సోనియా గాంధీ:నాకు నా రాజీవ్ ని తిరిగి ఇవ్వండి!

1
534
సోనియా గాంధీ

సోనియా గాంధీ, నెహ్రు-గాంధీ కుటుంబ కోడలుగా ఇటలీ దేశం నుండి వచ్చిన ఆమే ఈ దేశం లో ఒక భాగం అయ్యింది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా టైమ్స్ , ఫోర్బ్స్ లాంటి మ్యాగజైన్స్ లో ముఖ చిత్రంగా ముద్రించారు. 

25, ఫిబ్రవరి 1968 రాజీవ్ గాంధీ ని వివాహం చేసుకున్నప్పటి నుండి ఆమె ఈ దేశం లో ఒక భాగం గా ఉంది. దేశ రాజకీయాలు క్లిష్టంగా ఉన్నప్పుడు భర్త రాజీవ్ గాంధీ ని తనకు ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి పంపింది. 

భర్త ను కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న ఆమె జాతీయ రాజకీయాల్లో అనూహ్యంగా ప్రవేశించింది. 2004, 2009 లో తన నాయకత్వంలో దేశ రాజకీయాలు, ఆర్ధిక స్థితి పటిష్టంగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంది. 

అలాంటి సోనియా గాంధీ మీద ఇప్పుడు జాతీయ మీడియా లో ఒక వర్గం చేస్తున్న తప్పుడు కథనాలకు ఆమె చలించిపోయారు. స్త్రీ ని గౌరవిస్తాం అని చెబుతున్న ఈ దేశంలో భర్తను కోల్పోయిన ఒక స్త్రీ ని ఫొటో మార్ఫింగ్ లు చేసి, తప్పుడు కథనాలతో వేధిస్తుంది. 

మీడియా, సోషల్ మీడియా లో సోనియా గాంధీ మీద వస్తున్న కథనాలకు ఆమె స్పందన ఏంటో ఆమె మాటల్లోనే చదువుదాం!

నాకు నా రాజీవ్ ని తిరిగి ఇవ్వండి! నేను తిరిగి వెళ్లిపోతాను.అలా తిరిగి ఇవ్వకపోతే నన్ను కూడా తాను కలిసిన ఈ మట్టిలోనే కలిసి ఇక్కడే చనిపోనివ్వండి.

– #సోనియా_గాంధీ.

ఎం జరిగిందో మీకు తెలియదు,
నేను ఎలా కలిసానో కూడా తెలియదు.
ఆ చిరునవ్వు, ఎత్తు, ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఆ కళ్ళు, ఆ తేజస్సు. నేను మొదటి సారి తనని చూసినప్పుడు ఎంత సేపు చూసానో నాకే తెలియదు.
నాతోటి మిత్రుణ్ణి అడిగాను ఇంత అందంగా వున్నాడు ఎవరు ఈయన అని, అతడు భారతీయుడు, పండిట్ నెహ్రు గారి కుటుంబం అని సమాధానం చెప్పాడు.
నేను అలానే చూస్తూ ఉండిపోయాను.

మరుసటి రోజు నేను భోజనానికి వెళ్ళినప్పుడు ,
ఆయన కూడా అక్కడ ఉన్నాడు.
ఆ రోజులు ఎంత సంతోషంగా వుండెనో, అదొక స్వర్గం.
మేము నదుల వెంట తిరుగుతూ, కారులో డ్రైవ్ చేసుకుంటూ, చేతులలో చేతులతో వీధుల్లో నడుస్తూ, సినిమాలు చూసాము.
మేము ఒకరికొకరం అసలు ప్రేమను వ్యక్తపరిచినట్టు నాకు గుర్తు లేదు అయినా అవసరం లేదు, ప్రతిదీ సహజమైనది, మేము ఒకరికోసం ఒకరు పుట్టారనుకున్నాం అప్పుడే మేము కలిసి జీవించాల్సిన సమయం వచ్చింది అని నిర్ణయించుకొన్నాం.

ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారు.
ఇంగ్లాండ్ వచ్చినప్పుడు రాజీవ్ ఇందిరాగాంధీ గారితో కొంచెం భయస్తులుగానే ఉన్నారు.
మేము వివాహ చేసుకోవాలంకుంటున్నాం అని దానికి మీ అనుమతి కావాలని ఆడిగాం దానికి ఇందిరా గారు మమ్మల్ని భారతదేశానికి రావాలని కోరారు.

భారతదేశం, నెను ప్రపంచంలోని ఏ మూలలోనైనా రాజీవ్‌తో కలిసి ఉండవచ్చు అనే ధైర్యం నాకుండేది.
ఇందిరా జి పెళ్లిలో నెహ్రూ జీ బహుకరించిన గులాబీ చీర నాకిచ్చారు అది నేను ధరించాను.
నేను, రాజీవ్ ఒక్కటయ్యము, నాకల నిజమైన వేల, ఎన్నో ఆశలతో నేను, రాజీవ్ ఇద్దరం కలిసి కొత్త జీవితం ఆరంభించి, నేను ఇక్కడే ఉండిపోయాను.

