దళిత రాజకీయం:కర్ణాటకలో ఎస్సిల రాజకీయం!

0
329
Dalit_politics_karnataka

దళిత రాజకీయం ఏ రాష్ట్రంలో అయినా, ప్రాంతంలో అయినా ఒకేవిధంగా ఉంటుంది. విశేష కృషిచేసిన మాన్యశ్రీ కాన్షిరాం గారు మరణించిన తర్వాత బహుజన సమాజ్ పార్టి కూడా ఈ కోవకే వస్తుంది 

ఎంతకాదు అనుకున్నా బారత దేశం అంటేనే కులం, “కుల సమాజం”. దేశంలో ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అనేవి ఎంతో విలువైనవి, ఆ సమయంలో ఓటరు దేవుడే! ఆ దేవుల్లో అంటరాని దేవుళ్ళు కుడా ఉన్నారు. ఆ అంటారని దేవుళ్ళ ఓట్లకోసం సహపంక్తి అంటారు, లేదా సంక్షేమం అంటారు ఇది అంత బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు కమ్యూనల్ అవార్డ్ పేరుతొ ఈ దేశ నిమ్న జాతులకు ఓటు హక్కు మరియు ప్రత్యెక నియోజకవర్గాలు సాధించటం వలన, రాజ్యాంగ పరంగా వారికీ ఓటు హాక్కు స్వతంత్ర బారత దేశంలో కల్పించబడటం వలన ఐదేళ్ళ కు ఒక్కసారి అయినా అంటారని వారు అనబడే ఎస్సి లు దేవుళ్ళు అయ్యేరు.

దక్షిణ బారత దేశంలో ఎస్సిల మరియు బి సి ల ఓటర్ల చైతన్యం ఉత్తర బారత దేశంతో పోలిస్తే చాల ఎక్కువ. అయితే ఇక్కడ ఎస్సి లను కానీ బి సి లను కానీ రిప్రజెంట్ చేసే ఏ రాజకీయ పార్టీ లేదు. జనాభా పరంగా అధికంగా ఉన్నా సామాజికంగా ఇంకా మైనారిటీ లోనే ఉన్నారు.

ఈ నేపధ్యంలో ఇంకా కొన్ని నెలలో జరిగే కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎస్సి మరియు బి సి ఓట్ల కోసం అన్నీ పార్టీలు తమ ఎత్తులు, ఎత్తుగడలు, పొత్తులు సిద్దం చేసుకుంటున్నాయి. రెండురోజుల క్రితం కర్ణాటకలో జరిగిన రాజకీయ సమీకరణ ఇప్పుడు దక్షణాది రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది.

జనతా దళ్ పరివరంలోని ఒక చీలిక వర్గం అయిన జెడిఎస్ మరియు మాన్యశ్రీ కాన్షీరాం ఆశయం అయిన బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) రెండు రాబోయే ఎన్నికల్లో కలసి పోటీ ( చెయ్యాలి అని ఒక నిర్ణయానికి రావడం ప్రదాన వార్త గా చర్చించబడుతుంది.

కర్ణాటకలో దళిత రాజకీయం: 

ఒకప్పుడు హక్కులు నిరాకరించబడిన వర్గాన్ని రాజకీయ అవసరాల కోసం ఏదో ఒక రాజకీయ పార్టీ సొంతం చేసుకోవాలి అని చూస్తుంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి దేశంలో కాంగ్రెస్స్ కు వెన్నుదన్ను గా ఉన్నారు. అలాగే కర్నాటకలోకుడా ఎస్సీలు కాంగ్రెస్స్ వైపు ఉన్నారు.

మాజీ ప్రదాని ఇందిరాగాంధీ సమయంలో మరింత దగ్గర అయ్యేరు. అన్ని రాష్ట్రాల్లో లాగే కర్ణాటక లో కుడా ఎస్సీలు కాంగ్రెస్స్ తోనే ఉన్నారు. కర్ణాటక ఎస్సిలలో చలువాది , మాదిగ కులాలు ప్రధానమైనవి. ఈ రెండు గ్రూపులు జనాభా పరంగా మేమే అతి పెద్ద కమ్యునిటీ అని అంటే మేమే అని ఒకోకరికి ఒకరు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. మొత్తం కర్ణాటక ఎస్సి జనాభా లో చలువాది , మాదిగ కులాలు 35 -30 శాతంగా ఉంటారు.

