రమాభాయి అంబేడ్కర్: మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత!

0
370
 రమాభాయి అంబేడ్కర్

అమ్మ రమాభాయి అంబేడ్కర్ పేరు భారత దేశ చరిత్రలో ఒక పేజీ ని పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. తన త్యాగాల పునాదుల మీద బాబా సాహెబ్ ని ఒక మేను పర్వతం గా తాను నిలబెట్టింది. డాక్టర్ అంబేద్కర్ గారి ఒకొక్క మెట్టు వెనుక రమాబాయి అమ్మ పంటి బిగువున బిగపట్టిన బాధ తాలూకు గాయలున్నాయి.

డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ గురించి చెప్పుకుంటున్నప్పుడు అయన సహధర్మచారిణి అమ్మ రమాబాయి ని గుర్తు తెచ్చుకోవటం మన కనీస ధర్మం. ఒక మహా ఉద్యమానికి, మొట్ట మొదట సాక్షి, అభిమాని, మద్దతు తెలిపిన వ్యక్తి.

1906 లో శ్రీ భికు వాలగ్కార్ కుమార్తె అయిన రమాబాయి డా.అంబేడ్కర్ ను వివాహం చేసుకున్నారు. బాబా సాహేబ్ తనకు చదువు చెప్పేంచాలని ప్రయత్నం చేయడం జరిగింది ,ఈ ప్రయత్నం లో ఆమె కొద్దిగా వార్త పత్రికల హెడ్ లైన్ లు చదవవలగడం నేర్చుకుంది.

రమాభాయి చిన్నతనం లొనే తల్లిదండ్రులు మరణించటం తో బంధువులు తో బొంబాయి వచ్చేరు. డా.అంబేడ్కర్ చదువు, ఉద్యమాలతో బిజీ గా ఉండటంతో కుటుంబ బారమంతా రమాభాయి చూసుకోవాల్సి వచ్చింది.

డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ తండ్రి, మరియు సోదరుడు ఆనంద రావు మరణం కుటుంబ జీవితంలో ఆమెకు విషాదాన్ని నింపాయి.

డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఉన్నత చదువులు చదవాలి అని ఆమెకు ఆశగా ఉండేది.

డా.అంబేడ్కర్ చదువులు కోసం లండన్ వెళ్ళేటప్పుడు తన పూర్తి సహకారం అందించారు.  బాబా సాహెబ్ ఉన్నత చదువులకోసం తాను ఎన్నో బాధలను అనుభవించింది.ఇల్లు గడవని స్థితిలో అమ్మ పిడకలు చేసి అమ్మేవారు ఆ డబ్బులతో ఇల్లు గడిచేలా చూడటమే కాకుండా అందులో కొంత డబ్బు డాక్టర్ అంబెడ్కర్ చదువుకు పంపించేవారు .

కుటుంబ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు జరిగిన ఆమె ఏరోజు చలించిపోలేదు, సమస్యలకు లొంగిపోలేదు. భర్త ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నారు.

అమ్మ రమాభాయి జీవితం లో ఎన్నో విషాదాలు చూసింది. నలుగురు పిల్లలు మరణం,భర్త ఎప్పుడూ ఇంటి పట్టున ఉండక పోవటం, సమాజం లో రాజకీయ ఉద్రిక్తలు ఆమెను ఆందోళనకు గురిచేసాయి.

భర్త ఆరోగ్యం కోసం ప్రార్ధించేది. బాబాసాహెబ్ కి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆమెకు తెలియనిచ్చేవారు కాదు.

ఆమె మరింత ఆందోళన చెందటం డా. అంబేడ్కర్ కి ఇష్టముండేది కాదు. ఆమెకు దైవ భక్తి ఎక్కువ, ఎప్పుడూ ఉపవాస దీక్షలు చేసేవారు. డా బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎన్నిసార్లు చెప్పినా వినేవారు కాదు. పండరీనాధుడిని దర్శించాలి అనేది ఆమే చిరకాల కోరిక.

