడు. అతను బెంగాలీ బ్రాహ్మణుడు. అతను నాగురించి విచారించేడు. నేను మద్రాస్ నుండి వచ్చెను అని చెప్పెను.. నా పక్క సీట్లో ఉన్న ఆతను ఇతను పెరియార్ రామస్వామి అని చెప్పేడు. నన్ను పోల్చుకుని నేను ఏ కులానికి , మతానికి సంబంధించిన వాడో చెప్పలేడు భిక్షు, కానీ నా పేరు తెలుసుకుని అతను నన్ను గుర్తు పట్టగలడు. అతను నన్ను అడిగేడు బుద్ధిజం లో చేరటానికి వచ్చేవా లేక బుద్ధిజాన్ని నిర్ములించాలి అని వచ్చేవా అన్నాడు. నేను అబుద్ధిస్ట్ భిక్షువు ను మీరు పారప్పన్ – బెంగాలీ బ్రాహ్మణుడు అయివుండి బుద్ధిష్ట్ గా ఎలా అయ్యేరు అన్నాను. ఏమి కాకూడదా అంటూ అక్కడ నుండి వెళ్ళేడు. 
 
నేను ఈ విషయం డా. అంబేడ్కర్ తో చర్చించెను. అతను నాతొ ఇలా అన్నాడు. మైసూర్ మహారాజు బుద్దుడి ధర్మం మీద చాలా ఆశక్తిగా ఉన్నాడు. భూమిని దానం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. విరాళాలతో అక్కడ ఒక విశ్వవిద్యాలయం కట్టాలని అనుకుంటున్నాను. మన జీవితం ముగిసేలోపల ఏదో ఒకటి చెయ్యాలి మనం అన్నాడు. ఇంకా చాలా విషయాలు నాతొ పంచుకున్నాడు. 

డా. అంబేడ్కర్ ప్రకటన:

డా. అంబేడ్కర్ ఇప్పుడు బౌద్ధాన్ని స్వీకరించేడు. ఆరోజు ఒక ప్రకటన కూడా చేసేరు. బహుశా మీరు పేపర్స్ లో చూసి ఉండవచ్చు. అతను ఇలా అంటాడు: “రామ, కృష్ణుడు, శివ, రుద్ర మొదలైన దేవతలుగా నేను అంగీకరించను. నాకు  అవతార భావనలో నమ్మకం లేదు. నేను కుల వ్యవస్థ, స్వర్గం, నరకం వంటి వాటిని అంగీకరించలేదు. నేను ఆచారాలు, వ్యవహారాలు  చేయ్యను . నేను నా తల్లిదండ్రులకు శ్రద్ధా వేడుక చేయను.”

హిందూ మతం నిజంగా ఒక మతం కాదు: 

డా. అంబేడ్కర్  లక్షలాది తన అనుచరులతో  బుద్ధిజం తీసుకున్నతర్వాత మీడియా ప్రతినిధులు నా వద్దకు వచ్చేరు. ‘ధ్వని తంతి’ అనే తమిళ పత్రిక విలేకరి మీరు కూడా హిందూ మతాన్ని వీడుతున్నారా అని అడిగేడు. హిందూ మతం మతమే కాదని దానికి ఒక దిశ, దశ లేదు ఇక నేను ఆ మతాన్ని విడిచిపెట్టేది ఏముంది. హిందూ మతానికి ఒక అధారిటీ లేదు అదే క్రిస్టియానిటీ , ఇస్లాం మరియు  సిక్కు మతం లో వ్యవస్థాపకులు ఉన్నారు. 
 
ఎవరైతే రాముడు, కృష్ణుడు, బ్రహ్మ, గణేష్, ఈశ్వరుడి ని నమ్ముతారో వారు హిందువులు కారు. వీరిని వ్యతిరేకించేవారే నిజమైన హిందువులు. హిందువులు ఒకరి ఆచారాలను ఒకరు ద్వేషించు కుంటారు.అందుచేత హిందూ మతం  మతం యొక్క లక్షణాలను కలిగి ఉండలేదు. కాబట్టి నేను ఆ మతాన్ని స్వీకరించడం కానీ, వ్యతిరేకించడం కానీ లేదు. 
 
(పెరియార్ రామస్వామి యొక్క స్థిరమైన విధానం హిందూ మతాన్ని త్యజించటం మరియు ప్రేమ ఆధారంగా మరియు హిందూ మత సమీకృత మార్గాన్ని ఎన్నుకోవడం మరియు అన్ని స్థాపించబడిన మతాలు యొక్క సిద్ధాంతాలను స్పష్టంగా వివరించడం – అనువాదకుడు).

ఒక గొప్ప నాయకుడు:

Also read  శబరిమల అయ్యప్ప బిజెపి కి దక్షణాదిన ఓట్లు తెచ్చిపెట్టే బృహత్తర పధకం గా ఆ పార్టీ భావిస్తుందా?

 పెరియార్ రామస్వామి, డా. అంబేడ్కర్ ప్రజలకు మార్గదర్శకులు గా ఉన్నారు. అయిన స్పష్టంగా తన అభిప్రాయాన్ని మతం మరియు కులం పై వ్యక్తపరుస్తాడు. అతను స్వార్ధం లేకుండా పనిచేస్తాడు. అతను బారత దేశం అంతా బాగా తెలిసిన వ్యక్తి . అతను బుద్ధిజం తీసుకోవాలని తన అనుచరులను కోరేరు. బహుశా తమిళనాడు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇక్కడ ప్రజలు కూడా బుద్దిస్ట్ లుగా మారే అవకాశం ఎక్కువ. తన సమాజానికి విద్య, వుద్యోగం ద్వారా వారిని అభివృద్ధి చెయ్యొచ్చు అనుకున్నాడు నిజంగా అతను చాలా గొప్ప నాయకుడు. అతని తర్వాత అంత గొప్ప నాయకుడు ఎవరూ పుట్టలేదు. 

 

(Visited 460 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!