పెద్ద గొట్టిపాడు: గులాంగిరిముందువెలవెల  బోయినఆత్మగౌరవం!

0
289
Pedda_Gottipadu_Dalit

పెద్ద గొట్టిపాడు గుంటూరు జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉన్న గ్రామం. నగరాలకు చెరువులో వున్నా గ్రామాల్లో కులం పడగలు విప్పి ఇంకా విషం చిముతూనే ఉంది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా జరిగిన చిన్న అపశృతి ఇరు పక్షాల మధ్య కుల భూతాన్ని నిద్ర లేపింది. 

దళిత కుల సంఘాల నాయకత్వం గానీ లేదా రాజకీయ పార్టీ దళిత ప్రతినిధులుగానీ సమస్యను నీరు గారుస్తారు అనే నానుడి ఉంది. పెద్ద గొట్టిపాడు లో కూడా దళిత నాయకత్వం ఫ్యూడల్ కుల నాయకులకు గులాంగిరీ చెయ్యడం పలువురిని విస్మయానికి గురిచేసింది. 

“ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఇతరులపై ఆదారపడి జీవించే నీచమైన మనస్తత్వానికి నిమ్నజాతీయులు స్వస్తి చెప్పాలి. తమ బానిస బంధనాలను చేదిన్చుకునేందుకు తామే స్వశక్తితో కృషి చెయ్యాలి”

1929 వ సంవత్సరం ఏప్రిల్ లో రత్నగిరి జిల్లా లో  జరిగిన నిమ్న జాతీయుల సభను ఉద్దేశించి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చెప్పిన మాటలు మానవుడికి ఆత్మగౌరవం కంటే విలువైనది మరొకటి లేదు అన్నారు. గత సంవత్సరం చివరిరోజు న గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎస్సి నియోజకవర్గంలో జరిగిన సంఘటన, ఆతర్వాత జరిగిన పరిణామాలు గమనిస్తే ఎస్సీల ఏకైక నాయకుడు, ఎస్సీలను బానిస సంకెళ్ళ నుండి విముక్తి కల్గించటానికి తన సర్వస్వం త్యాగం చేసిన బాబాసాహెబ్ తన ప్రజలకు ఇచ్చిన సందేశం మరొక్కసారి గుర్తుచేసుకోవాల్సి వచ్చింది.

గొట్టిపాడు; నూతన సంవత్సరంకి ఆహ్వానం పలుకుతూ సంతోషంతో బైక్ మీద తిరుగుతున్న ఎస్సి యువకులు గ్రామంలోని ఒక రోడ్డు మీద పెట్టిన రాళ్ళును దీకొట్టి క్రింద పడటం సమీపంలో ఉన్న బి సి (చాకలి )మహిళ లు ఎస్సి యువకులు బైక్ మీద పడిన తీరుకు బయపడి పెద్దగా అరవడంతో మిగతా జనం వచ్చి ఎస్సి యువకులను తిట్టడం జరిగింది.

అసలు రోడ్డ మీద రాళ్ళు ఎందుకు పెట్టేరు అని ప్రశ్నించిన ఎస్సి యువకులను దుషిస్తూ అక్కడ నుండి తరిమి వేసేరు. విషయం తెలుసుకున్న ఎస్సి కులం పెద్దలు సంఘటనా స్తలాన్ని చేరుకొని వివరాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించేరు. ఈ సంఘటన లో గ్రామంలోని కొందరు కమ్మ కులస్తులు ఉన్నారు. బి సి లు మరియు కమ్మ కులస్తులు ఎస్సి లకు క్షమాపణ చెప్పడం ఊరిలోని మిగతా కమ్మ వాళ్ళ అహం దెబ్బతిన్నది. పెత్తం దారుల ఆధిపత్యం తగ్గింది అనుకున్నారు.

దీనితో గ్రామ సర్పంచ్ నుండి మిగతా కమ్మ కులస్తులు మరసటి రోజు ఎస్సి పెద్దలను పిలిచి దాడి చేసి తిరిగి వారినే బెదిరించేరు. అహం తగ్గని వారు ఎస్సి కాలనీలోకి ట్రాక్టర్ మీద వచ్చి ఎస్సీలను అవమానిస్తూ మాట్లాడి బెదిరించేరు. ఈ సంఘటన ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. తమ సాటి ఎస్సీల మీద జరిగిన దాడికి ఎస్సి సంఘాలు గొట్టిపాడు వెళ్లి బాదితులకు మద్దత్తుగా నిలబడ్డారు. ఇక్కడ వరకూ కధ బాగానే ఉంది.