అమ్మ రమాభాయి అనారోగ్యం తో ఉన్నప్పుడు డా.అంబేడ్కర్ సానిత్యం కోరుకునేది. ఊపిరిసలపని పనులతో బాబాసాహెబ్ ఆరోగ్యం క్షీణిస్తున్న దళిత జాతుల కోసం అహిర్నిశలు శ్రమిస్తుంటే ఆమెకు చిరాకు కల్గించేది.

డా అంబేడ్కర్ తనకు దూరం అవుతున్నాడు అని ఆందోళన చెందేది. ఒక్కొక్కసారి ఆయన ని వెంటనే చూడాలి అని డా. అంబేడ్కర్ సభ ఎక్కడ ఉందొ అక్కడకి వెళ్ళేవారు.

పరిసరాలు మారితే మానసిక స్థితిలో మార్పు వస్తుంది ఏమో అని డా.అంబేడ్కర్ అప్పుడు అప్పుడు పక్క ఊర్లకి పంపేవాడు.

పూనా ఒప్పందం మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నా గాలి మార్పు కోసం ఆమెను ధార్వార్ తీసుకు వెళ్ళేరు. అయినా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు.

అమ్మ శ్రీమతి రమాభాయి అంబేడ్కర్ కి ఉన్నా చిరకాల మానసిక వేదన ఆమెను కొలుకోలేకుండా చేసింది.

ఆమె చివర గడియలలో ఉన్నప్పుడు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆమె చెంతనే ఉన్నాడు.

ప్రతి పురుషుడి విజయం వెనుక తన సహచరి కృషి వెలకట్టలేనిది. దళిత జాతి స్వేచ్ఛ, సమానత్వం ,విముక్తి వెనుక మాతా రమాభాయి త్యాగం వెలకట్టలేనిది, ప్రపంచ మేధావి తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ను తీర్చిదిద్ది దేశానికే దీపమయ్యారు.

తన బిడ్డలు గంగాధర్,రమేష్, ఇందిర మరియు రాజరత్న ఒక్కొక్కరుగా వైద్యం చేయించుకొనే స్తోమత లేక రాలి పోతున్నా
మొక్కవోని ధైర్యం అమ్మ సొంతం ,ఎంతటి బాధనైన తన గుండెల్లోనే దాచుకుంది.

సమానత్వం కోసం ఆయన పడుతున్న తపణకు చలించిపోయేది, ఇదంతా చేస్తూ ఆయన ఆరోగ్యo కాపాడుకోలేక పోతున్నారు అంటూ అనుక్షణం తపన పడేది.తన కొడుకు చనిపోయినప్పుడు బాబా సాహెబ్ చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి చూస్తూ తన కొంగు ను చింపి కొడుకు శవం మీద కప్పి తమ పరిస్థితి ని ఎదుటివారికి చూపించకుండా జాగ్రత్త పడిన విషయం తెలిస్తే బాబా సాహెబ్ కోసం ఆమె పడిన ఆవేదన ఇట్టే అర్థం అవుతుంది.

ఆమె జీవిత కాల త్యాగపలమే ఈ రోజున రాజ్యాంగం ద్వారా హక్కులు అణగారిన వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారు అనడం లో సందేహం లేదు.ఈ విషయాలు స్వయంగా డాక్టర్ అంబెడ్కర్ గారు 3 ఫిబ్రవరి 1928 న బహిష్కృత భారత్ పక్ష పత్రికలో తన సంపాదకీయం లో వ్రాయడం జరిగింది.

మే 27 1935 డా అంబేడ్కర్ సన్నిధిలో ఆమె కన్ను మూసింది.అప్పటికి వారు దాదార్ హిందూ కాలనీలో ఉండేవారు. అంత్యక్రియలకు దాదాపుగా 10వేల మంది హాజరు అయ్యేరు.

కుటుంబం లో ఏ కస్టము రాకుండా నడిపిన భార్య అంటే అమితమైన గౌరవం, ప్రేమ అంబెడ్కర్ కి. అందుకే అయిన రాసిన The thoughts of Pakistan అనే పుస్తకాన్ని ఆమె కు అంకితం చేసేరు అంబెడ్కర్.

అమ్మ శ్రీమతి రమాభాయి అంబేడ్కర్ వినయం, స్థితిస్థాపకత మరియు కరుణ యొక్క చిహ్నం.

అమ్మ రమాభాయి అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here