ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర చదవండి…సినిమాకు ముందు!

షేర్ చెయ్యండి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి పేరుతొ తీసిన సినిమా నేడు దేశవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ఎవరు? అయన జీవిత చరిత్రకు వున్న ప్రాధాన్యత ఏంటి, అసలు సినిమా కథ కల్పితమా లేక నిజమైన చరిత్రనా అని తెలుసుకోవాలి 

విజయనగర రాజులు తళ్ళికోట యుద్ధంలో బహమని సుల్తానుల చేతిలో ఓడిపోయారు. సామంతులుగా వుండిన పాలెగాళ్ళు తమ కత్తికి అడ్డం లేకుండా నియంతల వలె వ్యవహరింపసాగారు.తామే రాజులమని గొప్పగా విర్రవీగేవారు.ప్రజలను పీడించుకుని శిస్థులు వసూలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఉండేది అప్పటి జమీన్ల నిర్వహణ.

1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పుడు రాయలసీమ నైజాం వశంలో ఉండేది. నైజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. పాలెగాళ్ళు బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చారు.

ఒక్క కడపజిల్లాలోనే ఆనాడు 80మంది పాలెగాళ్ళుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. దత్తమండలానికి మొట్టమొదటి కలెక్టర్ సర్ ధామస్ మన్రో. పాలెగాళ్ళ పారంపర్య హక్కులను రద్దుచేసాడు. వారికి నెలసరి ఫించన్ ఏర్పాటు చేశాడు.

ఈనాటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామనికి పాళెగాడు పెద్దమల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. కోయిలకుంట్ల తాలూకా లోని ఉయ్యాలవాడ జాగీర్‌ను ఆంగ్లేయులు వశం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుండి 30 వేల రూపాయలకు పైగా రెవిన్యూ రాబడి వుండేది.

జాగీర్‌ను వశం చేసుకున్న తెల్లదొరలు పెద్దమల్లారెడ్డి కుటుంబానికి 70 రూపాయల ఫించన్ ఏర్పాటు చేశారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుదా 11 రూపాయలు 10 అణాలు 8 పైసలు ఫించన్ వచ్చేది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నరసింహారెడ్డి తల్లి నీలమ్మ మాతామహుడైన (తల్లి తండ్రి) నొస్సం జమీందార్ జయరామరెడ్డికి ఏటా 22 వేల రూపాయల రెవిన్యూ వచ్చే జాగీర్‌ను వశం చేసుకుని నెలకు వేయి రూపాయల ఫించన్ ఏర్పాటు చేశారు. నొస్సం జమీందార్ నిస్సంతుగా మరణించడంతో ఫించన్ మొత్తం ఆపివేయబడింది.ఆ విదంగా కూడా నరసింహా రేడ్డికి ఆర్ధికంగా దెబ్బ తగిలింది.

తెల్లదొరలు క్రమంగా కట్టుబడి మాన్యాల/పాలె గాళ్ల వంశ పారంపర్య హక్కును రద్దు చేసి మాన్యాలను స్వాధీనం చేసుకోవడంతో కట్టుబడి బంట్రోతుల్లో అసంతృప్తి చెలరేగింది.

1846 జూన్ నెలలో తనకు రావలసిన మే నెల ఫించన్ పైకం కోసం, చీటి వ్రాసి కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపాడు నరసింహారెడ్డి. అదివరకు, పైకం పంపుతున్న తాసిల్దార్(రాఘవాచారి, రెపు ఈయన పై కూడా ఒక గొప్ప చిత్ర రాజం రావచ్చు..ఒక ప్రభు భక్తి పరాయణూని చరిత్రగా ఒక గొప్ప హీరో గారి నటనతో) ఈసారి వచ్చిన మనిషిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేకాని ఫించన్ పైకం యివ్వనన్నాడు.

Also read  How a group of six Dalit women in Andhra empowered with journalism

రెడ్డి ఉదాసీనంగా వుండటం గమనించిన తహసీల్దారు తట్టుకోలేక పొయాడు, ప్రభు భక్తి పరాYఅణతన ఒక సూద్రుడు తనకు విలువ ఇవ్వకపోవడాన్ని కంపెనీ పెద్దలకు చేర వేసి,వారి అనుమతితో ఓ వారంట్ యిచ్చి బంట్రోతులను పంపాడు.అయితే ఆ వచ్చిన వాళ్ళను తన్ని తరిమేశాడు నరసింహారెడ్డి. ఈ విధంగా నరసిమ్హా రెడ్డి దేశ ద్రోహిగా ముద్రపడ్డాడు.

