VHP యొక్క రామ రాజ్య రధ యాత్ర విభజన మత రాజకీయం కోసమేనా!

షేర్ చెయ్యండి

విశ్వ హిందూ పరిషత్(VHP) తలపెట్టిన రామ రాజ్య రధ యాత్ర కేరళా నుండి తమిళనాడు సరిహద్దుల్లోకి ప్రేవేసించింది. మత సామరస్యం తో ప్రశాంతంగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలో VHP నిర్వహిస్తున్న ఈ రధ యాత్ర ఉద్రిక్తలకు దారి తీస్తుంది అని తమిళనాడు ప్రతిపక్ష పార్టి DMK మరియు ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు పేర్కొన్నాయి.

మనితనెయ మక్కల్ ఖచ్చి(MMK) పార్టీ కార్యకర్తలు,ప్రజా సంఘాలు VHP రామ రాజ్య రధ యాత్రను అడ్డుకుంటాం అని ప్రకటన చేసేరు.

తమిళనాడు ముక్య మంత్రి పళని స్వామీ VHP రధ యాత్ర కు మద్దత్తు ఇవ్వడం సమర్ధించుకున్నారు. ప్రబుత్వం దృష్టిలో అన్ని వర్గాలు సమానమే అని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే రధ యాత్ర ను అడ్డుకుం పోలీసులు ముందస్తు గా ౩౦౦ మందిని అరెస్ట్ చేసేరు వీరిలో VCK పార్టీ అధినేత తిరుమవళవన్ మరియు MMK నేత జహీరుల్లా ఉండటం విశేషం

ప్రజలను మతాల వారిగా విభజన చెయ్యటానికి VHP రధ యాత్ర లక్ష్యం అంటూ సినీనటులు మరియు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పేర్కొన్నారు. VHP రామ రధ యాత్ర “విభజన రాజకీయ యాత్ర” అని కమల్ హసన్ పేర్కొన్నారు.

రాజకీయాల లోకి రావాలి అని ఆసక్తి తో చూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రెస్ కి రిలీజ్ చేసిన ప్రకటన లో ఎలాంటి మత ఉద్రిక్తలు కలిగించే చర్య అయినా అడ్డుకోవాల్సిందే అని ప్రకటించేరు.

Also read  మతత్వం: రాజకీయ ప్రేరేపిత మతత్వం మత ఉగ్రవాదానికి కారణమా !

తమిళనాడు శాసన సభ లో ప్త్రతిపక్ష నేత DMK నాయకుడు స్టాలిన్ అసెంబ్లీ లో VHP రధ యాత్ర అడ్డుకోవాలి అంటూ అసెంబ్లీ కార్యకలాపాలు జరగా కుండా అడ్డుకున్నారు. స్టాలిన్ DMK శాసన సభ్యులతో కలసి అసెంబ్లీ ముందు నిరసన ప్రదర్శన చెసరు. తమిళనాడు లో ప్రవేశించిన VHP రామ రాజ్య రధ యాత్ర మత కలహాల కు ప్రేరణ అవుతుంది అని స్టాలిన్ ఆరోపించేరు. అయోధ్య రామ జన్మభూమి రామాలయం ఇప్పటికీ సుప్రీం కోర్టు లో ఉండగా అదే పేరుతొ రధ యాత్రలు చెయ్యడం కోర్టు ధిక్కారం అని స్టాలిన్ ప్రకటించేరు.

రధ యాత్ర కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న DMK, VCK మరియు ముస్లిం సంఘాల నిరసనకారులను చెన్నై , అంబుర్, కన్యాకుమారి, వెల్లూర్, తిరునవెల్లి మరియు ఇతర ప్రాంతాలలో అరెస్ట్ చేసేరు.

కమల్ హసన్ ట్వీటర్ ఖాతాలో AIADMK ప్రబుత్వం ఎవరో రాగానికి నృత్యం చేస్తుంది అంటూ రామ రాజ్య రధ యాత్ర అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రబుత్వాన్ని విమర్శించేరు.

