సావిత్రి భాయి పూలే: బేటీ బచావ్ ఐకాన్

షేర్ చెయ్యండి

సావిత్రి భాయి పూలే సాంఘిక దురాచారాలు, కులం, మతం యొక్క దురాచారాలను అరికట్టడానికి ఉద్యమించిన భారత మహిళ. సావిత్రి భాయి పూలే, తన భర్త జ్యోతి రావు ఫూలే సహకారం తో బాలికల విద్య, వితంతు పునర్వివాహం, బాల్య వివాహాలు, మరియు కుల వివక్ష కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. 

పంజాబ్ లో సావిత్రి భాయి పూలే మెమోరియల్ పార్కు కు దారి అనే బోర్డు ను  అమోలక్ సింగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చూస్తూ తన మనసులో సంతోషం కనబరుస్తున్నాడు. 

అమోలక్ సింగ్, సావిత్రి భాయి పూలేపేరు మీద మ్యాథమెటిక్స్ పార్క్ ను స్థాపించడానికి కృషి చేసిన వ్యక్తి. సాటి ఉపాద్యాయుల సహకారం తో అయిన ఈ గణిత పార్క్ ను ప్రారంభించాడు. 

ఈ పార్కు కు స్త్రీ హక్కుల కోసం పోరాడిన ఒక అణగారిన వర్గానికి చెందిన మహిళ యొక్క పేరు పెట్టడానికి కారణం అమోలక్ సింగ్ ఈ క్రింది అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 

స్త్రీల హక్కుల కోసం, సాంఘిక దురాచారాల నుండి విమోచన కల్పించాడని కి కృషి చేసిన స్త్రీ యొక్క కీర్తిని, అమె పోరారట స్ఫూర్తిని పంజాబ్ ప్రజలు తెలుసుకోవాలని సావిత్రి భాయి పూలే ను మేధామ్యాటిక్స్ పార్క్ కు పెట్టారు.

 
ఇతర రాష్ట్రాలతో పోల్చితే లింగ నిష్పత్తి చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. అయితే ఇటీవల పంజాబ్‌లోని ఒక గ్రామం 1848 లో మహారాష్ట్రలోని పూణేలోని భిడే వాడాలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించిన అసలు బేటీ బచావ్ ఐకాన్ సావిత్రిబాయి ఫులే విగ్రహాన్ని నిర్మించింది.

Also read  ట్విట్టర్ బ్లూ టిక్ వివాదం: కుల వివక్ష పై ట్విట్టర్ ఇండియా ని ఎండగడుతున్న బహుజనులు!

బాలిక విద్య ఆవశ్యకతను , సందేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పంజాబ్ లోని మాన్సా జిల్లాలోని సద్దా సింగ్ వాలా అనే గ్రామంలో భేటీ బచావ్ ఐకాన్ అయిన సావిత్రి భాయి ఫూలే పేరును విద్యార్థులు స్ఫూర్తి పొందాలని ప్రాధమిక పాఠశాల లో నిర్మించారు. 

అంతే కాకుండా విగ్రహం దగ్గర ఉన్న బోర్డు మీద “సావిత్రి భాయి పూలే ని ఎందుకు గుర్తించుకోవాలి?” అని ఆమె యొక్క జీవిత చరిత్రను పంజాభీ లో రాసి ఉంటుంది. 

సావిత్రి భాయి 1831 లో జన్మించారు. 10 ఏండ్లకే జ్యోతిరావు ఫూలే ని వివాహం చేసుకున్నారు. అప్పుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే వయస్సు 13 సం || లు. 

భర్త జ్యోతి రావు ఫూలే సహకారం తో సావిత్రిబాయి, చదువును కొనసాగించారు.అంతే కాకుండా దంపతులు ఇద్దరు కలిసి బాలికల కోసం 1848 లో పూణే లో  స్కూల్ స్థాపించారు. 

సావిత్రి భాయి పూలే ఆ స్కూల్ లో టీచర్ గా పనిచేసారు. ప్రాధమిక స్థాయి లో బాలికల కు మ్యాథ్స్ మరియు సైన్స్ ప్రవేశపెట్టడాన్ని ఆమె ప్రోత్సహించారు. 

అప్పట్లో బాలికల విద్య కు  అంత ప్రాముఖ్యత లేదు. తల్లితండ్రులు తమ ఆడపిల్లలను స్కూల్ కి కూడా పంపేవారు కాదు. స్త్రీ కి విద్య అవసరం లేదనుకునే కాలం అది. 

బాలికలకు విద్య అందించడానికి  సావిత్రి భాయి పూలే కి ఆనాటి మనువాద సమాజం ఎర్ర తివాచి ఏమి పరచలేదు. అనేక అడ్డంకులు సృష్టించారు. 

ఒక శుద్ర కులానికి చెందిన మహిళ విద్యాబోధనలు చెయ్యడమా అంటూ ఆమె వెళ్తుంటే రాళ్లు, బురద సావిత్రి భాయి పూలే మీద వేసేవారు. 