ఇలా మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లు కొండజాతుల వాళ్ళు నరసింహారెడ్డిని కలిసారు.నరసింహారెడ్డితో కలిసి దాదాపు 9 వేల మంది జమైనారు. వనపర్తి, మునగాల, జటప్రోలు జమీందార్లు పెనుగొండ, ఔకు, జమీందార్లు, హైదరాబాద్‌కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్, కొందరు బోయలు, చెంచులు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

ఇక్కడ జమీన్లు పొయ్యిన భాదా, వాళ్లకు రావలసిన భరణం పోయిన వేధనా తప్పించి ఎక్కడా ప్రజలపైనా దేశంపైనా..కనీసం వాళ్లు నమ్మినధర్మం పైన కూడా గౌరం లేకుండా అనేక కులాలు, మతాలుగ ఒక గుంపునుఏర్పాటు చేసుకున్నారు. దీనితో నరసింహారెడ్డిపైనా, ఇక మిగిలిన వారిపైనా కంపెనీ ప్రభుత్వం నిఘాపెట్టింది.

1846 జూలైలో 10 (7, 8 తేదీలు కూడా కావచ్చు) నరసింహారెడ్డితో సహా 9 వేల మంది చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రామంపై దాడి చేశాడు. మిట్టపల్లి వద్ద పోలీసులు వారిని అటకాయించారు. ఈ పోరాటంలో ఒక దఫేదారు తొమ్మిదిమంది బంట్రోతులు మరణించారు.ఆ విషయం ప్రభు బక్తి పరాయణులు కడప కలెక్టరుకు సమాచారం ఇచ్చారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిబృందం మరుసటి దినం కోయిలకుంట్ల ట్రెజరి పైబడి ఆనాడు ఖజానాలో వున్న, ఎనిమిది వందల అయుదు రూపాయల పది అణాల నాలుగు పైసల మొత్తాన్ని దోచుకున్నారు. తహసీల్దారు రాఘవాచారి అవమానాన్ని గుర్తు చేసుకుని రాఘవాచారి తలనూ, ఆతని రక్షకుడు హరిస్సింగు తలనూ నరికి తీసుకెళ్ళి దాసేస్తారు. ఇంకా ఖజానా సిబ్బందిని అయిదుగురిని చంపివేశారు.

కలెక్టర్ కడపలోని కమాండింగ్ ఆఫీసరు సహాయంతో. కర్నూలు నుండి గుర్రపు దళాన్ని పిలిపించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, తాను దాడే చెయ్యలేదనీ, అది చేసింది బహుచా ఔకు రాజు తమ్ముడై ఉండ వచ్చనీ బొంకుతాడు.

Also read  కాన్షీరాం: ది లీడర్ మాన్యశ్రీ కాన్షీరాం!

అప్పటికి విచారణ జరుగుతుండగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాతో పాటు, చుట్టుపట్ల గ్రామాలను దోచుకున్నాడు.

కడప నుండి వచ్చిన కెప్టెన్ నాట్ పెద్ద సైన్యంతో బయలుదేరాడు. జె. ఎచ్. కొక్రీన్ మరో సైనిక దళంతో రుద్రవరం వద్ద, నాట్‌ను కలుసుకునే ఏర్పాటు చేశాడు. నరసింహారెద్ది తన అనుయాయీలతో గుత్తి కనుమ మీదుగా ముండ్లపాటు చేరుకుంది.

అక్కడికి మూడుమైళ్ళ దూరంలోని కొత్తకోటలోని పాడుపడిన కోట, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి కార్యాలయం అయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రతి కనుమ దగ్గర కొంత కట్టుబడి సిబ్బందిని కాపలా వుంచాడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 5 వేల బలగాన్ని పాట్సన్‌ను గిద్దలూరు వద్ద అడ్డుకున్నాడు. పాట్సన్ వద్ద సైనికులు వందమందే. ఆరు గంటలసేపు నరసింహారెడ్డి మనుషులకు, పాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణించారు. చీకటి పడటతో యిరుపక్షాల వారు తమదారిన తాము వెళ్ళిపోయారు.