ఎస్సీల మీద ఎస్సియేతరులు దాడి చేస్తే ఎస్సి / ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ క్రింద కేసు నమోదు చెయ్యాలి. బాదితులకు తక్క్షనమే సహాయం అందించాలి, ఇదే ఎస్సి లలో చాలామంది నాయకులకు ఉపాది మార్గం అయ్యింది అని ఎస్సి ఉద్యమకారులు అంటూ ఉంటారు. అలాగే పైరవీలు చేసే ఇంకొక బ్యాచ్ కూడా ఉంటుంది.

అన్ని చోట్ల జరిగినట్లే పెద్ద గొట్టిపాడు లో కూడా ఎస్సి కుల సంఘాలు గ్రూపులు గా బయలుదేరి మేము అంటే మేము మీకు అండగా ఉంటాము అని బాదితుల పక్షాన చేరుతారు. దొడ్డిదారిన పెట్టందరులతో రాజీ ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ కుడా ఉంది. ప్రబుత్వ అనుకూల ఎస్సిలు , ప్రబుత్వ వ్యతిరేక ఎస్సీలు అంటే నాయకులు తాయారు అయ్యేరు.

పెద్ద గొట్టిపాడు లోకూడా ఎవరికి వారు ప్రకటనలు ఇస్తూ ఎస్సీల మీద దాడి చేసినవారిన అరెస్ట్ చేయించకుండా వారి తరుపునే రాజీ ప్రయత్నం చేసేరు. ఈ రాజీ ప్రయత్నంలో నాయకులకు డబ్బు లేదా పదవి ప్రతిఫలంగా ఇస్తారు. బాదితులను అరెస్ట్ చేసి దాడి చేసిన వారి మీద కనీస చర్యలు తీసుకోకపోవడం తెలుసుకున్న సోషల్ మీడియాలోని ఎస్సి యువత ఎస్సి నాయకుల మీద ఆగ్రహం వేలుబుచ్చేరు.

నిజాయితీగా పనిచేస్తున్న ఒకరు ఇద్దరు నాయకులను ఆ గ్రామం నుండి పంపించి వేసేరు. అయినా సరే నిబద్దత గల ఎస్సి నాయకులు , యువత చలో పెద్ద గొట్టిపాడు కు పిలుపునిచ్చేరు. ఈ చలో పెద్ద గొట్టిపాడు కార్యక్రమాన్ని పోలీసులు రెండు రోజులు ముందు నుండే అడ్డగించేరు. గ్రామంలో కర్ఫ్యూ వాతావరణం కల్పించేరు. నాయకులను ఇంటిలో దూరి ఎక్కడవారిని అక్కడ నిర్భంధించేరు.

ఒక పక్క కమ్మ కుల ప్రజాప్రతినిధుల అండతో, ప్రబుత్వం సహకారంతో ఎస్సి గ్రామాన్ని బయం నేల్కొల్పేరు. సందటిలో సడేమియా లాగా ప్రబుత్వ అనుకూల ఎస్సి నాయకులు పెద్ద గొట్టిపాడు గ్రామం ప్రశాంత వాతావరణం లో ఉంది అని పత్రికా ప్రకటనలు చేసేరు.

ఈ సంఘటన పెద్ద గొట్టిపాడు బాదితులకు నాయకత్వం వహిస్తున్న 70 సంవత్సరాల పెద్ద బాగ్యమ్మ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఎవరకు వారే ప్రబుత్వ పెద్దల వద్ద కమ్మ కుల పెద్దల వద్ద పెరుకోసమో , డబ్బులు కోసమో రాజీ ప్రయత్నాలు చేసేరు.సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి లా అక్కడే ఉంది.