Also read  దళిత రాజకీయ పార్టీ సాధ్యమేనా? తెలంగాణా, ఆంధ్రాలో దళితులు రాజ్యాధికారం సాధించగలరా?

ఆమె భర్త  జ్యోతిభా ఫూలే  సంపూర్ణ మద్దతు ఉండటం చేత బ్రాహ్మణుల ఆదేశాలకు  వ్యతిరేకంగా  ఆమె పనిచెయ్యగలిగారు. 
మహాత్మా ఫూలే మరణం తరువాత కూడా మొక్కవోని దీక్షతో ఆమె తన యొక్క మిషన్ ను కొనసాగించింది. 

1897 లో పూణేలో తన సొంత శ్రేయస్సు గురించి ఆలోచించకుండా ప్లేగు సంభవించినప్పుడు ఆమె పేదల కోసం ఒక క్లినిక్ తెరిచింది. దురదృష్టవశాత్తు, రోగులకు సేవ చేస్తున్నప్పుడు ఆమె స్వయంగా ఈ వ్యాధి బారిన పడి 1897 మార్చి 10 న కన్నుమూసింది.

“స్వాతంత్య్రం తరువాత, రాజకీయ నాయకులు సావిత్రి భాయి పూలేను మరచిపోయారు ఎందుకంటే ఆమె బోధనలు వారికి ప్రమాదకరమైనవి. ప్రస్తుత ప్రభుత్వాలు దళితులకు, మహిళలకు సమాన హక్కులు ఇవ్వలేవు. 

పురుషులకన్నా ఉన్నత స్థితి లో ఉన్న మహిళా నాయకూరలను వారు జీర్ణించుకోలేరు, లేదా అందరికీ విద్యను అందించలేరు. 

అలాంటప్పుడు సావిత్రి భాయి పూలే  వారి హీరో ఎలా అవుతారు? ”విగ్రహం దగ్గర ఉన్న బోర్డు మీద చివరి పేరాలో ఆమెకు నివాళి అర్పించడం అంటే ఆమె యొక్క మిషన్ అయినటువంటి అందరికి విద్యను అందిచడమే. 

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమోలక్ సింగ్ భారతదేశంలో మహిళల హక్కుల కోసం, విద్య కోసం పోరాడిన ఒక గొప్ప నాయికి సావిత్రి భాయి పూలే అంటారు. 

సావిత్రి భాయి పూలే గురించి ఉత్తర భారతదేశంలో గాని, యావత్ భారతదేశంలోని ప్రజలకు పెద్దగా తెలియకపోవడం ఈ దేశ దౌర్భాగ్యం అంటాడు అమోలక్ సింగ్. 

సావిత్రి భాయి పూలే విగ్రహం తయారు చెయ్యడానికి రూ. 50,000 /- ఖర్చు చేసారు. ఢిల్లీ లో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. 

Also read  మహిళా అబ్యుదయవాది బాబాసాహెబ్ డా. అంబేడ్కర్!

మాన్సా లోని ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు ఈ మొత్తాన్ని తమ జీతాల నుండి ఖర్చు చేసారు. అలాగే పార్కు కోసం అయిన రూ 1.70 లక్షలు మున్సిపాలిటీ నుండి కాకుండా కూడా సొంత నిధులు, స్థానిక సంఘం యొక్క నిధుల నుండి ఖర్చు పెట్టారు. 

సద్దా సింగ్ వాలా గ్రామంలోని ప్రాధమిక పాఠశాల లో 128 మంది విద్యార్థులు ఉండగా వారిలో 78 మంది బాలిక లు . 7 మంది ఉపాధ్యాయులలో 3 మహిళా టీచర్స్. వారు కూడా నెలకు రూ 5000 / – జీతం తో కాంట్రాక్టు అగ్రిమెంట్ తో పనిచేస్తున్నారు. 
భారతదేశంలో ఆర్య వర్ణాల వారి కీర్తినే చరిత్రగా రాసుకున్నారు. వారి నే 21 వ శతాబ్దంలో కూడా గౌరవిస్తూ వారి బూటకపు చరిత్రను ప్రజల మీద రుద్దుతున్నారు. 

బ్రాహ్మణ వితంతు బాలిక లను శిరోముండనం చేసి నాలుగు గోడల మధ్యనే బంధించడాన్ని సావిత్రి భాయి పూలే తీవ్రంగా వ్యతిరేకించారు. వారి విముక్తి కోసం తన మీద రాళ్ళ దాడిని సైతం లెక్క చెయ్యలేదు. 

నేడు భారతదేశంలో సాంఘిక సంస్కరణ వాదులు గా కీర్తింపబడుతున్న వారు వారి సొంత కులం లోని మూడాఛారాల కోసం మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు. 

శూద్ర కులం లో పుట్టి యావత్ సమాజం యొక్క చైతన్యం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి ధన్యజీవి సావిత్రి భాయి పూలే. ఆమె జీవిత చరిత్ర చదవడం నేటి మహిళకు ఎంతో ఉపయోగకరమైంది.  

(Visited 27 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!