కొండలలోని కాలిబాటలు అడ్డదారులు సైనికులకు పరిచయం లేవు. నరసింహారెడ్డి మనుషుల కోసం సైన్యం కొండలన్నీ గాలించింది. గ్రామాధికార్ల మీద, కట్టుబడిదార్ల మీద కేసులు మోపారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాలెగాణ్ణి పట్టిస్తే వేయి రూపాయలు, అతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వ ప్రకటించింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన కుటుంబాన్ని కొత్త కోటకు తరలించాడు. ప్రభుత్వ సైనికులు ఆ ప్రాంతంపై దాడి జరిపినపుడు హైదరాబాద్ రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాల్‌ఖాన్‌కు, నరసింహారెడ్డి మధ్య జరిగిన ఉత్తరప్రత్యత్తరాలను పట్టుకున్నారు. ఆ పత్రాలు విచారణలో ప్రభుత్వానికి బలమైన సాక్ష్యాలయ్యాయి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి ముగ్గురు భార్యల ద్వారా ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్ళూ ఉండేవారు. నరసింహారెడ్జి కుటుంబాన్ని పట్టుకుని ప్రభుత్వం, వారిని కడపలోని ఒక బంగళాలో వుంచారు. మెరుపుదాడి చేసి కుటుంబ సభ్యులను విడిపించాలని కొండలమీదుగా ప్రయాణం చేసి కడప చేరాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

1846 అక్టోబర్ 6వ తేదీన ఎర్రమల నలమల కొండల మధ్యనున్న పేరసామల లోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 40, 50 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపారు. వందమంది దాకా గాయపడ్డారు. కాలికి గుండు దెబ్బ తగలడంతో రెడ్డి ఫిరంగి దళాలకు పట్టుబడినాడు.

Also read  నోటా సినిమా ఆపాలని చూస్తున్నారు: విజయ్ దేవర కొండ

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.

కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు. అది మామూలు శిక్ష కాదు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా తీర్పు.

1827 ఫిబ్రవరి 22 న ఫలానాచోట ఉదయం 7 గంటలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని ఉరి తీస్తారని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. కాక్రేన్ ఎదుట ఉరి తీశారు.

ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు చూసారు.ఆతని తలను కోటకు కట్టి 1877 వరకూ వేలాడదీసి ఉంచడం ద్వారా ఈలాంటి తిరుగుబాట్లను అరికట్టాలనుకుంది బ్రిటిష్ ప్రభుత్వం..

అయితే ఇందులో ఉన్న వాస్తవాలను సినిమాలో ఎంత చూపిస్తున్నారు..?

కప్పం వసూళ్లతో ప్రజల్లో పెట్రేగిన అసహనాన్ని చూపించ గలరా? అంత గొప్ప నాయకుడిని ప్రభుత్వం ఉరి తీస్తుంటే ప్రజలు అప్పుడు కానీ తదనంతర కాలంలో కానీ తిరిగి ఎందుకు తిరుగుబాటు చెయ్యలేకపోయారు..?

అ తాశీల్ దార్ కనుక నరసింహా రెడ్డికి కనుక రవలసిన ఆ 12 రూపాయలను కనుక ఇచ్చి ఉంటే,ఈయన తిరుగబడి ఉండే వాడా? బ్రిటీష్ వాళ్ల్లు కనుక తాశీల్ దారు మాటకన్నా..ఈ కధానాయకునికి విలువ ఇచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది?

ఓ యబ్బ చరిత్ర చదవ కూడదబ్బా.. చదివిన కాడి నుండీ..ఇలాంటివి చాలా డౌటింగులు వచ్చి చస్తయి..లే పొతే మాములు మనుషులు చూసినట్లే సినిమాని చూసి హీరోని ఆహా..ఓహో అనేసి మళ్లీ పనిలో పదిపోయ్యే వాళ్లం కదా..

–>>తిక్త 👁

 
 
 
(Visited 1,363 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!