బాదితుల మరియు  సంఘాల డిమాండ్ ప్రకారం దాడి చేసిన వారి మీద IPC 307, 354 ఎస్సి /ఎస్టీ కేసు నమోదు చెయ్యాలి, బాదితుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.ఇవి ఏమీ ఇప్పటివరకూ జరగకపోగా ఎస్సి నాయకత్వం మధ్య మరియు ప్రజల మధ్య అనైక్యత కు దారితీసింది. ఈ పరిణామాలే పెత్తం దారులకుకావలి. ఎస్సీల అనైక్యత వారి అధికార, పెత్తం దారి తనానికి యువపట్టు.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు ఎస్సీలను ఐక్యతతోను, సంఘటిత శక్తితోనూ నిరంతరం పోరాటం కొనసాగించాల్సి ఉంది. ఈ నిరంతర పోరాటం ద్వారానే మనలో ఆత్మగౌరవం, ఆత్మ విస్వస్వాసం పెరుగుతుంది అంటారు.

కానీ మేము నాయకులం అని ప్రకటించుకున్న కుల సంఘాల నాయకులు నేడు ఎస్సీల ఆత్మగౌరవాన్ని అగ్రకుల పాలకులకు తాకట్టు పెట్టి గులాం గిరి చేస్తున్నారు. ఈ గులాంగిరి వలన ఏ ఒక్క ఎస్సి రాజకీయ నాయకుడు పెద్ద గొట్టిపాడు ఎస్సిలకు అండగా నిలబడలేకపోయేరు. ప్రబుత్వం తమ వర్గాన్ని కాపాడుకోవటం కోసం ఈ గులాంగిరి నాయకత్వాన్ని అడ్డంపెట్టుకుని ఎస్సి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు.

ఈ గులాంగిరి ఈ ఒక్క పెద్ద గొట్టిపాడు తోనే ప్రారంభం కాలేదు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అగిరిపల్లి, గరగపర్రు, దేవరపల్లి లాంటి సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రబుత్వం మీద మాట పడనీయకుండా ఈ గులాంగిరి నాయకులు నాకుతూ ఉంటారు.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ వారసులం అనుకునేవారు 1929ఏప్రిల్ లో రత్నగిరి లో నిమ్నజాతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఒక్కసారి చదవాలి. తనను చంపుతాము అని ఉత్తరాలు రాసి బెదిరిస్తున్న వారిని కి సమాధానం ఇస్తూ ఇలాంటి బెదిరింపులకు , అడిరింపు లకు బయపడి ప్రజల ఉద్యమాన్ని విడనాడే నాయకుడిని కాను అని హెచ్చరిస్తారు. కానీ నేటి మన నాయకులు అగ్రకుల రాజకీయ నాయకత్వం హెచ్చరించక ముందే వీరే గులాంగిరి చేస్తున్నారు.

పెద్ద గొట్టిపాడు లో సాంఘిక బహిష్కరణ కొనసాగుతున్నా, దాడి చేసిన అసలు నిందుతుల మీద కేసు పెట్టకుండా తూతూ మంత్రం కేసులు ఇతరుల మీద పెట్టి పోలీసు యంత్రాంగం, అధికారులు, ప్రబుత్వ అనుకూల ఎస్సి కుల సంఘాలు నాయకులు ప్రయత్నిస్తున్నారు. అడుగు అడుగునా గోట్టిపాడు దారులు నిర్భందిస్తూ బయట వారు లోనకి వెళ్తే వాస్తవ సంఘటన బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది ఏమో అనుకుని ఇతరులను, నాయకులను, ప్రజా సంఘాల వారిని పెద్ద గొట్టిపాడు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు.

బా జ పా తో కలసి ప్రబుత్వం నిర్వహిస్తున చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎస్సీల మీద విపరీతంగా దాడులు చేస్తూ ఎస్సి లను అనిచివేయ్యాలి అని చూస్తుంది. ఈ అణిచివేత మనకి గరగపర్రు, దేవరపల్లి జేర్రిపోతుల పాలెం, నక్కల దిన్నె తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలు ద్వారా మనకి అర్ధమవుతుంది. రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరిగినా ఎస్సిల్లో సరైన నాయకత్వం రాకుండా పాలకులు రాజకీయ పదవులు ఆశ చూపించి మొత్తం కులాన్నే తాకట్టు పెడుతున్నారు.

ఎస్సి నాయకుల గులాంగిరి ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో ప్రజలే నిర్ణయించుకోవాలి.        

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here