రోజులు ఎలా గడిచాయో అసలు గుర్తులేదు.
రాజీవ్ సోదరుడు విమాన ప్రమాదంలో మరణించారు.
ఇందిరా జికి మద్దతు అవసరం.
రాజీవ్ రాజకీయాల్లోకి రావడం ప్రారంభించాడు.
నాకు నచ్చలేదు, శాయశక్తులా అపగలగిన ప్రతి ప్రయత్నం చేసిన, కానీ మీరు భారతీయులు తల్లి ముందు భార్య మాటను ఎక్కడ వింటారు. అతను రాజకీయాల్లోకి వెళ్ళాడు, అతను వెళ్ళినాక నాకు సమయం కేటాయించడమే తగ్గింది.
అయిన దేశం కోసం కష్టపడుతున్నాడు, పేద ప్రజల అవసరాలు తీరుస్తాడు అనుకోని సర్దుకున్న.

అంత బాగుంది అనుకునే సమయంలో ఒక రోజు ఇందిరాజీ బయటకు వచ్చినప్పుడు కాల్పుల శబ్దం వినిపిచ్చింది.
బయటకువచ్చి చూస్తే రక్తపు మడుగులో ఇందిరాజి, ఆసుపత్రికి తీసుకెల్లేలోపల నా చేతులు రక్తపు ముద్దలో తడిసిపోయింది, చివరకు నాచేతిలోనే ప్రాణాలు విడిచారు.
మీరు ఎప్పుడైన చావుని ఇంత దగ్గరగా చూసారా?

రాజీవ్ పూర్తిగా దేశానికి చెందినవాడు.
నేను కూడా తనతో ప్రతి అడుగులో ఉన్నాను.
తర్వాత మా ఆయనను అలానే పొట్టనబెట్టుకున్నారు.
ఒక రోజు, అతని ముక్కలైన శరీరం కూడా ఇంటికీ తిరిగి వచ్చింది. ముఖం బట్టతో కప్పబడి ఉంది.
నవ్వుతున్న, గులాబీ ముఖం లోథాకు తిరిగి వచ్చింది.
ఈ రోజు, నా ఇంట్లో ఒకరు కాదు ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయాను.

ఈ దేశం నాది, నా దేశంతో మాత్రమే ఈ ప్రేమను పంచుకోనివ్వండి. నేను అతని చివరిసారిగా చూసిన ముఖాన్ని మరచిపోవాలనుకుంటున్నాను.
మొదట చూసిన ఆ రెస్టారెంట్, ఆ సాయంత్రం, ఆ చిరునవ్వు ఉంది చూడండి అది మాత్రమె గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. నేను ఈ దేశంలో రాజీవ్‌తో ఎక్కువ సమయం గడిపాను, రాజీవ్ లేకుండా ఇంకా ఎక్కువ సమయం గడిపాను.
ఒక గురుతర బాధ్యతను పోషించాను.
అధికారం ఉన్నంతవరకు, అది అతని వారసత్వాన్ని బద్దలు కొట్టకుండా నిరోధించాను.
అది ఈ దేశ శ్రేయస్సు యొక్క అత్యంత అద్భుతమైన క్షణాలను ఇచ్చింది.
ఇల్లు మరియు కుటుంబాన్ని నిర్వహించాను.
పరిపూర్ణమైన జీవితాన్ని గడిపాను.
నేను నా పని చేశాను.
రాజీవ్‌కు ఇవ్వని వాగ్దానాలను కూడా పరిష్కరించాను.

ప్రభుత్వాలు వచ్చి వెళ్తాయి.
ఇప్పుడు ఈ పరాజయాలు నాకు తేడా కలిగిస్తాయని మీరు అనుకుంటున్నారా?
మీ దుర్వినియోగం, విదేశీయుల బహుమతి, బార్ బాలా, జెర్సీ ఆవు, వితంతువు, స్మగ్లర్, డిటెక్టివ్…
అనేమాటలు, ఒక టీవీ ఛానెల్ నాపట్ల తప్పుగా ప్రవర్తించడం, ట్విట్టర్ మరియు ఫేస్బుక్లో అనియంత్రిత పోకడలతో తిట్లు..
అవి నన్ను బాధపెడుతున్నాయా?
లేదు, అవంటున్నవారిమీద ఖచ్చితంగా నాకు జాలి వేస్తుంది.

గుర్తుంచుకోండి, ప్రేమించబడిన వారి శవాన్ని చూడటం ఎంత బాధగా ఉంటుందో. చాలా బాధ పడ్డాను తరువాత మనస్సు రాయి అయ్యింది. అయితే మీరు నన్ను నన్ను ఇంకా ద్వేషిస్తున్నారు.
నేను ఈ రోజే తిరిగి వెళ్ళిపోతాను కానీ రాజీవ్‌ను తిరిగి ఇవ్వండి.
మీరు తిరిగి ఇవ్వకపోతే, శాంతియుతంగా, నన్ను రాజీవ్ చుట్టూ, ఈ మట్టిలో ఇక్కడే కలిసి పోనివ్వండి.

(సోనియా గాంధీ లేఖ నుండి సారాంశం!)

1 COMMENT

  1. Heart moving letter from Sonia ji.One must understand her feelings.We Indians claim that we respect women.But she is being haunted intentionally by Communal fringe forces .Most unfortunate.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here