 తమిళనాడు హిందూ ఆధ్యాత్మిక గురువులకు ముక్య కేంద్రం. అలాంటి తమిళనాడు లో VHP రామ రాజ్య రధ యాత్రను అడ్డుకోవాలి అని చూడటం కరెక్ట్ కాదు అని   BJP తమిళనాడు శాఖ అధ్యక్షుడు తమిలిసాయి సుందరాజన్ పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం మాట్లాడుతూ’రధ యాత్ర నిర్వాహకులు ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా, లేదా మత పరంగా విభజించే మాటలు మాట్లాడినా నిర్వహుకులపై కటిన చర్యలు తీసుకుంటాము అని ప్రకటించేరు.

RSS కూటమిలోని VHP నేడు హటాత్తు గా దక్షణాది రాష్ట్రాలలో లేదా రామ రాజ్య రధ యాత్ర చెయ్యడం ఉత్తరాది రాష్ట్రాల మత ప్రేరణ లేదా మత తత్త్వం దక్షణాది రాష్ట్రాలలో కుడా కలిగించాలనే కుట్ర తో చేస్తున్నారు. తమిళనాడు కంచి కేంద్రంగా హిందూ మతం దేశ వ్యాప్తంగా అభివృద్ధి చెందింది, అదే తమిళనాడు నాస్తిక ఉద్యమానికి కేంద్ర బిందువు.

Also read  కీలు బొమ్మల కాలం-ఎస్సీల రాజకీయం!

పెరియార్ రామస్వామి యొక్క ప్రబావం తీవ్రంగా ఉన్న ప్రాంతం. హిందూ మత కుల వ్యవస్తలో అత్యంత కటిన మైన బ్రాహ్మణ వ్యవస్థను నడిపించింది కుడా దక్షణాది వారే. అలాగే శైవం , వీర శైవ హత్యలు చేసుకుందీ దక్షణాది వారే. క్రిస్టియన్స్ మత వ్యాప్తికి పునాది దక్షణాది కేంద్రం ఇలాంటి ప్రాంతంలో ఇప్పటి వరకూ కులం పేరుతొ హత్యలు జరిగేయి కానీ మత పరంగా జరగడం చాల తక్కువ. ఒక విధంగా చెప్పాలి అంటే మత సామరస్యం కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో నేడు హిందూ రాజకీయ శక్తులు , హిందూ జాతీయవాదం పేరుతొనో లేక మతం పేరుతొ “వభజన మత రాజకేయాలు” చెయ్యడం ఈ ప్రాంతాన్ని అస్తిరపరచడం కోసమే తప్పా రామ రాజ్యం కోసమో లేకా ఇంకొక రాజ్యం కోసం కాదు.

అయోధ్యలో రామ మందిరం అనేది కోర్టు పరిదిలో ఉంది. ఇరు పక్షాలు ఇప్పటికే కోర్టు బయట చర్చలు జరుపుతున్నారు. మధ్య వర్తులు కుడా ముందుకు వస్తున్నారు. వందల సంవత్సరాల సమస్య ఇరు పక్షాల శాంతి యుత చర్చల ద్వారా పరిక్షారం చేసుకునే అవకాసం ఉంది. అందుకు ముస్లిం సంఘాలు కుడా ఆహ్వానిస్తున్నారు. రామ మందిరానికి అబ్యంతరం చెప్పడం లేదు. కానీ  RSS కి కావాల్సింది వేరే. కేంద్రంలోని BJP ప్రబుత్వానికి కావాల్సింది వేరే. తమిళనాడు లోని అనిచ్చితి రాజకీయాలను, ఆసరాగా చేసుకుని, వ్యక్తుల స్వార్ధ రాజకీయాలను అడ్డం పెట్టుకుని RSS-BJP సమాజాన్ని మత పరంగా విభజన చెసే ప్రయత్నం. దీనిని ప్రజాస్వామ్య వాదులు, దేశ బక్తులు, వామ పక్ష, లౌకిక వాదులు రాజకీయంగానే అడ్డుకోవాలి. ప్రజలను RSS కుట్రల నుండి విముక్తి కల్పించాలి. లేదంటే బారత దేశం మరో సిరియా అయ్యే ప్రమాదం ఉంది. తాలిబాన్ల నుండి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నారు, కానీ బారతీయులు తాలిబాన్ లాంటి మతోన్మదుల ప్రేరేపిత కుట్రలకు బలి కాకూడదు.        

Also read  మోడీల అవినీతిపై చర్చను అడ్డుకున్నహోదా!

 

 

 

 

 

(Visited 37 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!