#KRKRTrailer:సెగపుట్టిస్తున్నకమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ 

షేర్ చెయ్యండి

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సెగపుట్టిస్తున్న సినిమా ట్రైలర్. టాలీవుడ్ మరియు సోషల్ మీడియాలో ఈ సినిమా మీదనే చర్చ ఎక్కువ జరుగుతుంది. తెదేపా , జన సేన పార్టి మద్దత్తు దారులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద బూతు పంచాంగం మొదలెట్టారు. 

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ దీపావళి బాంబ్ లాంటిదని  అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసాడు. దీపావళి సందర్బంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సన్షేషనల్ సృష్టిస్తుంది. 

దర్శకుడు వర్మ ఏ సినిమా తీసినా సంచలనం అవుతుంది. ఈ సినిమా కు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీర్’ పేరుతొ బయో పిక్ తీసి ఒక సంచలనం అయ్యాడు. 

కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమా ట్రైలర్ బ్యాగ్రౌండ్ వాయిస్ ఓవర్ లో దర్శకుడు  వర్మ కథ గురించి వివరిస్తాడు. 
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పాత్రలు రిలీజ్ చేస్తూ, ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి కాదని, ఇందులోని పాత్రలలో ఎవరినైనా పోల్చుకుంటే అది నా తప్పు కాదని వర్మ ట్వీట్ చేసాడు. 

Also read  దళితులను మోసం చేస్తున్న ప్రకాశం జిల్లా వై. యెస్. ర్. సి పి!

 

ఈ సినిమా కు సంబంధించి మరొక పోస్టర్ ను ట్వీట్ గా పోస్ట్ చేసి, ఈ పోస్టర్ లోని పాత్రలు పేరు చెబితే తగిన బహుమతి ఇస్తాను అంటూ ప్రకటించాడు. 

#KRKRTrailer

 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య తీసిన సినిమా లు అన్నీ రాజకీయం నేపధ్యంగా, సన్షేషనల్ కథ లు ఎన్నుకుంటూ నిజ జీవిత చరిత్ర తెరకెక్కిస్తున్నాడు. 

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైన గుర్తుకు వచ్చేది తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి, మరియు జన సేన పార్టి ల నేపధ్యం అంతర్గత కధ గా తెరకెక్కుతుంది. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వున్న చంద్రబాబు నాయుడు ఓటమి, పార్టి పెట్టిన మొదటిసారి వై ఎస్ జగన్  ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ  ఈ కధ అల్లినట్లుగా ఉన్నాడు. 

అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ లో బెజవాడ లో అల్లర్లు, హత్యలు చూపెడుతున్నాడు. అంటే ప్రతిపక్ష బాబు పార్టి అధికార పార్టి ని అప్రదిష్ట చెయ్యడానికి అల్లర్లకు తెరదీసినట్లు గా ఉంది. 

Also read  సైరా నరసింహ రెడ్డి: మెగా రికార్డ్స్ సృష్టిస్తున్న మెగాస్టార్ సినిమా ట్రైలర్!

సినిమాని ముగించడానికి వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కోసం స్క్రీన్ ప్లే ఆ విధంగా తయారు చేసుకుని ఉండవచ్చు. 

అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ మరియు పోస్టర్స్ మీద జన సైనికులు విరుచుకుపడుతున్నారు. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి పిండ ప్రదానం చేస్తున్నారు. 

RGV

Pawan Kalyan fans tweet ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ తెలుగు రాష్ట్ర లలోని రాజకీయ కుల గజ్జి యొక్క నాడి బాగా పట్టుకున్నాడు అందుకే వరసపెట్టి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా లు తీస్తున్నాడు. 

ఒకప్పుడు క్యారెక్టర్ నటుడు పృద్వీ ఎన్టీర్ పాత్ర పోలిన పాత్ర వేస్తేనే సంచలనం సృష్టించింది. ఇప్పుడు వర్మ ఏకంగా ఆంధ్ర లోని ప్రధాన రాజకీయ పార్టీ ల నాయకుల వేషధారణ తో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీయడం గమనార్హం. 

ఇలాంటి నిజ జీవిత కధలు సినిమా కోసం ఎన్నుకోవడం పెద్ద సాహసమే. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు టాలీవుడ్ ప్రేక్షుల గుండెల్లో హైప్ క్రియేట్ చేసాడు. 

Also read  ఎన్నికల ఆరాటంలో వ్యవస్తీకృత మోసానికి పాల్పడుతున్న పార్టీలు!

వర్మ అంతకు ముందు తీసిన రక్త చరిత్ర కానీ, లక్ష్మీస్ ఎన్టీర్ కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. మరి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ని టాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. 
 

(Visited 1 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!