చలువాది కులం 80 నుండి 90 శాతం కాంగ్రెస్స్ తో ఉంటే మిగతా వారు జేడి ఎస్ తో ఉన్నారు. అలాగే మాదిగ, బోయ  లు దాదాపుగా 50 శాతం మంది బా జ పా తో ఉన్నారు. ఎస్సిల్లో ఆర్ధికంగా వెనకబడిన మైక్రో కులాల ఓట్లు దాదాపుగా 80 శాతం బా జ పా తనవైపు మల్లించుకోవాలి అని చూస్తుంది.

కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలను ( దళిత రాజకీయం) రెండు గ్రూపులుగా చూస్తున్నారు రెండు వెల సంవత్సరం నుండి ఎస్సీలు Right touchable మరియు Left touchable గా పిలుస్తున్నారు చలువాది మరియు దాని అనుబంద కులాలను రైట్ టచ్బుల్స్ గా మాదిగ దాని అనుబంద కులాలను లెఫ్ట్ టచ్ బుల్స్ గా పరిగణిస్తున్నారు. మొదట నుండి చలువాది కులం కాంగ్రెస్స్ పార్టీలో ఉన్నారు ఆ పార్టీ కే మద్దత్తు పలుకుతున్నారు.

చలువాది లు కాంగ్రెస్స్ లో ఉండటం వలన ప్రబుత్వ పధకాలు , పదవులు వారికే వస్తుండటం తో బా జ పా ఇక్కడ మాదిగ కులాలను దగ్గరకు తీసే ప్రయత్నం చేసింది. రెండు వేల సంవత్సరం నుండి మాదిగలు బా జ పా తో కలిసి పని చేస్తున్నారు.

కర్ణాటక క్రిస్టియన్స్ మరియు మైనారిటీస్:

దక్షణ కన్నడలో అధికంగా ఉన్న హిందువులు ఓట్లు లాగే క్రిస్టియన్స్ , ముస్లిం లు ఓటరు శాతం కుడా మిగతా ప్రాంతాలతో పోలిస్తే అధికం. అందుకే ఈ ప్రాంతం లో క్రిస్టియన్స్ ని మైనారిటీస్ ని బా జ పా పరివార్ టార్గెట్ చేసింది. క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తుంది.

ఇక్కడ అత్యధిక క్రిస్టియన్స్ నాన్ ఎస్సి కులస్తులు “గౌడ సరస్వతి బ్రహ్మణ” కులస్తులు కేధలిక్ చర్చి అధిపతులు గా ఉన్నారు. వీరు రాజకీయంగా ఆర్ ఎస్ ఎస్ యొక్క విధాన్ని వ్యతిరేకిస్తునారు. ఇక్కడ ముస్లింలు  , క్రిస్టియన్స్ ఎక్కువ శాతం కాంగ్రెస్స్ మద్దత్తు దారులుగా ఉన్నారు.

అయితే ఇక్కడ ఇంకొక వాదన కుడా ఉంది సైద్ధాంతికంగా క్రిస్టియన్స్ బా జ పా కి గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పటికీ నియోజక వర్గాలో ఎలాంటి అభివృద్ధి  జరగలేదు అని చెబుతున్నారు. దక్షిణ కర్ణాటకలో ఇప్పటివరకూ 23 రాజకీయ హత్యలు జరగగా ఇవి సంఘ్ పరివార్ శక్తులు చేసాయి అనే ఆరోపణ ఉంది. 

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా , పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా మరియు మైనార్టీ గ్రూపులకు చెందిన కార్యకర్తలు ఈ రాజకీయ హత్యల్లో తమ ప్రాణాలు కోల్పోయేరు.

ఒక్కలింగ –లింగాయత్:

బారత దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కర్ణాటక రాష్ట్రంలో నేటివరకూ 19 మంది ఈ రెండు కులాల నుండే ముక్యమంత్రులు అయ్యేరు అంటే ఒక్కలింగ – లింగాయత్ ల రాజకీయ శక్తి ఎంతో అర్ధం చేసుకోవచ్చు. రెండోవ వెనకబడిన తరగతుల కమీషన్ 2001 ప్రకారం లింగాయత్ లు 15.42 మరియు వోక్కలింగ 10.64 శాతం.

దక్షిణ కర్ణాటకలో వోక్కలింగ కులం ఆర్ధికంగా , రాజకీయంగా బలంగా ఉంటే సెంట్రల్ మరియు ఉత్తర కర్ణాటకలో లింగాయత్ ల ప్రభావం అధికంగా ఉంది. ఈ రెండు కులాల ఓట్లు పొందాలి అంటే వారి కులం వారినే పార్టీలు అనివార్యంగా పోటీలో పెట్టాలి. ఒక్కలింగ – లింగాయత్ లు వారి కులానికే ఓటు వేస్తారు తప్పా ఇతరులకు ఓటు వేయరు. ఈ రెండు కులాలు బలంగా ఉన్న నియోజక వర్గం లో ఆ కులం అభ్యర్ధులు తప్పా వేరే కులం వ్యక్తులు గెలిచే అవకాసం అసలు లేదు.

