గ్యాస్ లీక్:విశాఖపట్నం లోని ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం!

0
486
గ్యాస్ లీక్

గ్యాస్ లీక్; తెల్లవారు జామున మూడు గంటలైంది. అందరూ గాఢనిద్రలో వున్నారు. ఇంతలో ఒంటినిండా దద్దుర్లు, కళ్లల్లో మంటలు.. ఊపిరి అందడం లేదు. కడుపులో వికారం. ఏం జరుగుతోందో ఏమీ అర్థంగావడంలేదు. ప్రాణభయంతో కేకలు పెట్టారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు. శ్వాస అందక ఎక్కడి వారక్కడ కుప్పకూలిపోయారు. రోడ్ల మీద, వీధుల్లోనూ అదే దృశ్యం. చివరికి మూగ జీవాలు కూడా ప్రాణాలు వదిలాయి. పక్షులు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. పచ్చని చెట్లు నల్లగా మాడిపోయాయి.

విశాఖపట్నం లోని ఏ జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గోపాలపట్నం పరిధిలోని వెంకటాపురం పారిశ్రామిక వాడ లోని ఈ ఖర్మకారం లో విషవాయువు లీకైన దుర్ఘటన లో ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు, దాదాపుగా 200 మంది అస్తత్వవుగు గురయ్యారు. 
విషవాయవు లీకైన దుర్ఘటనలో పశువులు, పక్షులు చనిపోయియాయి. వాటి వివరాలు ఇంకా తెలియాల్సింది. 


ఎల్ జి పాలిమర్స్ లో గ్యాస్ లీకైన దుర్ఘటనలో ఒకతను బావిలో పడి చనిపోగా, మరొకరు మెడమీద నుండి పడి చనిపోయారు. 
ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో పరిశ్రమ నుండి వెలువడిన రసాయయన వాయువు దాదాపు గోపాలపట్నం నుండి 3 కి మీ మేర వ్యాపించింది.


గ్యాస్ లీక్ అవడం తో ప్రజలు ఊపిరితీసుకోవడం ఇబ్బంది గా ఉండి భీతిరిల్లారు. దీనితో పాటు కళ్ళు మంటలు, చర్మం పైన దద్దుర్లు, శ్వాస  పీల్చుకోవడం లో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఇల్లు కాలీ చేసి మేఘాద్రి గడ్డ ప్రాజెక్ట్ వైపు పరుగులు తీశారు. 


కరోనా మహమ్మారి వలన గత 40 రోజుల నుండి ఈ పరిశ్రమ మూత పడింది. లాక్ డౌన్ నిబంధనలు పాక్షికంగా సడలించి 33% కార్మికులతో పని ప్రారంభించుకునే అవకాశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. 


ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ ని గురువారం ఉదయం తిరిగి ప్రారంభించే క్రమంలో “స్టరైన్ ” అనే విషవాయువు / గ్యాస్ లీక్ లీకైనట్లు యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అంతే కాకుండా ప్రమాద హెచ్చరికగా సైరన్ మ్రోగించి స్థానికులను అప్రమత్తం చేశారు. 

ప్రమాద స్థలాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్బంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్లవారు జామున 3:30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు.  అధికారులు అప్రమత్తమై వెంటనే  సహాయక  చర్యలు చేపట్టారు. 


ప్రైవేటు ఆస్పిటల్స్ నుండిమరిన్ని అంబులెన్స్ లు ప్రమాదం జరిగిన ప్రదేశానికి తరలించారు. NDRF సిబ్బంది వెంటనే స్పందించి సహాయ చర్యలో పాల్గొనడం క్రింది ఫొటో లలో విడియో  చూడవచ్చు.


విశాఖ కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ జి ఫ్యాక్టరీ లో స్టెరైన్ అనే రసాయన వాయువు (గ్యాస్ లీక్ )లీకైందని అన్నారు.  కెమికల్ గ్యాస్ ను పీల్చడం ద్వారా స్థానికులకు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తల ఎత్తడంలో కె జి హెచ్ కు తరలించారని చెప్పారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి  

ఎల్ జి పరిశ్రమలో గ్యాస్ లీక్ దుర్ఘటన పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి  చెందారు. బాధితులకు తక్షణ సహాయం అందేలా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదం తమను ఎంతగానో కలచివేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు  


ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రమాదం జరిగిన ఎల్ జి ఫ్యాక్టీరీ ని మరి కాసేపట్లో సందర్శించనున్నారు 

గ్యాస్ లీకేజ్ దుర్ఘటన తాలూకా కొన్ని ఫొటోలు:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here