జెడిఎస్ – బిఎస్పీ ల రాజకీయ కూటమి:

గత రెండు రోజులు క్రితం డిల్లీ లో జరిగిన కర్ణాటక రాజకీయ పరిణామాలు అందరి ద్రుష్టి సారించేయి. అది వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ జెడిఎస్ తో కలిసి పోటీ చెయ్యబోతుంది. మొత్తం 224 నియోజక వర్గాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీ లో జెడిఎస్ తో పోత్తుద్వారా బిఎస్పి కేవలం 20 స్తానల్లో మాత్రమె పోటీ చెయ్యబోతుంది. ఎన్నికల ప్రచారంలో బెహన్జీ మాయావతి గారు కుడా ప్రచారం చేసేవిధంగా ఏకాభిప్రాయానికి వచ్చేరు.

గత సంవత్సరం చివరి రోజు వరకూ జెడిఎస్ బా జ పా తో ఎన్నికల ఒప్పందానికి వచ్చే అవకాసం ఉంది అని మీడియా కధనాలు. ఇదే విషయమై మాజీ ప్రదాని జెడిఎస్ గౌరవ అధ్యక్షులు దేవగౌడ బా జ పా నాయకులు మాజీ ముఖ్యమంత్రి యద్యురప్పా తో కలిసి మంతనాలు జరిపేరు. అయితే ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి బిఎస్పీ రావడంతో ప్రజల్లో చర్చకు దారితీసింది.

దళిత రాజకీయం, ప్రస్తుతం కర్ణాటకలో ఈ రెండు పార్టీల ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది అని చెప్పాలి. గత ఎన్నికల ఫలితాలను సమీక్ష చేస్తే 1 % కుడా లేదు. అలాగే 2013 ఎన్నికల్లో 40 స్తానాల్లో గెలిచిన జెడిఎస్ ప్రస్తుతం ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విఫలం అయ్యింది. కర్ణాటక బిఎస్పీ మాజీ అధ్యక్షుడు బి గోపాల్ సొంతగా పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారం కోసం ప్రతి నియోజకవర్గం పర్యటిస్తున్నాడు. కాబట్టి జెడిఎస్ – బిఎస్పీ ల కూటమి ప్రబావం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

కర్ణాటకలో ఎస్సి , ఎస్టీ మరియు మైనారిటీలు 39 శాతం జనాభా ఉన్నారు. ఎస్సి లు కర్ణాటక రాష్ట్రంలో మేమే అత్యధిక జనాభా కలిగిన కులం గా ప్రకటించుకుంటారు. ఈ 39 శాతం జనాబా అధిక శాతం ఓటర్లు కాంగ్రెస్స్ మద్దత్తు దారులుగా ఉన్నారు. మన దేశంలో ఒక్కొక కులం ఒక రాజకీయ పార్టీతో అనుబందం పెంచుకుని ఉంది.

ఒక కులంలోని మెజారిటీ ఓటర్లు ముకుమ్ముడిగా ఒక పార్టీ కి ఓటు వేయడం మామూలే. దీనినే మనం వోట్ బ్యాంక్ రాజకీయం అంటున్నాం. ఈ ఓటు – బ్యాంక్ ని మచ్చిక చేసుకోవడం రాజకీయ పార్టీల ప్రధాన అజెండా? కాబట్టి జెడిఎస్ , బిఎస్పి ల దళిత రాజకీయం కలయక వలన కాంగ్రెస్స్ పార్టీ యొక్క ఎస్సీల  ఓటు బ్యాంక్ ఛీల్చే అవకాసం ఉంది  దీనివలన అధికారం కోసం గోరీ కాడా నక్కలా దక్షిణ బారత దేశంలో అధికారాన్ని చేపట్టాలి అని ఎదురు చూస్తున్న బా జ పా కి లాభం చేకూరుతుంది.

2004 ఎన్నికల తర్వాత దళిత రాజకీయం, బిఎస్పి పార్టీ యొక్క గ్రాఫ్ పడిపోయింది. బి గోపాల్ లాంటి మంచి రాష్ట్ర స్తాయి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం. ఇప్పుడు జెడియస్  లాంటి పార్టీలతో కలసి పోటీ చెయ్యడం అనివార్యంగా బా జ పా కి లాభమే కానీ నష్టం ఉండదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here